సంబంధిత వార్తలు
- విశాఖ ఉక్కు ప్రైవేటీకరణపై కేంద్రం వెనకడుగు వేసింది : మంత్రి కేటీఆర్
- విశాఖ స్టీల్ ప్లాంట్‌పై ముందడుగు లేదు.. కేంద్ర మంత్రి ఫగ్గన్‌సింగ్
- కోడికత్తి కేసులో ఎన్.ఐ.ఏ కోర్టులో సీఎం జగన్ పీఏ
- వామ్మో ఆంధ్రా రోడ్లా.. నరకాన్ని తలపిస్తున్నాయ్.. బీజేపీ ఎంపీ సోయం బాపురావు
- 15 ఏళ్ల బాలికపై కన్నతండ్రి అత్యాచారం.. గర్భం దాల్చిన బాలిక
గీతం వర్శిటీలో ప్రభుత్వ భూముల స్వాధీనం.. కంచె నిర్మాణం.. ఉద్రిక్తత
విశాఖపట్టణంలోని గీతం విశ్వవిద్యాలయంలో ఉన్న ప్రభుత్వ భూములను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. పోలీసుల బందోబస్తు మధ్య గీతం వర్శిటీలోకి ప్రవేశించిన అధికారులు.. ప్రభుత్వ భూముల సరిహద్దులను గుర్తించి కంచె నిర్మాణం చేపట్టారు. నిర్మాణ సామాగ్రితోనే లోనికి వెళ్లిన అధికారులు ఆగమేఘాలపై ఈ కంచె నిర్మాణం పూర్తి చేశారు. అంతకుముందు వర్శిటీకి దారితీసే రోడ్లపై రెండు కిలోమీటర్ల ముందే బారికేడ్లు ఏర్పాటు చేశారు. ఆ రోడ్లపైకి గుర్తింపు కార్డులు చూపించిన స్థానికులనే అనుమతించారు. దీంతో యూనివర్శిటీ ప్రాంగణంలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది.
వర్శిటీలో కంచె నిర్మాణ పనులను శుక్రవారం తెల్లవారుజామున 2 గంటల నుంచి చేపట్టారు. ఇందుకోసం అటు వైపు వెళ్లే అన్ని రహదారులను పోలీసులు మూసివేశారు. ముఖ్యంగా, ఎండాడ, రుషికొండ మార్గాల్లో వర్శిటీకి రెండు కిలోమీటర్ల ముందే బారికేడ్లను ఏర్పాటు చేసి స్థానికుల రాకపోకలపై ఆంక్షలు విధించారు. ఐడీ కార్డులు చూపించిన స్థానికులను మాత్రమేలోనికి అనుమతించారు. కాగా, ఈ యేడాది జనవరిలో గీతం కళాశాలకు ఆనుకుని వున్న 14 ఎకరాల ప్రభుత్వం భూమిని అధికారులు గుర్తించి స్వాధీనం చేసుకున్న విషయం తెల్సిందే.
