1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
  4. Two Girl Student killed at Srikakulam

శ్రీకాకుళంలో విషాదం : స్నానానికెళ్లిన ఇద్దరు జలసమాధి

Srikakulam
ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలోని శ్రీకాకుళం జిల్లాలో విషాద ఘటన ఒకటి జరిగింది. స్నానానికి ఇద్దరు యువతులు నేల బావిలో పడి జలసమాధి అయ్యారు. ఈ విషాద సంఘటన జిల్లాలోని భామిని మండలం కోటకొండ గిరిజన గ్రామంలో చోటుచేసుకుంది.
 
ఈ వివరాలను పరిశీలిస్తే, గఈ కోటకొండ గ్రామానికి చెందిన పి.కీర్తికి (12), ఎ.అంజలి (13) శుక్రవారం స్నానం చేసేందుకు గ్రామంలోని ఓ బావి దగ్గరకు వెళ్లారు. అనంతరం స్నానానికి దిగి బావిలో పడి మరణించారు. 
 
అనంతరం గమనించిన గ్రామస్థులు బావిలోనుంచి బాలికల మృతదేహాలను బయటకు తీశారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. ఈ సందర్భంగా గ్రామస్థుల నుంచి వివరాలు సేకరించారు. 
 
మృతిచెందిన బాలికలిద్దరూ స్నేహితులు. ఇద్దరు కూడా విజయనగరం జిల్లాలోని ఒక ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్నారు. కరోనా కారణంగా పాఠశాలలకు సెలవు కావడంతో ఇద్దరూ గ్రామ శివార్లలోని నేల బావిలో స్నానానికి వెళ్లినట్లు పోలీసులు వెల్లడించారు. 
About Writer
ఠాగూర్
తర్వాతి కథనం
రైతు బీమా తరహాలోనే చేనేత బీమా పథకం : సీఎం కేసీఆర్ వెల్లడి