శుక్రవారం, 24 జనవరి 2025
  1. ఆధ్యాత్మికం
  2. భవిష్యవాణి
  3. దినఫలం
Written By రామన్
Last Updated : ఆదివారం, 16 ఫిబ్రవరి 2020 (17:49 IST)

16-02-2020 ఆదివారం మీ రాశిఫలితాలు.. ఆ రాశివారికి ఊహించని ఖర్చు..? (video)

ఆదివారం సూర్యనారాయణ పారాయణ చేసినా అన్నివిధాలా కలిసివస్తుంది. 
 
మేషం: ఆర్థికాభివృద్ధికి చేయు కృషిలో ఆశాజనకమైన మార్పులు వుంటాయి. మీ పనితీరు, వాగ్ధాటి ఎదుటివారిని ఆకట్టుకుంటాయి. దైవకార్యాలు, వేడుకల్లో ఉత్సాహంగా పాల్గొంటారు. పెద్దల గురించి ఆందోళన చెందుతారు. వ్యాపారాల్లో సంతృప్తికరమైన లాభాలు గడిస్తారు. చిన్ననాటి పరిచయస్తులను కలుసుకుంటారు. 
 
వృషభం: ప్రైవేట్, ఫైనాన్స్, చిట్స్ సంస్థల వల్ల మోసపోయే ఆస్కారం వుంది. మీ సంతానం విజయం సంతోషం కలిగిస్తుంది. ఉద్యోగస్తులు తోటివారితో అనునయంగా మెలగాలి. కొన్ని సంఘటనలు మనస్థిమితం లేకుండా చేస్తాయి. ప్రముఖుల ఇంటర్వ్యూ అనుకూలిస్తుంది. ఆత్మీయుల ప్రోత్సాహంతో కొత్త ప్రయత్నాలు మొదలెడతారు.
 
మిథునం: కాంట్రాక్టులు, ఏజెన్సీలు, లీజు గడువు పొడిగింపుకు అనుకూలం. వ్యవహార ఒప్పందాల్లో సముచిత నిర్ణయాలు తీసుకుంటారు. ఉపాధ్యాయులు విశ్రాంతి కోసం చేసే ప్రయత్నాలు అనుకూలిస్తాయి. స్త్రీల ప్రతిభకు తగిన గుర్తింపు, అవకాశాలు లభిస్తాయి. విద్యార్థులకు వాహనం నడుపుతున్నప్పుడు ఏకాగ్రత ప్రధానం. 
 
కర్కాటకం: ధనం ముందుగా సర్దుబాటు చేసుకోవడం మంచిది. నిరుద్యోగులు రాత, మౌఖిక పరీక్షల్లో సఫలీకృతులవుతారు. ఇసుకు కాంట్రాక్టర్లు, రేషన్ డీలర్లకు చికాకులు అధికం. వ్యాపారాల్లో గణనీయమైన పురోభివృద్ధి సాధిస్తారు. అందరితో కలిసి విందు వినోదాల్లో పాల్గొంటారు. స్త్రీలకు పుట్టింటి మీద ధ్యాస పెరుగుతుంది. 
 
సింహం: విషయం చిన్నదైనా తీవ్రంగా స్పందిస్తారు. కొత్త విషయాలపై దృష్టి సారిస్తారు. విద్యార్థులు పోటీ పరీక్షలు, క్రీడల్లో విజయం సాధిస్తారు. అసాధ్యమనుకున్న పనులు తేలికగా పూర్తి చేస్తారు. భాగస్వామిక వ్యాపారాలు, సంస్థల స్థాపన ప్రస్తుతానికి వాయిదా వేయండి. ఆకస్మిక ప్రయాణం చేయాల్సి వస్తుంది. 
 
కన్య: పత్రికా సిబ్బందికి ఏకాగ్రత ప్రధానం. బంధువుల రాకతో హడావుడిగా పనులు ముగిస్తారు. ఉద్యోగస్తులకు విశ్రాంతి లభిస్తుంది. ఊహించని పెద్ద ఖర్చు తగిలే ఆస్కారం వుంది. సభలు, సమావేశాల్లో ప్రముఖంగా వ్యవహరిస్తారు. స్త్రీల ఉద్యోగయత్నం ఫలిస్తుంది. విద్యార్థుల తొందరపాటు తనం వల్ల ఇబ్బందులు తప్పవు. 
 
తుల: వ్యాపారాల్లో గణనీయమైన పురోభివృద్ధి. అనుభవం గడిస్తారు. ఆత్మీయుల ఆహ్వానం సందిగ్ధానికి గురిచేస్తుంది. మీ సమర్థతకు తగిన గుర్తింపు, అవకాశాలు లభిస్తాయి. కుటుంబ అవసరాలు, ఖర్చులు పెరుగుతాయి. పెద్దల ఆశీస్సులు ప్రముఖుల ప్రశంసలు పొందుతారు. కొన్ని విషయాలు చూసీ చూడనట్టుగా వదిలేయండి.
 
వృశ్చికం: మీ శ్రీమతి సలహా పాటించడం శ్రేయస్కరం. ఆర్థిక లావాదేవీలు, వ్యవహార ఒప్పందాల్లో ఏకాగ్రత ప్రధానం. మీ సంతానం మొండివైఖరి మీకు ఎంతో చికాకు కలిగిస్తుంది. ఒక స్థిరాస్తి అమర్చుకోవాలనే ఆలోచన బలపడుతుంది. పత్రికా సిబ్బందికి ఏకాగ్రత ప్రధానం. కుటుంబ విషయాలపై మరింత శ్రద్ధ వహిస్తారు.
 
ధనస్సు: ఆదాయ వ్యయాలు మీ బడ్జెట్‌కు అనుగుణంగా ఉంటాయి. పెద్దల ఆరోగ్యం క్రమంగా కుదుటపడుతుంది. స్త్రీలపై పొరుగువారి వ్యాఖ్యల ప్రభావం అధికం. భేషజాలకు పోయి ధనం విపరీతంగా వ్యయం చేస్తారు. వాహనం నడుపుతున్నప్పుడు మెళకువ అవసరం. నిరుద్యోగులకు ఒక అవకాశం ఆకస్మికంగా కలిసివస్తుంది.
 
మకరం: బంధువులతో తెగిపోయిన సంబంధాలు తిరిగి బలపడతాయి. నిరుద్యోగుల ఆలోచనలు ఉపాధి పథకాల దిశగా వుంటాయి. వృత్తుల వారికి శ్రమాధిక్యత, విశ్రాంతి లోపం. స్టాక్ మార్కెట్ రంగాల వారికి ఆటుపోట్లు తప్పవు. స్త్రీలకు టీవీ కార్యక్రమాల్లో అవకాశం లభిస్తుంది. ఏ సమస్యనైనా నిబ్బరంగా ఎదుర్కొంటారు. 
 
కుంభం: వ్యాపారాల్లో పోటీని ధీటుగా ఎదుర్కొంటారు. అందరితో కలిసి విందు, వినోదాల్లో పాల్గొంటారు. కొబ్బరి, పండ్లు, పూలు, కూరలు, చిరు వ్యాపారులకు లాభదాయకం. వ్యవహారంలో కచ్చితంగా వుండాలి. స్త్రీలకు పనివారితో ఒత్తిడి, చికాకులు తప్పవు. పెరిగిన ధరలు, ఖర్చులు ఆందోళన కలిగిస్తాయి. 
 
మీనం: మీ శ్రీమతి వైఖరిలో మార్పు సంతోషం కలిగిస్తుంది. విద్యార్థులు ప్రేమ వ్యవహారాలకు దూరంగా ఉండాలి. సేల్స్ సిబ్బందితో చికాకులు తప్పవు. విదేశాల్లోని అయిన వారి క్షేమ సమాచారం సంతృప్తినిస్తుంది. దూరప్రయాణాల్లో వస్తువుల పట్ల మెళకువ అవసరం. స్త్రీలు షాపింగ్‌ల కోసం ధనం అధికంగా వ్యయం చేస్తారు.