1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
  4. The van overturned, killing five people

వ్యాను బోల్తా పడి ఏడుగురు మృతి

van
తూర్పుగోదావరి జిల్లా గోకవరం మండలం తంటికొండ శ్రీ కల్యాణ వేంకటేశ్వరస్వామివారి ఆలయంలో వివాహం అనంతరం కొండ పైనుండి కిందికి దిగుతున్న ఓ పెళ్లి బృందం వ్యాను శుక్రవారం ఉదయం 7 గంటల ప్రాంతంలో అదుపుతప్పి కిందకి పడిపోవడంతో వ్యానులో ప్రయాణిస్తున్న ఏడుగురు మృతి చెందగా మరికొందరు తీవ్రంగా గాయపడ్డారు.

వారిని అంబులెన్స్పై రాజమహేంద్రవరం, గోకవరం ఆసుపత్రులకు తరలించారు. వీరంతా పెళ్ళికొసం వచ్చిన బంధువులు. మృతులంతా తూర్పుగోదావరి జిల్లా వాసులు. 
 
మృతుల వివరాలు....
1.కంబాల భాను (గోకవరం)
2.సింహాద్రి ప్రసాద్ (ఠాకూర్ పాలెం)
3.ఎల్లా దివ్య శ్రీలక్ష్మి (దివాన్ చెరువు)
4.చాగంటి మోహిని (గాదారాడ)
5.పచ్చకూరి నరసింహ (గంగంపాలెం)
6. యళ్ళ శ్రీదేవి (గంగంపాలెం)
7. సోమరౌతు  గోపాలకృష్ణ (గంగంపాలెం)
తర్వాతి కథనం
కేసుల మాఫీ కోసమే మోడీ కాళ్ళకు జగన్ సలాం: నారాయణ