శుక్రవారం, 10 జనవరి 2025
  1. ఆధ్యాత్మికం
  2. భవిష్యవాణి
  3. దినఫలం
Written By రామన్

24-01-2020 శుక్రవారం దినఫలాలు : మహాలక్ష్మిని ఎర్రని పూలతో పూజించినట్లైతే?

మేషం : స్త్రీలకు విలాస వస్తువులు, అలంకరణల పట్ల ఆసక్తి పెరుగుతుంది. ఉద్యోగస్తులకు అదనపు బాధ్యతలు, పనిభారం వంటి చికాకులు తప్పవు. మీ ఆలోచనలు, పథకాలు క్రియా రూపంలో పెట్టి విజయం పొందండి. ఆలయాలను సందర్శిస్తారు. మీ శ్రీమతి సలహా తేలికగా కొట్టివేయడం మంచిది కాదు.
 
వృషభం : విద్యార్థుల్లో మనోధైర్యం నెలకొంటుంది. పత్రికా రంగంలోని వారి ఏమరుపాటు వల్ల ఇబ్బందులెదుర్కోవలసి వస్తుంది. నూతన పరిచయాలేర్పడతాయి. గృహ మరమ్మతులు మార్పులు, చేర్పులకు అనుకూలం. ఎదుటివారితో మితంగా సంభాషించడం మంచింది. స్త్రీలకు పనివారలతో చికాకులు తప్పవు. 
 
మిథునం : ఫ్లీడర్లు, ఫ్లీడరు గుమస్తాలకు వృత్తిపరమైన చికాకులు తప్పవు. రుణం, ఇతర వాయిదాలు సకాలంలో చెల్లిస్తారు. ఖర్చులు బాగా పెరిగే ఆస్కారం ఉంది. ఉద్యోగస్తుల దైనందిన కార్యక్రమాలు సజావుగా సాగుతాయి. దూర ప్రయాణాలు అనుకూలిస్తాయి. ఎప్పటి నుంచో వాయిదాపడుతూ వస్తున్న పనులు పునఃప్రారంభమవుతాయి. 
 
కర్కాటకం : ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. స్థిరాస్తి కొనుగోలు లేదా అమ్మకానికై చేయు ప్రయత్నాలు వాయిదాపడతాయి. నిరుద్యోగులకు చిన్న సదావకాశం లభించినా సద్వినియోగం చేసుకోవడం ఉత్తమం. స్టేషనరీ ప్రింటింగ్ రంగాల వారికి ఒత్తిడి పెరుగుతుంది. విద్యార్థినిలు ప్రేమ వ్యవహారాలకు దూరంగా ఉండటం మంచింది. 
 
సింహం : మీ ఆవేశం, అవివేకం వల్ల వ్యవహారం చెడే ఆస్కారం ఉంది. జాగ్రత్త వహించండి. రియల్ ఎస్టేట్ రంగాల వారికి నూతన వెంచర్ల విషయంలో ఇబ్బందులెదుర్కొంటారు. స్త్రీలకు షాపింగ్ వ్యవహారాలలో ఏకాగ్రత అవసరం. నూనె, మిర్చి, కంది వ్యాపారస్తులకు స్టాకిస్టులకు పురోభివృద్ధి కానవస్తుంది. 
 
కన్య : వస్త్ర, బంగారం వ్యాపారస్తులకు సంతృప్తి, పురోభివృద్ధి చేకూరుతుంది. స్త్రీలు తొందరపడి వాగ్దానాలు చేయడం వల్ల సమస్యలు ఎదుర్కొనక తప్పదు. మీ శ్రీమతి ప్రోద్భలంతో కొత్త యత్నాలు మొదలుపెడతరాు. మీ మాటలు ఇతరులకు జారవేసే వ్యక్తులున్నారని గమనించండి. గృహోపకరణాలు సమకూర్చుకుంటారు. 
 
తుల : బంధువులు మీ గురించి చేసిన వ్యాఖ్యలు మనస్తాపం కలిగిస్తాయి. రాజకీయాల్లో వారికి కార్యకర్తల వల్ల సమస్యలు ఎదుర్కొంటారు. ప్రయాణాలు అనుకూలం. కొన్ని సమస్యలు మీ గౌరవ ప్రతిష్టలకు సవాలుగా నిలుస్తాయి. ఇతరులకు పెద్ద మొత్తాలలో ధనసహాయం చేసే విషయంలో లౌకికం ఎంతో అవసరం. 
 
వృశ్చికం : ఆర్థిక ఇబ్బంది లేకపోయినా సంతృప్తి ఉండజాలదు. స్త్రీలకు కాళ్లు, నడుము, నరాలకు సంబంధించిన చికాకులు అధికం అవుతాయి. విదేశీ ప్రయాణాలు వాయిదాపడగలవు. రుణాలు తీరుస్తారు. దంపతులకు కొత్త ఆలోచనలు స్ఫురిస్తాయి. విద్యార్థులకు ఏకాగ్రత, ధ్యేయం పట్ల పట్టుదల ఏర్పడతాయి. 
 
ధనస్సు : కిరాణా, వస్త్ర, వ్యాపారులకు అధిక ఒత్తిడిని ఎదుర్కొంటారు. మిత్రులను కలుసుకుంటారు. రుణ యత్నం వాయిదా పడుతుంది. మీ శ్రమకు తిగిన గుర్తింపు, ప్రతిఫలం పొందుతారు. ఫ్లీడర్లకు, వైద్య రంగంలోని వారికి ఒత్తిడి పెరుగుతుంది. కొంతమంది మిమ్మలను ఉద్రేకపరిచి లబ్ధి పొందాలని యత్నిస్తారు. 
 
మకరం : చేపట్టిన పనులలో శ్రమాధిక్యత ఎదుర్కొన్నా సత్ఫలితాలు పొందుతారు. కోర్టు వ్యవహారాలలో ప్లీడర్లకు ఏకాగ్రత ముఖ్యం. ఖర్చుల విషయంలో ఏకాగ్రత వహిచండి. ఉద్యోగస్తులకు విధి నిర్వహణలో కనపరిచిన ప్రత్యేక శ్రద్ధకు ప్రశంసలు, ఆర్థిక లబ్ధి పొందుతారు. బంధువుల ఆకస్మిక రాకతో గృహంలో సందడి కానవస్తుంది. 
 
కుంభం : కలప, ఇటుక, ఇనుము వ్యాపారస్తులకు ఆశాజనకం. ముఖ్యుల కోసం ధనం బాగుగా వెచ్చించవలసి ఉంటుంది. గత విషయాల గురించి ఆలోచిస్తూ కాలం వ్యర్థం చేయకండి. ఉద్యోగస్తులకు పై అధికారుల నుంచి మంచి గుర్తింపు రాణింపు లభిస్తుంది. విదేశీ ప్రయాణాల పట్ల ఏకాగ్రత వహిస్తారు. 
 
మీనం : ఆడిటర్లు, అకౌంట్స్ రంగాల వారికి ఒత్తిడి పెరుగుతుంది. నిరుద్యోగులకు ఇంటర్వ్యూలలో ఏకాగ్రత అవసరం. ప్రింటింగ్ రంగాల్లో వారికి అచ్చుతప్పులు పడటం వల్ల మాటపడతారు. బ్యాంకు వ్యవహారాల్లో మెళకువ అవసరం. రాజకీయ నాయకులు సామాజిక, సేవా కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొంటారు.