1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
  4. YS Jayanthi is now known as 'Farmer's Day'

ఇక‌పై 'రైతు దినోత్సవం'గా వైయస్ జ‌యంతి

YS Jayanthi
దివంగ‌త నేత‌, ఉమ్మ‌డి ఆంధ్ర‌ప్ర‌దేశ్ మాజీ సీఎం‌ వైయస్ రాజశేఖర్ రెడ్డికి అరుదైన గౌరవం దక్కింది. ఆయన జయంతిని రైతు దినోత్సవంగా ప్రకటిస్తూ ఏపీ ప్ర‌భుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. 
 
దివంగ‌త నేత‌, ఉమ్మ‌డి ఆంధ్ర‌ప్ర‌దేశ్ మాజీ సీఎం‌ వైయస్ రాజశేఖర్ రెడ్డి జయంతిని రైతు దినోత్సవంగా ప్రకటిస్తూ ఏపీ ప్ర‌భుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. వైఎస్సార్ ముఖ్మ‌మంత్రిగా రైతుల సంక్షేమానికి అనేక చర్యలు తీసుకున్నారని స‌ర్కార్ ఉత్తర్వుల్లో పేర్కొంది. 
 
వ్య‌వ‌సాయం, రైతు సంక్షేమానికి ఆయ‌న తీసుకున్న చ‌ర్య‌లు విప్ల‌వాత్మ‌క‌మైన‌వ‌ని వెల్ల‌డించింది. ఈ నేప‌థ్యంలో ఆ దివంగ‌త నేత స్మారకంగా ప్రతి ఏడాది జూలై 8 వ తేదీని రైతు దినోత్సవంగా ప్రకటించింది ప్రభుత్వం.
తర్వాతి కథనం
5 వరకు మిర్చియార్డు బంద్.. ఎందుకో తెలుసా?