గురువారం, 26 డిశెంబరు 2024
  1. ఆధ్యాత్మికం
  2. భవిష్యవాణి
  3. దినఫలం
Written By రామన్

10-02-2020 సోమవారం రాశిఫలాలు - ఈశ్వరుని ఆరాధించినా జయం

మేషం : స్త్రీలకు బంధువర్గాలతో సత్సబంధాలు నెలకొంటాయి. కొత్త యత్నాలు ప్రారంభించడానికి అనువైన పరిస్థితులు నెలకొంటాయి. వృత్తుల వారికి శ్రమకు తగిన ప్రతిఫలం లభిస్తుంది. విద్యార్థులకు దూర ప్రాంతాల్లో ఉన్నత విద్యావకాశాలు లభిస్తాయి. ఉద్యోగస్తులు ఉన్నతాధికారులకు ప్రాపకం సంపాదిస్తారు. 
 
వృషభం : గృహ మార్పులు, మరమ్మతులు చేపడతారు. ఒక కార్యం నిమిత్తం దూర ప్రయాణం చేయవలసి వస్తుంది. ప్రేమికులకు, నూతన దంపతులకు ఎడబాటు తప్పదు. కోర్టు వ్యవహారాలు కొత్త మలుపు తిరుగుతాయి. ఓర్పు, పట్టుదలతో శ్రమించి కొన్ని లక్ష్యాలు సాధిస్తారు. వాతావరణంలో మార్పు రైతులకు ఊరటనిస్తుంది. 
 
మిథునం : దంపతుల మధ్య కొత్త ఉత్సాహం చోటుచేసుకుంటుంది. వృత్తి, వ్యాపారులకు అన్ని విధాలా కలిసిరాగలదు. తరుచూ దైవ కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఏమాత్రం పొదుపు సాధ్యంకాదు. స్త్రీలకు ఆరోగ్యంలో తగు జాగ్రత్తలు అవసరం. ఖర్చులు పెరిగినా ఆర్థిక వెసులుబాటు ఉంటుంది. వాహనం యోగం, కుటుంబ సౌఖ్యం పొందుతారు. 
 
కర్కాటకం : చేపట్టిన పనులు సకాలంలో పూర్తిచేస్తారు. ఆలయాలను సందర్శిస్తారు. ప్రముఖుల కలయిక వల్ల ఆశించిన ప్రయోజనం ఉండదు. స్టేషనరీ, ప్రింటింగ్ రంగాల వారికి సదావకాశాలు లభిస్తాయి. కోర్టు వ్యవహారాలు భాగస్వామిక చర్చలు వాయిదాపడతాయి. కొత్త యత్నాలు ప్రారంభించడానికి అనువైన పరిస్థితులు నెలకొంటాయి. 
 
సింహం : ఆర్థిక లావాదేవీలు, కుటుంబ విషయాల పట్ల శ్రద్ద వహిస్తారు. మీ ఉన్నతిని చూసి అసూయపడేవారు అధికమవుతున్నారని గమనించండి. లీజు, ఏజెన్సీలు, నూతన టెండర్ల విషయంలో పునరాలోచన మంచిది. మీ అగ్రహావేశాలు అదుపులో ఉంచుకోవడం శ్రేయస్కరం. ఉద్యోగస్తులకు దైనందిన కార్యక్రమాలు సాఫిగా సాగుతాయి. 
 
కన్య : ప్రింటింగ్ రంగాల వారికి మందకొడిగా ఉంటుంది. ఇతరుల విషయాల్లో అతిగా వ్యవహరించి భంగపాటుకు గురవుతారు. నిరుద్యోగులకు చేపట్టిన ఉపాధి పథకాలకు మంచి గుర్తింపు, రాణింపు లభిస్తుంది. మీ వాహనం ఇతరులకిచ్చి ఇబ్బందులెదుర్కొంటారు. స్పెక్యులేషన్ రంగాలవారి అంచనాలు నిరుత్సాహపరుస్తాయి. 
 
తుల : నూతన పరిచయాలు, వ్యాపకాలు పెంచుకుంటారు. ఒకరికి సహాయం చేసి మరొకరి ఆగ్రహానికి గురవుతారు. విద్యార్థులు అత్యుత్సాహం అనర్థాలకు దారితీయవచ్చు. స్త్రీల పేరిట స్థిరచరాస్తుల క్రయ విక్రయాలు అనుకూలిస్తాయి. క్రయ విక్రయాలు మందకొడిగా సాగుతాయి. ఉద్యోగరీత్యా దూర ప్రయాణాలు అనుకూలం. 
 
వృశ్చికం : ఆపరేషన్ల సమయంలో వైద్యులకు ఏకాగ్రత ముఖ్యం. కోర్టు వ్యవహారాలు వాయిదాపడటం మంచిది. ఒక వ్యవహారం నిమిత్తం ఆకస్మికంగా ప్రయాణం చేయాల్సి వస్తుంది. ఖర్చులు అధికంగా ఉంటాయి. రుణ యత్నాల్లో ఆటంకాలు ఎదుర్కొంటారు. ప్రింటింగ్ రంగాల వారికి మందకొడిగా ఉంటుంది. 
 
ధనస్సు : స్త్రీలపై బంధువులు, చుట్టుపక్కలవారి ప్రభావం అధికంగా ఉంటుంది. ఉత్తర ప్రత్యుత్తరాలు సంతృప్తినిస్తాయి. బంధువులతో సఖ్యత లోపిస్తుంది. నిరుద్యోగులకు సదావకాశాలు లభిస్తాయి. వృత్తులు, చిరు వ్యాపారులకు ఆశాజనకం. ప్రేమికులు చిక్కుల్లో పడే ఆస్కారం ఉంది. సహోద్యోగులతో సఖ్యత లోపిస్తుంది. 
 
మకరం : ఆర్థిక విషయాల్లో కొంత పురోభివృద్ధి కానవస్తుంది. విద్యార్థినులలో ఏకాగ్రత లోపం వల్ల ఒత్తిడికి ఆందోళనలకు గురవుతారు. అవివాహితులకు ఆశించిన సంబందాలు నిశ్చయం కాగలవు. వృత్తి వ్యాపారులకు శ్రమాధిక్యత మినహా ఆశించినంత పురోభివృద్ధి ఉండదు. గృహం ఏర్పరుచుకోవాలనే కోరిక బలపడుతుంది. 
 
కుంభం : తరుచూ దైవసేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు. రావలసిన ధనం చేతికందుతుంది. పొదుపు పథకాల దిశగా మీ ఆలోచనలు ఉంటాయి. స్త్రీలు, వస్త్ర, బంగారం, గృహోపకరణాలు సమకూర్చుకుంటారు. ఉద్యోగస్తులకు స్థానచలనం, కొత్త బాధ్యతలు స్వీకరిస్తారు. విద్యార్థుల్లో నూతనోత్సాహం చోటుచేసుకుంటుంది. 
 
మీనం : గృహం ఏర్పరచుకోవాలనే మీ కోరిక బలపడుతుంది. అవివాహితులకు ఆశించిన సంబందాలు నిశ్చయం కాగలవు. పెద్దల ఆరోగ్యం గురించి ఆందోళన చెందుతారు. ఏ వ్యక్తికీ అతి చనువు ఇవ్వడం మంచిదికాదు. రాబడికి మించిన ఖర్చులెదురైనా ఇబ్బందులుండవు. వ్యాపారులకు శ్రమాధిక్యత మినహా ఆశించినంత పురోభివృద్ధి.