సోమవారం, 23 డిశెంబరు 2024
  1. ఆధ్యాత్మికం
  2. భవిష్యవాణి
  3. దినఫలం
Written By రామన్

02-02-2020 ఆదివారం మీ రాశి ఫలితాలు - సూర్యనారాయణ పారాయణ చేసినట్లైతే?

సూర్యనారాయణ పారాయణ చేసినట్లైతే అన్నివిధాలా కలిసివస్తుంది. 
 
మేషం: ఆర్థిక విషయాల్లో ఏకాగ్రత అవసరం. కీలకమైన ఒప్పందాలు, ఇచ్చిపుచ్చుకునే వ్యవహారాల్లో ఏకాగ్రత అవసరం. దంపతుల మధ్య అవగాహన లోపిస్తుంది. ప్రయాణాలు అనుకూలిస్తాయి. మీ శ్రీమతి సలహా పాటించడం వల్ల ఒక సమస్య నుంచి బయటపడతారు. దైవ సేవా కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొంటారు. 
 
వృషభం: ఆర్థిక ఇబ్బందులు తొలగి మానసికంగా కుదుటపడతారు. దుబారా ఖర్చులు తగ్గించాలనే మీ ఆలోచన ఫలిస్తుంది. స్థిరాస్తి కొనుగోలు, లేదా అమ్మకానికై చేయు ప్రయత్నాలు వాయిదా పడతాయి. స్టేషనరీ, ప్రింటింగ్ రంగాల వారికి ఒత్తిడి పెరుగుతుంది. మీ ప్రత్యర్థుల తీరును ఓ కంట కనిపెట్టండి. 
 
మిథునం: ఉద్యోగస్తులకు బాధ్యతల మార్పిడి, స్థానచలనం వంటి పరిణామాలున్నాయి. కోర్టులో దావా వేసే విషయంలో పునరాలోచన మంచిది. ఏ విషయంలోను ఇతరులపై ఆధారపడటం మంచిది కాదు. వృత్తిపరంగా ఎదురైన సమస్యలు క్రమేణ తొలగిపోగలవు. అనుకోకుండా పాత బాకీలు వసూలవుతాయి.
 
కర్కాటకం: ఆదాయ వ్యయాలు మీ బడ్జెట్‌కు విరుద్ధంగా ఉంటాయి. కంప్యూటర్ రంగాల వారికి చికాకులు, అసహనం తప్పవు. కొబ్బరి, పండ్లు, పూల వ్యాపారులకు లాభదాయకం. తొందరపడి మాట జారటం మంచిది కాదు. పెద్దల ఆరోగ్యంలో మెళకువ అవసరం. సన్నిహితులతో కలిసి చేపట్టిన పనులు సమీక్షిస్తారు.
 
సింహం: వృత్తి ఉద్యోగాల్లో ఆశాజనకమైన మార్పులుంటాయి. ఆలయాలను సందర్శిస్తారు. నూతన పెట్టుబడులు, వ్యాపారల విస్తరణల ఆలోచన వాయిదా వేయటం శ్రేయస్కరం. స్త్రీలు భేషజాలకు పోకుండా పరిస్థితులకు అనుకూలంగా మెలగవలసి వుంటుంది. ఆస్తి పంపకాల విషయంలో కుటుంబీకులతో విభేదిస్తారు. 
 
కన్య: బ్యాంకు వ్యవహారాలు మందకొడిగా సాగుతాయి. వాహనం ఇతరులకు ఇచ్చి ఇబ్బందులను ఎదుర్కొంటారు. విద్యార్థినుల ప్రేమ వ్యవహారాలకు దూరంగా ఉండటం మంచిది. ఉద్యోగస్తులకు బాధ్యతల మార్పిడి, స్థానచలనం వంటి పరిణామాలున్నాయి. స్త్రీలకు దైవ సేవా కార్యక్రమాల పట్ల ఆసక్తి పెరుగుతుంది. 
 
తుల: రాజకీయ నాయకులకు ఊహించని మార్పులు చోటుచేసుకుంటాయి. ఆకస్మిక ఖర్చులు మీ ఆర్థికస్థితి ఆటంకంగా నిలుస్తాయి. బ్యాంకు వ్యవహారాల్లోనూ, ప్రయాణాల్లో మెళకువ అవసరం. గృహంలో మార్పులు, చేర్పులు వాయిదా పడతాయి. ఉపాధ్యాయులకు విద్యార్థుల నుంచి చికాకులు ఎదుర్కొంటారు.
 
వృశ్చికం: అనుమానాలు, అపోహలు వీడి ఆత్మవిశ్వాసంతో శ్రమించండి. సత్ఫలితాలు లభిస్తాయి. రుణదాతలతో కలహించక సర్దిచెప్పేందుకు ప్రయత్నించాలి. ఆత్మీయుల ఆహ్వానాలు మిమ్ములను సందిగ్ధానికి గురిచేస్తాయి. భాగస్వామిక, సొంత వ్యాపారాల్లో నిలదొక్కుకోవడానికి మరింతగా శ్రమించవలసి ఉంటుంది.
 
ధనస్సు: వాణిజ్య ఒప్పందాలు, రిజిస్ట్రేషన్ వ్యవహారాల్లో మెలకువ వహించండి. స్త్రీలు ఆరోగ్య విషయంలో జాగ్రత్త వహించాలి. నిరుద్యోగులు ఉపాధి పథకాల్లో క్రమంగా నిలదొక్కుకుంటారు. ప్రయాణాలు అనుకూలిస్తాయి. మాట్లాడలేని చోట మౌనం వహించడం మంచిది. మీలోటు పాట్లు, తప్పిదాలను సరిదిదుకోవటానికి ప్రయత్నించండి.
 
మకరం: వృత్తి వ్యాపారాల్లో నిలదొక్కుకోవటానికి బాగా శ్రమించాలి. అన్నిచోట్ల మీ ఆధిక్యతను ప్రదర్శించడం మంచిది కాదు. దంపతుల మధ్య అభిప్రాయ బేధాలు, కలహాలు చోటుచేసుకుంటాయి. ఇతరుల ముందు వ్యక్తిగత విషయాలు వెల్లడించడం మంచిది కాదని గమనించండి. ఉపాధ్యాయులన పనిభారం తప్పదు.
 
కుంభం: స్త్రీలకు అయిన వారి నుంచి ఒక ముఖ్య సమాచారం అందుతుంది. పత్రికా సిబ్బందికి వార్తల ప్రచురణలో పునరాలోచన మంచిది. ఉద్యోగస్తులకు అదనపు బాధ్యతలు, పనిభారం వంటి చికాకులు తప్పవు. డాక్టర్లు, శస్త్రచికిత్సలు విజయవంతంగా పూర్తి చేస్తారు. సన్నిహితుల సలహాలు, హితోక్తులు మీపై మంచి ప్రభావం చూపుతాయి. 
 
మీనం: ఉమ్మడి వ్యవహారాలు, ఆర్థిక లావాదేవీల్లో ఏకాగ్రత ముఖ్యం. దైవ కార్యక్రమాల్లో పాల్గొంటారు. ద్విచక్ర వాహనంపై దూర ప్రయాణం మంచిది కాదని గమనించండి. హామీలు, చెక్కుల జారీల్లో ఏకాగ్రత వహించండి. వ్యాపారాల అభివృద్ధికి మరింతగా శ్రమించాలి. అందరినీ అతిగా నమ్మే మీ స్వభావం ఇబ్బందులకు దారితీస్తుంది.