సోమవారం, 2 డిశెంబరు 2024
  1. క్రీడలు
  2. క్రికెట్
  3. వార్తలు
Written By సెల్వి
Last Updated : బుధవారం, 11 ఆగస్టు 2021 (10:13 IST)

గుండెలో నీరు చేరింది.. వెంటిలేటర్‌పై క్రిస్ కెయిన్స్.. ఆరోగ్య పరిస్థితి..?

Chris Cairns
న్యూజిలాండ్‌ మాజీ ఆల్‌రౌండర్‌ క్రిస్‌ కెయిన్స్‌ ఆరోగ్య పరిస్థితి ప్రస్తుతం కాస్త ఆందోళనకరంగానే ఉంది. గుండె సంబంధిత వ్యాధితో బాధపడుతున్న కెయిన్స్‌.. ఆసుపత్రిలో వెంటిలేటర్‌పై చికిత్స పొందుతున్నాడు. ప్రస్తుతం అతను చికిత్సకు సరిగ్గా స్పందించడం లేదని ఆసుపత్రి వర్గాల సమాచారం. సిడ్నీలోని ఓ ప్రముఖ ఆసుపత్రికి కెయిన్స్‌ను తీసుకెళ్లి చికిత్స అందిచనున్నారు. మ్యాచ్‌ ఫిక్సింగ్‌ కారణంగా కెరీర్ దూరం చేసుకున్న కెయిన్స్‌.. గతంలో కామెంటరీ కూడా చెప్పాడు.
 
ఈ నేపథ్యంలో గుండె లోపల నీరు చేరడంతో క్రిస్‌ కెయిన్స్‌ తీవ్ర అస్వస్థతకు గురి కాగా.. అతని కుటుంబ సభ్యులు రెండు రోజుల క్రితం సిడ్నీలోని ఒక ప్రముఖ ఆసుపత్రికి తరలించారు. అక్కడ వైద్యులు అతన్ని పరిశీలించి పలు ఆపరేషన్లు నిర్వహించినా.. సరిగ్గా స్పందించడం లేదు. దాంతో కెయిన్స్‌కు ప్రస్తుతం వెంటిలేటర్‌పై చికిత్స అందిస్తున్నారు. సిడ్నీలోని ఓ ప్రముఖ ఆసుపత్రికి కెయిన్స్‌ను తీసుకెళ్లి చికిత్స అందిచనున్నారు. న్యూజిలాండ్‌ మాజీ ఆల్‌రౌండర్‌ తర్వగా కోలుకోవాలని ఆయన అభిమానులు కోరుకుంటున్నారు.
 
51 ఏళ్ల క్రిస్‌ కెయిన్స్‌ అంతర్జాతీయ క్రికెట్‌లో 1989 నుంచి 2006 వరకు న్యూజిలాండ్‌ జట్టుకు ప్రాతినిధ్యం వహించాడు. తన 17 ఏళ్ల కెరీర్‌లో కెయిన్స్‌ కివీస్‌ తరపున 62 టెస్టుల్లో 3320 పరుగులు.. 218 వికెట్లు పడగొట్టాడు. 215 వన్డేల్లో 4950 పరుగులు.. 201 వికెట్లు తీశాడు. 
 
టెస్టు, పరిమిత ఓవర్ల క్రికెట్‌లో మంచి ఆల్‌రౌండర్‌గా పేరు పొందిన కెయిన్స్‌ ఎక్కువగా ఆరు, ఏడు స్థానాల్లో బ్యాటింగ్‌కు దిగేవాడు. వచ్చిన అవకాశాలను పూర్తిగా సద్వినియోగం చేసుకున్నాడు. కాగా క్రిస్‌ కెయిన్స్ సోదరుడు క్రిస్‌ హారిస్‌ కూడా కివీస్‌ తరపున మంచి క్రికెటర్‌గా గుర్తింపు పొందిన సంగతి తెలిసిందే.