1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
  4. Today TDP MPs to meet President

నేడు రాష్ట్రపతిని కలవనున్న టీడీపీ ఎంపీలు.. ఎందుకో తెలుసా?

TDP MPs
టీడీపీ ఎంపీలు గురువారం రాష్ట్రపతి రాంనాథ్ కోవింద్‌ను కలవనున్నారు. ఉదయం 11 గంటలకు రాష్ట్రపతిని టీడీపీ ఎంపీలు కలుస్తారు.

13నెలలుగా రాష్ట్రంలో పరిణామాలను రాష్ట్రపతికి ఎంపీలు నివేదించనున్నారు. ప్రాథమిక హక్కులు కాలరాయడం, భావ ప్రకటనా స్వేచ్ఛ కాలరాయడం, రూల్ ఆఫ్ లా ఉల్లంఘించడం, రాజ్యాంగ ఉల్లంఘనలపై ఫిర్యాదు చేయనున్నారు.

రాష్ట్రంలో వైసీపీ నాయకులు చేస్తున్నహింసా విధ్వంసాలు, ఇళ్ల కూల్చివేత, ఆస్తుల ధ్వంసం, భూములు లాక్కోవడం, తోటల నరికివేత, బోర్ వెల్స్ ధ్వంసం, బీసీ, ఎస్సీ,ఎస్టీ ముస్లిం మైనారిటీలపై దౌర్జన్యాల గురించి రాష్ట్రపతికి వివరిస్తారు.

అంతేకాకుండా టీడీపీతో సహా ప్రతిపక్షాల నాయకులు, కార్యకర్తలపై దాడులు, తప్పుడు కేసులు, సోషల్ మీడియా కార్యకర్తలపై అక్రమ కేసులు, దళితులపై అమానుషాలు, మానవ హక్కుల ఉల్లంఘన గురించి సాక్ష్యాధారాలతో సహా రాష్ట్రపతి దృష్టికి టీడీపీ ఎంపీల బృందం తేనుంది.
About Writer
ఎం
తర్వాతి కథనం
మరింత మందికి ‘వైయస్సార్‌ చేయూత’.. అర్హులైన ప్రతి మహిళ చేతిలో నాలుగేళ్లలో రూ. 75వేలు