సోమవారం, 23 డిశెంబరు 2024
  1. ఆధ్యాత్మికం
  2. భవిష్యవాణి
  3. పంచాంగం
Written By రామన్
Last Updated : బుధవారం, 5 ఫిబ్రవరి 2020 (10:57 IST)

05-02-2020 బుధవారం రాశిఫలాలు - లక్ష్మీనృసింహస్వామిని ఆరాధించినా...(video)

మేషం : వ్యాపారాల్లో కొత్తకొత్త పథకాలతో కొనుగోలుదార్లను ఆకట్టుకుంటారు. విలువైన వస్తువులు, గృహోపకరణాలు సమకూర్చుకుంటారు. ఏ వ్యక్తినీ తక్కువ అంచనా వేయడం మంచిదికాదు. ఉద్యోగస్తులకు అధికారుల నుంచి మంచి గుర్తింపు, రాణింపు లభిస్తుంది. వీలైనంత వరకు మీ పనులు మీరే చూసుకోవడం ఉత్తమం. 
 
వృషభం : కుటుంబ సభ్యుల మధ్య ప్రేమానురాగాలు మరింత బలపడతాయి. ఏ వ్యక్తికీ అతి చనువు ఇవ్వడం మంచిదికాదు. మీ శ్రమకు తగిన గుర్తింపు, ప్రతిఫలం పొందుతారు. చేపట్టిన పనులు ఎంతకీ పూర్తికాక అసహనం కలిగిస్తాయి. స్త్రీల కోరికలు, అవసరాలు నెరవేరగలవు. విద్యార్థులు చదువుల విషయంలో నిర్లక్ష్యం కూడదు. 
 
మిథునం : భాగస్వామికి సమావేశాలు అర్థాంతరంగా ముగించాల్సివుంటుంది. మీ ఆలోచనలు పలు విధాలుగా ఉంటాయి. అందరితో సఖ్యతగా మెలుగుతూ మీ పనులు చక్కెట్టుకుంటారు. స్త్రీలకు టీవీ ఛానెళ్ళ నుంచి ఆహ్వానం అందుతుంది. విద్యార్థుల ప్రేమ వ్యవహారం పెద్దలకు సమస్యగా మారుతుంది.
 
కర్కాటకం : ఆర్థిక లావాదేవీలు అస్తవ్యస్తంగా సాగుతాయి. జాయింట్ వ్యాపారాల నుంచి విడిపోవాలనే ఆలోచన స్ఫురిస్తుంది. సహోద్యోగులు సహకరించకపోవడంతో నిరుత్సాహం చెందుతారు. ఇతరుల సలహా విన్నప్పటికీ సొంతంగానే నిర్ణయాలు తీసుకోవాలి. ముఖ్యమైన వ్యవహారాలను వీలైనంత త్వరగా పూర్తి చేసుకోవడం మంచిది. 
 
సింహం : ప్రభుత్వ కార్యాలయాల్లో మీ పనులు సానుకూలమవుతాయి. ఉద్యోగస్తులు యూనియన్ కార్యకలాపాల్లో హడావుడి ఉంటారు. వ్యాపారాల్లో ఆటంకాలు తొలగి అనుభవం గడిస్తారు. గృహ నిర్మాణాల్లో పెరిగిన వ్యయం ఆందోళన కలిగిస్తుంది. హామీలు, సంతకాల విషయంలో పునరాలోచన అవసరం. 
 
కన్య : ఉద్యోగస్తులకు కొత్తగా వచ్చిన అధికారులతో సత్సంబంధాలు నెలకొంటాయి. సంతానం కారణంగా దంపతుల మధ్య అభిప్రాయభేదాలు, పట్టింపులు చోటుచేసుకుంటాయి. సామాజిక, పుణ్యకార్యాల్లో పాల్గొంటారు. అవగాహన లేని విషయాల్లో జోక్యం చేసుకోవడం వల్ల చిక్కుల్లో పడే ఆస్కారం ఉంది. 
 
తుల : వృత్తిరీత్యా ప్రముఖులతో పరిచయాలేర్పడతాయి. మీ శ్రీమతికి మీరంటే ప్రత్యేకాభిమానం కలుగుతుంది. మీ అలవాట్లు, బలహీనతలు ఇతరులకు ఇబ్బంది కలిగిస్తాయి. మిత్రుల విషయంలో మీ అనుమానాలు, ఊహలు నిజమవుతాయి. విద్యార్థులు ప్రేమ వ్యవహారాలకు దూరంగా ఉండటం మంచిది. 
 
వృశ్చికం : స్త్రీలకు దూరపు బంధువుల నుంచి ఆహ్వానాలు, వస్త్రప్రాప్తి వంటి శుభపరిణామాలున్నాయి. ఆకస్మికంగా ప్రయాణం చేయవలసి వస్తుంది. మీ రచనా వ్యాసాంగాలకు మంచి స్పందన లభిస్తుంది. కంప్యూటర్ రంగాల వారికి చికాకులు, అసహనం తప్పవు. రావలసిన బాకీలు అతికష్టంమ్మీద వసూలవుతాయి. 
 
ధనస్సు : పత్రికా సంస్థలలోని వారి శ్రమకు ఏమాత్రం గుర్తింపు లేకపోగా మాటపడవలసి వస్తుంది. కొత్త పనులు చేపట్టకుండా ప్రస్తుతం చేస్తున్న వాటిపైనే శ్రద్ధ వహించండి. వృత్తి ఉద్యోగాల్లో తలెత్తిన ఆటంకాలను అధికమిస్తారు. మీ గౌరవానికి భంగం కలుగకుండా వ్యవహరించండి. రాజీమార్గంతో కొన్ని సమస్యలు పరిష్కారమవుతాయి. 
 
మకరం : స్త్రీల కోరికలు, అవసరాలు నెరవేరగలవు. ఎంతో కొంత మొత్తం పొదుపు చేయడం మంచిది. ఒక్కోసారి మీ జీవిత భాగస్వామి మనస్తత్వం అర్థం చేసుకోవడం కష్టమవుతుంది. వ్యాపారాల్లో మొహమ్మాటాలకు తావివ్వడం మంచిది కాదు. ఆలయాలను సందర్శిస్తారు. నిర్మాణ పనుల్లో కాంట్రాక్టర్లు, బిల్డర్లకు ఒత్తిడి తప్పదు. 
 
కుంభం : ఒక రహస్యం దాచినందుకు మీ శ్రీమతి ఆగ్రహావేశాలకు గురికావలసి వస్తుంది. లౌక్యంగా వ్యవహరించి మీ పనులు చక్కబెట్టుకుంటారు. పత్రిక, మీడియా సంస్థల వారు అకారణంగా మాటపడవలసి వస్తుంది. భాగస్వామిక వ్యాపారాలు నుంచి తప్పుకోవడం అన్ని విధాలా శ్రేయస్కరం. మిత్రులను కలుసుకుంటారు. 
 
మీనం : కోర్టు తీర్పులు మీకే అనుకూలంగా వచ్చే సూచనలున్నాయి. అనాలోచితంగా మాటజారి ఇబ్బందులెదుర్కుంటారు. ఏ యత్నం కలిసిరాక నిరుద్యోగులు అనుక్షణం అశాంతికి లోనవుతారు. అవివాహితుల ఆలోచనలు పలు విధాలుగా ఉంటాయి. ప్రేమికుల అతిగా వ్యవహరించడం వల్ల చిక్కుల్లో పడే ఆస్కారం ఉంది.