గురువారం, 26 డిశెంబరు 2024
  1. ఆధ్యాత్మికం
  2. భవిష్యవాణి
  3. పంచాంగం
Written By రామన్
Last Updated : శనివారం, 15 ఫిబ్రవరి 2020 (10:55 IST)

15-02-2020 శనివారం దినఫలాలు - శ్రీమన్నారాయణస్వామిని ఎర్రని పూలతో...(Video)

మేషం : ఉద్యోగస్తులు ఒత్తిళ్లు, ఆకర్షణలకు దూరంగా ఉండటం అన్ని విధాలా క్షేమదాయకం. దైవసేవా కార్యక్రమాలలో చురుకుగా పాల్గొంటారు. అనుకోకుండా నిరుద్యోగుల యత్నాలు ఒక కొలిక్కి రాగలవు. వృధా ధన వ్యయం వల్ల నిరుత్సాహం చెందుతారు. కాంట్రాక్టర్లకు రావలసిన పాత బిల్లులు మంజూరవుతాయి. 
 
వృషభం : ముఖ్యుల రాకపోకలు అధికం అవుతాయి. ప్రయాణాలలో మెళకువ అవసరం. ఆదాయానికన్నా ఖర్చులు అధికంగా ఉంటాయి. బ్యాంకు పనులు ఆలస్యంగా పూర్తవుతాయి. అందరినీ అతిగా నమ్మే మీ స్వభావం ఇబ్బందులకు దారితీస్తుంది. కొబ్బరి, పండ్లు, పూలు, కూరల వ్యాపారులకు లాభదాయకంగా ఉంటుంది. 
 
మిథునం : పట్టుదలతో శ్రమించే మీకు సన్నిహితుల సాయం తోడవుతుంది. కొన్ని విషయాలు మీకు నచ్చకపోయినా రాజీపడాల్సివస్తుంది. వైద్యులు ఆపరేషన్లు చేయునపుడు మెళకువ అవసరం. ఉద్యోగస్తులకు విధి నిర్వహణలో ఏకాగ్రత ముఖ్యం. దైవ, సేవా కార్యక్రమాలలో చురుకుగా పాల్గొంటారు. బిల్లులు చెల్లిస్తారు. 
 
కర్కాటకం : కుటుంబ విషయాలలో మధ్యవర్తిత్వం వల్ల ఇబ్బంది పడతారు. ఖర్చులు అధికం కావడం వల్ల రుణాల కోసం అన్వేషిస్తారు. ఉపాధ్యాయులు అనుకున్న పనులు సకాలంలో పూర్తిచేస్తారు. ప్రముఖుల కలయిక ప్రయోజనకరంగా ఉంటుంది. రాజకీయ నాయకులకు ఊహించని మార్పులు చోటుచేసుకుంటాయి. 
 
సింహం : స్త్రీల అభిప్రాయాలకు స్పందన అంతంత మాత్రంగా ఉంటుంది. విశేషాలు మీరు ఊహించిన విధంగానే ఉంటాయి. మీ పనితీరు, వాగ్ధాటి ఎదుటివారిని ఆకట్టుకుంటాయి. బంధువులతో కలిసి ముఖ్యమైన కార్యక్రమాలలో పాల్గొంటారు. విద్యా సంస్థలలోని ఉపాధ్యాయులకు ఒత్తిడి, చికాకులు అధికమవుతాయి. 
 
కన్య : మీ నిర్లక్ష్యం వల్ల విలువైన వస్తువులు చేజారిపోవడం వల్ల మాటపడక తప్పదు. స్త్రీలకు పనివారితో చికాకులు తప్పవు. విలైనంత వరకు మీ పనులు మీరే చేసుకోవడం ఉత్తమం. మిమ్మలను కొంత మంది ధన సహాయం అర్ధిస్తారు. నిరుద్యోగులకు చిన్న సదావకాశం లభించినా సద్వినియోగం చేసుకోవడం మంచిది. 
 
తుల : ద్విచక్రవాహనంపై దూర ప్రయాణం మంచిదికాదని గమనించండి. విద్యార్థినుల ప్రేమ వ్యవహారాలకు దూరంగా ఉండటం శ్రేయస్కరం. ప్రింటింగ్ రంగాల వారికి బకాయిల వసూళ్ళలో శ్రమాధిక్యత ప్రయాసలు తప్పవు. రావలసిన దన చేతికందడంతో రుణం తీర్చాలనే మీ యత్నం నెరవేరగలదు. 
 
వృశ్చికం : ఉద్యోగరీత్యా ఆకస్మికంగా ప్రయాణాలు చేస్తారు. ప్రేమికులు అతిగా వ్యవహరించడం వల్ల చిక్కుల్లో పడే ఆస్కారం ఉంది. మీ సంతానం విద్యా విషయాల పట్ల శ్రద్ధ వహిస్తారు. ఆత్మీయుల కోసం ధనం విరివిగా వ్యయం చేస్తారు. నిర్మాణ పనుల్లో కాంట్రాక్టర్లకు అధికారుల నుంచి అభ్యంతరాలు ఎదురవుతాయి. 
 
ధనస్సు : ఉద్యోగస్తులకు పై అధికారుల నుంచి విమర్శలను ఎదుర్కొంటారు. అకాల భోజనం, శారీరక శ్రమ, మితిమీరిన ఆలోచనలు వల్ల అనారోగ్యానికి గురవుతారు. కోర్టు వ్యాజ్యాలను ఉపసంహరించుకుంటారు. మీ కళత్ర మొండివైఖరి మీకు ఎంతో చికాకు కలిగిస్తుంది. నిరుద్యోగులకు ఇంటర్వ్యూలలో మెళకువ అవసరం. 
 
మకరం : సిమెంట్, కలప, ఐరన్, ఇటుక వ్యాపారులకు సామాన్యం. దూర ప్రయాణాలలో నూతన పరిచయాలు ఏర్పడతాయి. స్పెక్యులేషన్ రంగాల వారికి నూతన ఆలోచనలు స్ఫురిస్తాయి. రాజకీయాలలో వారు ప్రత్యర్థులు పెరుగుతున్నారని గమనించండి. స్త్రీలు ధనవ్యయం విషయంలో జాగ్రత్త వహించవలసి ఉంటుంది. 
 
కుంభం : సంఘంలో మంచి గుర్తింపు, రాణింపు లభిస్తుంది. దూర ప్రయాణాలలో ఆకస్మికంగా బంధువులను కలుసుకుంటారు. దైవ, సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు. చేపట్టిన పనులలో స్వల్ప ఆటంకాలు ఎదురైనా పట్టుదలతో శ్రమించి సఫలీకృతులవుతారు. కోర్టు వ్యవహారాలలో ఫ్లీడర్లకు ఒత్తిడి, చికాకులు అధికమవుతాయి. 
 
మీనం : స్త్రీలకు కళ్లు, తల, నడుము, నరాలకు సంబంధించిన చికాకులు ఎదుర్కొంటారు. పత్రిక, ప్రైవేటు సంస్థలలోని వారికి మార్పులు అనుకూలిస్తాయి. ఆపద సమయంలో మిత్రులు అండగా నిలుస్తారు. సోదరీ, సోదరుల మధ్య సంబంధ బాంధవ్యాలు మెరుగుపడుతాయి. ఉద్యోగస్తులకు పై అధికారుల నుంచి గుర్తింపు లభిస్తుంది.