17-02-2020 సోమవారం దినఫలాలు- ఉమాపతిని ఆరాధించినా...?

Lord Shiva
Lord Shiva

మేషం : స్త్రీలకు స్వీయ అర్జనపట్ల ఆసక్తి, ప్రోత్సాహం లభిస్తాయి. వ్యాపార రంగాలలోవారికి గణనీయమైన అభివృద్ధి, పురోభివృద్ధి పొందుతారు. మీరు ప్రేమించే వ్యక్తితో మరింత ఆనందాన్ని పొందుతారు. ఆకస్మిక ప్రయాణాలలో చికాకులు తప్పవు. ప్రతి క్షణం కుటుంబీకుల క్షేమం గురించి ఆలోచిస్తారు. ఖర్చులు అధికమవుతాయి. 
 
వృషభం : విద్యార్థుల మొండివైఖరి ఉపాధ్యాయులకు చికాకు కలిగిస్తుంది. శత్రువులు మిత్రులుగామారి సహాయాన్ని అందిస్తారు. నోరు అదుపులో ఉంచుకోవడం శ్రేయస్కరం. అనుకోకుండా ఏర్పడిన ఒక స్నేహబంధం భవిష్యత్తులో మీకు మంచే చేస్తుంది. కుటుంబ అవసరాలు పెరగడంతో అదనపు సంపాదన దిశగా ఆలోచనలు చేస్తారు. 
 
మిథునం : ఆర్థిక విషయాల్లో సంతృప్తి, పురోభివృద్ధి కానవస్తుంది. ఇతరులకు పెద్ద మొత్తంలో ధన సహాయం చేసే విషయంలో లౌక్యంగా వ్యవహరించండి. కొన్ని సమస్యలు చిన్నవే అయినా మనశ్శాంతిని దూరం చేస్తాయి. దంపతుల మధ్య ముఖ్యమైన విషయాలు చర్చకు వస్తాయి. మీ అభిరుచికి తగిన వ్యక్తులతో పరిచయాలు ఏర్పడతాయి. 
 
కర్కాటకం : చిన్న తరహా పరిశ్రమలలో వారికి పురోభివృద్ధి. వాహనం ఇతరులకు ఇచ్చి ఇబ్బందులను ఎదుర్కొంటారు. పాత మిత్రుల కలయికతో గతానుభవాలు జ్ఞప్తికి రాగలవు. ఒక అవసరానికి ఉంచిన ధనం మరో ఖర్చుకు వినియోగించవలసి వస్తుంది. కాంట్రాక్టర్లకు పనివార్ల వల్ల సమస్యలకు, ఇబ్బందులకు లోనవుతారు. 
 
సింహం : కొబ్బరి, పండ్లు, పూల వ్యాపారులకు లాభదాయకంగా ఉంటుంది. ఆకస్మిక దూర ప్రయాణాలు వాయిదాపడతాయి. కోర్టు వ్యవహారాల్లో ఫ్లీడర్లకు ఒత్తిడి, చికాకులు తప్పవు. ఉపాధ్యాయులకు విద్యార్థుల వల్ల సమస్యలు తలెత్తే ఆస్కారం ఉంది. జాగ్రత్త వహించండి. రుణదాతలతో కలహించక సర్దిచెప్పేందుకు యత్నించాలి. 
 
: బ్యాంకు వ్యవహారాలు మందకొడిగా సాగుతాయి. సోదరీ, సోదరుల మధ్య ప్రేమానుబంధాలు బలపడతాయి. సహోద్యోగులతో అభిప్రాయభేదాలు తలెత్తే ఆస్కారం ఉంది. జాగ్రత్త వహించండి. ఆలయాలను సందర్శిస్తారు. ఒంటెత్తు పోకడ మంచిది కాదని గమనించండి. గృహానికి కావలసిన వస్తువులను కొనుగోలు చేస్తారు. 
 
: ఏ విషయంలోనూ ఇతరులను అతిగా విశ్వసించడం మచిదికాదని గమనించండి. గత విషయాలు జ్ఞప్తికి రాగలవు. శుభకార్యాలు, పుణ్యక్షేత్ర సందర్శనల్లో పాత మిత్రులను కలుసుకుంటారు. బిల్లులు చెల్లిస్తారు. వృత్తి వ్యాపారులకు సమస్యలెదురైనా ఆదాయానికి కొదవవుండదు. 
 
వృశ్చికం : ఉపాధ్యాయులతో విద్యార్థులు ఏకీభవించలేక పోతారు. ఆర్థిక ఇబ్బంది కొంత ఇబ్బంది కలిగించినా అవసరాలు తీరుతాయి. ప్రయాణాలు అనుకూలం. విద్యుత్ రంగాల్లో వారికి ఆందోళన తప్పదు. స్త్రీల అభిప్రాయాలకు స్పందన అంతంత మాత్రంగా ఉంటుంది. ముఖ్యులతో సంభాషించేటపుడు మెలకువ వహించండి. 
 
ధనస్సు : వ్యాపారాలలో స్వల్ప లాభాలను గడిస్తారు. బంధువుల నుంచి శుభవార్తలు వింటారు. ఆకస్మికంగా ధనప్రాప్తి కలుగుతుంది. ఆరోగ్యం మందగిస్తుంది. పారిశ్రామిక, రాజకీయ వర్గాలకు విదేశీ పర్యటనలు వాయిదాపడతాయి. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. నూతన వ్యక్తులతో పరిచయాలు ఏర్పడతాయి. 
 
మకరం : ఉద్యోగరీత్యా ఆకస్మికంగా ప్రయాణాలు చేస్తారు. ఉత్తర ప్రత్యుత్తరాలు సంతృప్తినిస్తాయి. మిత్రుల కలయికతో మనసు కుదుపటపడుతుంది. బ్యాంకు పనులు చురుకుగా సాగుతాయి. ఇంటర్వ్యూలలో జయం మిమ్మల్ని వరిస్తుంది. వస్త్ర, వెండి, బంగారు లోహ వ్యాపారస్తులకు పనివారితో సమస్యలు తలెత్తుతాయి. 
 
కుంభం : స్త్రీలకు సంపాదనపట్ల ఆసక్తి అధికమవుతుంది. రాజకీయాలలో వారికి మంచి గుర్తింపు. ఆందోళన అధికమవుతుంది. ఇతరుల వాహనం నడపడంవల్ల అనుకోని ఇబ్బందులు ఎదుర్కోవలసి వస్తుంది. ప్రముఖులకు విలువైన కానుకలు అందించి వారిని ఆకట్టుకుంటారు. గత కొంతకాలంగా ఆగిన పనులు పునఃప్రారంభిస్తారు. 
 
మీనం : ఉద్యోగ, వ్యాపార రంగాల్లో వారికి నూతన ఆలోచనలు స్ఫురిస్తాయి. మీ సంతానం విద్యా విషయాల పట్ల ప్రత్యేక శ్రద్ధ అవసరం. స్త్రీలు విలువైన వస్తువులు అమర్చుకుంటారు. కుటుంబంలో కొద్దిపాటి వివాదాలు తలెత్తుతాయి. ప్రింటింగ్ రంగాల వారికి బకాయిల వసూళ్ళలో శ్రమాధిక్యత, ప్రయాసలు తప్పవు. 


வெப்துனியா செய்திகள் உடனுக்குடன்!!! உங்கள் மொபைலில்... இங்கே க்ளிக் செய்யவும்
దీనిపై మరింత చదవండి :