శనివారం, 11 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By డీవీ
Last Updated : శనివారం, 31 జులై 2021 (10:40 IST)

థ్రిల్ల‌ర్‌తో ప‌రుగెత్తించిన క‌థ‌

Parigettu parigettu
ఇటీవ‌ల క్రైం, థ్రిల్ల‌ర్‌, స‌స్పెన్స్ చిత్రాల‌ను ప్రేక్ష‌కులు ఆద‌రిస్తున్నారు. చిన్న పాయింట్‌ను తీసుకుని దాన్ని ఆక‌ట్టుకునే మ‌ల‌చ‌డంలో ఇప్ప‌టి కొత్త‌త‌రం ముందుంటుంది. అలా కొత్త‌వారితో చేసిన ప్ర‌యోగం ‘పరుగెత్తు పరుగెత్తు’. క‌రోనా త‌ర్వాత థియేట‌ర్ల‌లో విడులైన ఈ సినిమా ఎలా వుందో చూద్దాం.
 
న‌టీన‌టులుః రాజశేఖర్, సూర్య శ్రీనివాస్,  అమృత ఆచారియా ప్రధాన పాత్రలు.
క‌థ‌, క‌థ‌నం, ద‌ర్శ‌క‌త్వంః  రామకృష్ణ తోట.
 
కథ: 
 
అజయ్ (సూర్య శ్రీనివాస్) మ‌ధ్య‌త‌ర‌గ‌తి యువ‌కుడు. ఏదైనా వ్యాపారం చేసి స్థిర‌ప‌డాల‌ని వుంటుంది. త‌ల్లిదండ్రుల‌ను చూడాల‌నుకుంటాడు. ఈ ఆలోచ‌నతో ఒక వ్య‌క్తి ద‌గ్గ‌ర అప్పు చేస్తాడు అజ‌య్‌. ఇక అతనికి రెడ్ క్రాస్ సొసైటీలో పనిచేసే ప్రియ(అమృత) పరిచయం అవుతుంది. అది ప్రేమ‌గా మారుతుంది. ఇక త‌న‌ద‌గ్గ‌ర అప్పుతీసుకున్న అజ‌య్ కిస్తీలు క‌ట్ట‌క‌పోవ‌డంతో అత‌న్ని ప‌ట్టుకునే క్ర‌మంలో అజ‌య్ ప్రేయ‌సిని బంధిస్తాడు. అత‌ను తన అప్పు రూ.10లక్షలను చెల్లించి తన ప్రియురాలిని విడిపించుకుని తీసుకెళ్లాలని షరతు పెడతాడు. మ‌రి అత‌ని ష‌ర‌తుకు లొంగాడా? లేదా? ఆ త‌ర్వాత ఏమ‌యింది? అనేది మిగిలిన క‌థ‌.
 
విశ్లేషణ: 
పాయింట్ చిన్న‌దే అయినా దాన్ని చూసే ప్రేక్ష‌కుడిని ర‌క్తిక‌ట్టించేలా చేయ‌డ‌మే ద‌ర్శ‌కుడి ప్ర‌తిభ‌. అది చాలా వ‌రు నెర‌వేర్చాడు. కొన్నిచోట్ల గ్రిప్పింగ్ కోల్పోయాడు. అజ‌య్ తన చెల్లి ఆరోగ్యాన్ని మరోవైపు విలన్ చేతిలో బంధీ అయిన ప్రియురాలిని రక్షించుకునే క్రమంలో కథానాయకుడు ఎలాంటి ధైర్యం చేశాడ‌నేది 
ద‌ర్శ‌కుడు బాగా ఆవిష్క‌రించాడు. ఈ చిత్రంలో సామాజిక అంశంకూడా వుంది. వైజాగ్ నుంచి చుట్టు పక్కల నగరాలకు గంజాయి ఎలా సరఫరా అవుతోంది. అందులో నిరుద్యోగ యువత ఎలా చిక్కుకొని.. ప్రాణాల మీదికి తెచ్చుకుంటోంది.అనేదాన్ని దర్శకుడు బాగా స్టడీ చేసి చూపించారు. 
 
వీటిని నిరాఘాటంగా చేయాలంటే వ్యవస్థలోని ముఖ్యమైన వ్యక్తులు కూడా ఎాలా ఇన్ వాల్వ్ అవుతున్నారనే లోపాలను కూడా ఎత్తి చూపించారు. ఆద్యంతం ఉత్కంఠను రేపే ఈ న్యూ ఏజ్ క్రైమ్ థ్రిల్లర్ ‘పరుగెత్తు పరుగెత్తు’ మూవీ తెలుగు ఆడియన్స్ ను బోరింగ్ లేకుండా థియేటర్లో కూర్చోబెడుతుంది అనడంలో సందేహం లేదు.
న‌టీన‌టుల ప‌రంగా, హీరో, హీరోయిన్ కొత్త‌వారైనా పాత్ర‌ప‌రంగా న‌ప్పారు. కమర్షియల్ ఎలిమెంట్స్ కి తక్కువ స్కోప్ వున్న ఇలాంటి ఎంగేజింగ్ క్రైం థ్రిల్లర్ మూవీస్ లో స్టార్ కాస్ట్ తో పనిలేదని ఈ చిత్రం మరోసారి నిరూపించింది. కేవలం కథ., కథనం తో ఆడియన్స్ ను ఎంగేజ్ చేసే ఇలాంటి చిత్రాల్లో నటీనటులు పోటీ పడి నటించి మెప్పించారు. 
విలన్ పాత్రధారులు, చివర్లో వచ్చే రిటైర్డ్ ఆర్మీ ఆఫీసర్ తదితరులంతా పోటీ పడి నటించారు. ప్రేక్షకులను మరీ సీరియస్ కథ.. కథనాలతో కట్టి పడేయకుండా వుండేందుకు మధ్యలో ఓ మంచి ఐటెం సాంగును కూడా ప్లాన్ చేసి ఆడియన్స్ ని రంజింపజేశారు. 
 
అయితే వున్న అవ‌కాశాన్ని రెండు గంటల పాటు ప్రేక్షకులు ఎక్కడా బోరింగ్ ఫీల్ అవ్వకుండా చిత్రాన్ని తెరమీాదకు ఎక్కించారు. ఇలాంటి క్రైం థ్రిల్లర్స్ కి బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ముఖ్యం. సునీల్ కశ్యప్ ఇందులో బాగా స్కోర్ చేశారు. ఐటెం సాంగు మాస్ ఆడియన్స్ ను ఉర్రూతలూగిస్తుంది. సినిమాటోగ్రఫీ రిచ్ గా వుంది. ఎడిటింగ్ కూడా చాలా గ్రిప్పింగ్ గా వుంది. నిర్మాణ విలువలు ఉన్నతంగా వున్నాయి. నిర్మాత యామినీ కృష్ణ ఎక్కడా రాజీ పడకుండా సినిమాను తెరకెక్కించారు. క్రైం థ్రిల్లర్ ను ఇష్టపడే వారికి న‌చ్చుతుంది.
రేటింగ్ః 3/5