శుక్రవారం, 24 జనవరి 2025
  1. ఆధ్యాత్మికం
  2. భవిష్యవాణి
  3. దినఫలం
Written By రామన్
Last Updated : మంగళవారం, 18 ఫిబ్రవరి 2020 (17:39 IST)

29-01-2020 బుధవారం రాశిఫలాలు - గణపతిని పూజించినా మీకు శుభం (video)

మేషం : ఇతరులు మీ నుండి ధన సహాయం లేక చేత సహాయం కోరవచ్చు. కళత్ర ఆరోగ్యంలో శ్రద్ధ అవసరం. ఒక వ్యవహారంలో అపరిచితులను అతిగా విశ్వసించడం వల్ల ఆశాభంగానికి గురికాక తప్పదు. ధన వ్యయం విషయంలో ఆదాయానికి మించిన ఖర్చులు ఎదుర్కొన్నా ప్రయోజనం. సంతృప్తి ఉండగలదు.
 
వృషభ : లీజు, ఏజెన్సీ, నూతన కాంట్రాక్టులు దక్కించుకునే విషయంలో ఆచితూచి వ్యవహరించడం మంచిది. ఉద్యోగస్తుల శ్రమ, కార్యదీక్షకు అధికారుల నుంచి గుర్తింపు, ఆర్థిక లబ్ధి వంటి శుభపరిణామాలు ఉంటాయి. భాగస్వామి వ్యాపారాలు సంతృప్తికరంగా సాగుతున్నా సొంత వ్యాపారాలే మీకు శ్రేయస్కరం. 
 
మిథునం : బ్యాంకింగ్, చిట్స్, ఫైనాన్స్ రంగాల వారికి బకాయిల వసూలు విషయంలో సమస్యలు తప్పవు. స్టేషనరీ ప్రింటింగ్ రంగాల వారికి సంతృప్తి. పురోభివృద్ధి. వ్యవసాయ తోటల రంగాల వారికి ఓర్పు మెళకువ అవసం. ప్రతి విషయానికి ఇతరులపై ఆధారపడక స్వయంకృషినే నమ్ముకోవడం ఉత్తమం. 
 
కర్కాటకం : వాగ్వివాదాలకు, అనవసర విషయాలకు దూరంగా ఉండటం క్షేమదాయకం. స్త్రీల సహకారంతో మీ  దీర్ఘకాలిక సమస్య ఒక కొలిక్కి వచ్చే రాగలదు. వైద్యులకు ఆపరేషన్‌ల సమయంలో ఓర్పు, ఏకాగ్రత చాలా ముఖ్యం. నిర్మాణ పనులలో జాప్యం, పెరిగిన వ్యయం వల్ల ఆందోళనకు గురవుతారు. 
 
సింహం : ఆర్థిక పురోభివృద్ధిని కలిగిస్తాయి. ఉపాధ్యాయులకు ప్రైవేట్, పత్రికా సంస్థలలోని వారికి ఓర్పు, అంకితభావం చాలా ముఖ్యం. ఉద్యోగస్తులకు పై అధికారుల నుంచి ఒత్తిడి చికాకులు ఎదుర్కొంటారు. రావలసిన మొండి బాకీలు వసూలువుతాయి. విద్యార్థులు ఉన్నత విద్యల నిమిత్తం చేసే కృషిలో రాణిస్తారు. 
 
కన్య : స్త్రీలకు పరిచయాలు వ్యాపకాలు అధికమవుతాయి. దైవ, సేవ కార్యక్రమాలలో పాల్గొంటారు. ధన వ్యయం విషయంలో ఆదాయానికి మించిన ఖర్చులు ఎదుర్కొన్నా ప్రయోజనం. సంతృప్తి ఉండగలవు. ప్రయాణాలలో వస్తువుల పట్ల మెళకువ అవసరం. ప్రత్యర్థుల విషయంలో ఆచితూచి వ్యహరించండి. 
 
తుల : ముఖ్యులలో ఒకరి గురించి ఆందోళన తప్పదు. స్త్రీలకు కొత్త పరిచయాలు సంతృప్తినిస్తాయి. పారిశ్రామిక రంగాలలోనివారికి అన్ని విధాలా ప్రోత్సాహకరంగా ఉంటుంది. కార్మిక బకాయిలు, పీఎఫ్‌ బకాయిలు ఒక కొలిక్కి రాగలవు. ఆధ్యాత్మిక, సేవా, సాంఘిక కార్యక్రమాలలో చురుకుగా వ్యవహరిస్తారు. 
 
వృశ్చికం : రవాణా, ఎగుమతి, దిగుమతి, ఆటోమొబైల్, మెకానికల్ రంగాల వారికి అధికారులతో చికాకులు ఎదుర్కోవలసి వస్తుంది. కోర్టు వ్యవహారాలలో మెళకువ అవసరం. వస్త్ర, బంగారం, వెండి, లోప, రత్న వ్యాపారులకు శుభదాయకం. సన్నిహితుల సలహాలు హితోక్తులు మీపై మంచి ప్రభావం చూపుతాయి. 
 
ధనస్సు : బ్యాంకు వ్యవహారాలలో అపరిచిత వ్యక్తుల పట్ల మెళకువ అవసరం. రియల్ ఎస్టేట్ వ్యాపారులకు కొత్త వెంచర్ల విషయంలో పునరాలోచన మంచిది. సిమెంట్, కలప, ఐరన్, ఇటుక, ఇసుక రంగుల వ్యాపారులకు మిశ్రమ ఫలితం. మీ మౌనం వారికి గుణపాఠమవుతుంది. మిత్రులతో ఉత్తర ప్రత్యుత్తరాలు సంతృప్తికరంగా ఉంటాయి. 
 
మకరం : ఇతరుల వ్యవహారాలు ఆంతరంగిక విషయాలకు దూరంగా ఉండటం మంచిది. హోటల్, తినుబండరాలు, క్యాటరింగ్, చిరు వ్యాపారులకు లాభదాయకంగా ఉండటం మంచిది. ఆలయాలను సందర్శిస్తారు. సంఘంలో పలుకుబడికల వ్యక్తులతో పరిచయాలు, తరచూ వారితో సంప్రదింపులు వంటి పరిణామాలుంటాయి. 
 
కుంభం : మీ కళత్ర మొండివైఖరి మీకు ఎంతో చికాకు కలిగిస్తుంది. పెద్దల ఆరోగ్యం గురించి ఆందోళన చెందుతారు. వాహనం నడుపునపుడు జాగ్రత్త అవసరం. గృహోపకరణాలలో కొనుగోలు చేస్తారు. బంధువుల రాకపోకలు వల్ల అనుకోని ఖర్చులు అధికమవుతాయి. ఉద్యోగస్తులకు బరువు బాధ్యతలు అధికమవుతాయి. 
 
మీనం : గృహ నిర్మాణాలు, మరమ్మతులు అనుకూలిస్తాయి. ముఖ్యమైన వ్యవహారాలు మీరే సమీక్షించుకోవడం మంచిది. కోర్టు వ్యవహారాల్లో ఫ్లీడర్లు, ఫ్లీడరు గుమస్తాలకు చికాకులు తప్పవు. దంపతుల మధ్య పలు విషయాలు చర్చకు వస్తాయి. ఇతరులకు హామీలు, ధన సహాయం విషయంలో ఏకాగ్రత వహించండి.