సంబంధిత వార్తలు
- ఐసీసీ ట్వంటీ20 వరల్డ్ కప్ : ఆస్ట్రేలియా క్రికెట్ జట్టు ఇదే...
- గుండెలో నీరు చేరింది.. వెంటిలేటర్‌పై క్రిస్ కెయిన్స్.. ఆరోగ్య పరిస్థితి..?
- ఆస్ట్రేలియాకు తేరుకోలేని షాకిచ్చిన బంగ్లాదేశ్
- కండోమ్ వాడింది, ఒలింపిక్ క్రీడల్లో స్వర్ణం గెలిచింది, ఎలా?
- క్రికెట్ జట్లన్నీ బిజీబిజీ.. ఆస్ట్రేలియా జట్టులో పంజాబ్ కుర్రోడు (video)
ఆస్ట్రేలియాలో చలికి ఊపిరాడక మృతి చెందిన వైజాగ్ విద్యార్థి!
ఆస్ట్రేలియాలో వైజాగ్‌కు చెందిన విద్యార్థి ఒకరు ప్రాణాలు కోల్పోయాడు. ఉదయం వేళ వాకింగ్‌కు వెళ్లగా చలికి ఊపిరాడకపోవడంతో చనిపోయాడు. ఈ విషయం తెలుసిన ఆ మృతుని కుటుంబీకులు బోరున విలపిస్తున్నారు.
తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, విశాఖ పారిశ్రామిక ప్రాంతం గుల్లలపాలెం వుడా కాలనీకి చెందిన ప్రసంగి శ్రీనివాసరావు, కవిత దంపతుల పెద్ద కుమారుడు చెన్నకేశవ సాయి (20) మెల్‌బోర్న్‌లో డిగ్రీ చదివేందుకు వెళ్లారు.
ప్రసుత్తం బీఎస్సీ రెండో ఏడాది చదువుతున్న చెన్నకేశవ సాయి ఈ నెల 16న అక్కడి పార్కులో ఉదయపు నడకకు వెళ్లారు. తీవ్రమైన చలివల్ల ఊపిరి అందక అస్వస్థతకుగురై కుప్పకూలిపోయారు. కరోనా ఆంక్షల నేపథ్యంలో అటువైపు ఎవరూ రాకపోయేసరికి మరణించారు.
అయితే, అటువైపు మూడు రోజుల వరకు ఏ ఒక్కరూ రాకపోవడంతో ఈ విషయం ఎవరికీ తెలియలేదు. బంధువులు, స్నేహితులు గాలింపు చేపట్టడంతో విషయం బయటపడింది. వెంటనే వారు చెన్నకేశవ సాయిని ఆసుపత్రికి తీసుకెళ్లారు. అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు ధ్రువీకరించారు. ఆదివారం విశాఖలోని స్వగృహానికి తీసుకొచ్చిన మృతదేహాన్ని చూసి కుటుంబ సభ్యుల రోదనలు మిన్నంటాయి.
