మహావిష్ణువును ఆరాధించినట్లైతే పురోభివృద్ధి పొందుతారు. మేషం: ఆర్థిక లావాదేవీల్లో ఒడిదుడుకులు ఎదురైనా అధిగమిస్తారు. పెద్ద హోదాలో ఉన్నవారికి అధికారిక పర్యటనలు అధికమవుతాయి. స్త్రీలు తొందరపాటుతనం వల్ల ప్రియతములను దూరం చేసుకుంటారు. యాదృచ్ఛికంగా ఒక పుణ్యక్షేత్రం సందర్శిస్తారు. గతంలో మిమ్ములను విమర్శించిన వారే మీ సహాయం అర్ధిస్తారు. వృషభం: దంపతుల మధ్య సఖ్యతా లోపం, కలహాలు చోటుచేసుకుంటాయి. కొన్ని విషయాల్లో మీరెంత తెలివిగా వ్యవహరించినా ఫలితాలు భిన్నంగానే ఉంటాయి....