సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఠాగూర్
Last Updated : సోమవారం, 10 ఏప్రియల్ 2023 (17:16 IST)

కోడికత్తి కేసులో ఎన్.ఐ.ఏ కోర్టులో సీఎం జగన్ పీఏ

ys jagan
తనపై కోడి కత్తితో దాడి చేసిన కేసులో బాధితుడుగా ఉన్న ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి వ్యక్తిగత సహాయకుడు (పీఏ) జాతీయ దర్యాప్తు సంస్థ ప్రత్యేక కోర్టుకు హాజరయ్యారు. గత 2018లో టీడీపీ ప్రభుత్వ హయాంలో విశాఖ విమానాశ్రయంలో శ్రీనివాస్ అనే వ్యక్తి జగన్‍‌పై కోడికత్తితో దాడి చేసిన విషయం తెల్సిందే. 
 
ఈ కేసు విచారణలో భాగంగా, కోర్టుకు వ్యక్తిగత హాజరు నుంచి మినహాయింపు ఇవ్వాలని ఆయన కోరిన విషయం తెల్సిందే. ఆయన వినతికి సానుకూలంగా కోర్టు సానుకూలంగా స్పందించడంతో ఆయన తరపున పీఏ కె.నాగేశ్వర రెడ్డి కోర్టుకు హాజరయ్యారు. కేసును విచారించిన కోర్టు తదుపరి విచారణను ఈ నెల 13వ తేదీకి వాయిదా వేసింది.
 
 
 
కాగా, గత 2018 అక్టోబరు నెలలో విపక్షంలో ఉన్న జగన్మోహన్ రెడ్డిపై శ్రీనివాస్ అనే యువకుడు కోడికత్తితో దాడి చేశాడు. ఎయిర్‌పోర్టులోని ఒక రెస్టారెంట్‌లో పని చేస్తున్న శ్రీనివాస్ ఈ దాడికి పాల్పడ్డాడు. ఈ కోడిగత్తి గాయంతోనే జగన్ నేరుగా హైదరాబాద్ నగరానికి చేరుకుని ఆస్పత్రిలో చేరి చికిత్స చేయించుకున్నారు. ఈ కేసు విచారణలో భాగంగా, ఆయన వ్యక్తిగత పీఏ కోర్టుకు హాజరయ్యారు.