22-02-2020 శనివారం దినఫలాలు - అనంతపద్మనాభ స్వామిని ఆరాధించినా...

astro 10
రామన్|
మేషం : స్థిర చరాస్థుల విషయంలో మెళకువ అవసరం. కొబ్బరి, పండ్లు, పూలు, చిరు వ్యాపారులకు లాభదాయకంగా ఉంటుంది. విద్యార్థులలో చురుకుదనం కానరాదు. ఏ వ్యక్తికీ పూర్తిగా బాధ్యతలు అప్పగించడం మంచిది కాదని గమనించండి. పుణ్య కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఆకస్మిక ప్రయాణాలలో చికాకులు తప్పవు.

వృషభం : బ్యాంకు వ్యవహారాలు మందకొడిగా సాగుతాయి. దైవ, సేవా కార్యక్రమాలలో చురుకుగా పాల్గొంటారు. మీ కళత్ర మొండివైఖరి మీకు ఎంతో చికాకు కలిగిస్తుంది. సోదరీ, సోదరుల మధ్య మనస్పర్థలు తలెత్తుతాయి. వృత్తి వ్యపారాల్లో గణనీయమైన పురోభివృద్ధి సాధిస్తారు. ప్రముఖుల కలయిక సాధ్యపడదు.

మిథునం : ఆదాయానికి మించి ఖర్చులు అధికమవుతాయి. చేపట్టిన పనులలో స్వల్ప ఒడిదుడుకులు ఎదురైనా పట్టుదలతో శ్రమించి విజయవంతంగా పూర్తిచేస్తారు. స్త్రీలకు ఆరోగ్యంలో మెళకువ అవసరం. కొత్త విషయాలపై దృష్టిసారిస్తారు. బంధువుల రాకవల్ల గృహంలో కొత్త ఉత్సాహం, సందడి చోటుచేసుకుంటుంది.

కర్కాటకం : ఆర్థిక విషయాల్లో ఒక ముందుకు వేస్తారు. మీ మాటకు సర్వత్రా ఆమోదం లభిస్తుంది. కోర్టు వ్యవహారాల్లో ఫ్లీడర్ల ధోరణి ఆందోళన కలిగిస్తుంది. కానివేళలో ఇతరుల రాక ఇబ్బంది కలిగిస్తుంది. స్త్రీలు అయినవారి నుంచి ఆసక్తికరమైన విషయాలు గ్రహిస్తారు. ఆకస్మిక ఖర్చులు మీ ఆర్థికస్థితికి ఆటంకంగా నిలుస్తాయి.

సింహం : కొబ్బరి, పండ్లు, పూలు, చిరు వ్యాపారులకు లాభదాయకంగా ఉంటుంది. పాత మిత్రులను కలుసుకుంటారు. స్టేషనరీ, ప్రింటింగ్ రంగాల వారికి ఒత్తిడి, పనిభారం వంటి చికాకులను ఎదుర్కొంటారు. వాహనచోదకుకు ఏకాగ్రత ముఖ్యం. విద్యార్థులు ప్రేమ వ్యవహారాలకు దూరంగా ఉండటం మంచిది.

: ఉద్యోగస్తులు అధికారుల తీరును గమనించి మెలగవలసి ఉంటుంది. దూర ప్రయాణాలు వాయిదాపడతాయి. వృత్తి ఉద్యోగాల్లో ఆశాజనకమైన మార్పులుంటాయి. బంధువులతో సఖ్యత నెలకొంటుంది. కాంట్రాక్టర్లకు ఇంజనీరింగ్ రంగాలవారి నుంచి అభ్యంతరాలెదురవుతాయి. చిన్ననాటి మిత్రులను కలుసుకుంటారు.

: ఆర్థిక లావాదేవీల్లో ఒత్తిడి, హడావుడి అధికంగా ఉంటాయి. సహోద్యోగులతో అభిప్రాయభేదాలు తలెత్తె ఆస్కారం ఉంది. మీ ఉన్నతిని చాటుకోవడం కోసం ధనం విరివిగా ఖర్చు చేస్తారు. ఆత్మీయుల కలయికతో మానసికంగా కుదుటపడతారు. నిత్యావసరవస్తు వ్యాపారులకు, స్టాకిస్టులకు పురోభివృద్ధి పొందుతారు.

వృశ్చిక : ఫ్లీడర్లు, ఫ్లీడరు గుమస్తాలకు చికాకులు తప్పవు. మీ జీవిత భాగస్వామి సలహా మీకెంతగానో నచ్చుతుంది. స్టేషనరీ, ప్రింటింగ్ రంగాల వారికి అచ్చు తప్పులు పడటం వల్ల మాటపడక తప్పదు. ఊహించని ఖర్చులు అధికం కావడం వల్ల ఆందోళన తప్పదు. బంధువులతో తెగిపోయిన సంబంధాలు తిరిగి బలపడతాయి.

ధనస్సు : సోదరీ, సోదరుల మధ్య సంబంధ బాంధవ్యాలు బాగుగా ఉంటాయి. ఖర్చులు మీ స్తోమతకు తగినట్టుగానే ఉంటాయి. చిట్స్, ఫైనాన్స్ వ్యాపారులకు ఖాతాదారుల నుంచి ఒత్తిడి అధికమవుతుంది. అర్థాంతరంగా నిలిచిన పనులు పునఃప్రారంభమవుతాయి. గృహంలో మార్పులు వల్ల కొంత అసౌకర్యానికి గురవుతారు.

మకరం : విద్యార్థులలో భయాందోళనలు చోటుచేసుకుంటాయి. ఆస్తి వ్యవహారాలలో ముఖ్యుల మధ్య అవగాహన లోపించడంతో ఒత్తిడికి లోనవుతారు. ఆలయాలను సందర్శిస్తారు. స్త్రీల ఆరోగ్యం గురించి ఆందోళన చెందుతారు. రవాణా రంగాల వారికి చికాకులు తప్పవు. తలపెట్టిన పనులు ఆలస్యమైనా పూర్తిచేస్తారు.

కుంభం : ఆర్థిక పరిస్థితి అనుకున్నంత సంతృప్తికరంగా సాగదు. ఉపాధ్యాయులకు, రిప్రజెంటేటివ్‌లు ఒత్తిడి పెరుగుతుంది. సంఘంలో మంచి పేరు, ప్రఖ్యాతలు గడిస్తారు. భాగస్వామిక సమావేశాలలో కొత్త విషయాలు చర్చకు వస్తాయి. ఖర్చులు అధికమవుతాయి. ప్రైవేటు సంస్థలలోని వారు మార్పుల కోసం చేసే యత్నాలు ఫలిస్తాయి.

మీనం : ఆంతరంగిక వ్యాపార విషయాలు గోప్యంగా ఉంచండి. బ్యాంకు పనుల్లో ఏకాగ్రత అవసరం. కొన్ని అనుకోని సంఘటనలు మనస్తాపం కలిగివస్తాయి. నిరుద్యోగులకు బోగస్ ప్రకటనల వల్ల అప్రమత్తత అవసరం. మిత్రులతో మనసు విప్పి మాట్లాడుకుంటారు. నిత్యావరవస్తు స్టాకిస్టులకు, వ్యాపారులకు సంతృప్తి, పురోభివృద్ధి.దీనిపై మరింత చదవండి :