శనివారం, 11 జనవరి 2025
  1. ఆధ్యాత్మికం
  2. భవిష్యవాణి
  3. దినఫలం
Written By రామన్

23-01-2020 గురువారం మీ రాశిఫలాలు - సాయిబాబా గుడిలో ఉండే ధునిలో?

మేషం : వ్యాపారాభివృద్ధికి నూతన ప్రణాళికలు అమలు చేస్తారు. గృహంలో మార్పులు వాయిదాపడతాయి. రవాణా, ప్రకటనలు, విద్యా రంగంలోని వారికి శుభప్రదం. ఖర్చులు పెరిగినా మీ అవసరాలకు కావలసిన ధనం సర్దుబాటు అవుతుంది. మిత్రులతో కలిసి ముఖ్యమైన కార్యక్రమాలలో చురుకుగా పాల్గొంటారు. 
 
వృషభం : రసాయనిక, సుగంధ ద్రవ్య వ్యాపారులకు చికాకులు తప్పవు. మీ వ్యవహారాల్లో జోక్యములకు ఎవరికీ అవకాశాలు ఇవ్వొద్దు. ఎప్పటి నుంచో వాయిదాపడుతున్న పనులు పునఃప్రారంభం కాగలవు. దైవపుణ్య కార్యక్రమాల పట్ల ఆసక్తి పెరుగుతుంది. తరచుగా తెలియక చేసిన పొరపాట్లకు ప్రశ్చాతాపపడతారు. 
 
మిథునం : ఉద్యోగ విషయంలో లాభమైన, నష్టమైనా మీ స్వయంకృతమే. స్త్రీలకు తల, నడుం, నరాలకు సంబంధించిన సమస్యలు అధికమవుతాయి. సంతానం కోసం ధనం విరివిగా ఖర్చు చేస్తారు. అందరి సహాయ సహకారాలు ఉన్నప్పటికీ ప్రతిపనీ రెండోసారి చేయవలసి రావడంతో శ్రమకు లోనవుతారు. 
 
కర్కాటకం : బ్యాంకు డిపాజిట్లు, దీర్ఘకాలిక పెట్టుబడులకు అనుకూలం. మీ కింద పని చేయువారితో దురుసుగా వ్యవహరించరాదు. చిన్ననాటి మిత్రులు గుర్తుకు వస్తారు. సాంస్కృతిక కార్యక్రమాల పట్ల శ్రద్ధ వహిస్తారు. ఇచ్చిపుచ్చుకును వ్యవహారాలు రిజిస్ట్రేషన్లు అనుకూలిస్తాయి. ఫీజులు, బిల్లులు చెల్లిస్తారు. 
 
సింహం : కుటుంబీకుల మధ్య అనురాగ వాత్సల్యాలు పెంపొందుతాయి. ఆకస్మికంగా ప్రయాణాలు వాయిదాపడతాయి. క్రయ విక్రయాలకు సంబంధించిన వ్యవహారాలలో జాగ్రత్త వహించండి. ప్రముఖులతో పరిచయాలు పెంచుకుంటారు. గృహంలో మార్పులు వాయిదాపడతాయి. నూతన వ్యాపారాలు అనుకూలిస్తాయి. 
 
కన్య : పండ్లు, పూలు, కూరగాయల వ్యాపారస్తులకు సంతృప్తికానరాగలదు. భక్తి శ్రద్ధలు పెరుగుతాయి. ముఖ్యమైన నిర్ణయాలు తీసుకుని జయం పొందండి. ప్రింటింగ్, స్టేషనరీ రంగాల వారికి ఒత్తిడి అధికమవుతుంది. వృత్తిపరమైన ప్రయాణాలు అనుకూలిస్తాయి. సన్నిహితుల సలహాలు, హితోక్తులు మీపై మంచి ప్రభావం చూపుతాయి. 
 
తుల : రాజకీయ నాయకులు సభలు, సమావేశాల్లో చురుకుగా పాల్గొంటారు. అనవసరపు వాగ్ధానాలు చేసి సమస్యలను తెచ్చుకోవద్దు. కళాకారులకు ప్రోత్సాహకరంగా ఉంటుంది. స్థిరచరాస్తుల విషయంలో ఒక నిర్ణయానికి వస్తారు. వాహనం నడుపునపుడు జాగ్రత్త అవసరం. మీ సమర్ధతకు తగిన సదావకాశాలు లభిస్తాయి. 
 
వృశ్చికం : కృషి రంగానికి అవసరమైన వస్తువులు రవాణా చేసుకుంటారు. రాజకీయ పార్టీల నాయకులకు ఒక స్థాయి పెరుగుతుంది. మీ కళత్ర మొండివైఖరి మీకు ఎంతో చికాకునిస్తుంది. అధికారులతో సంభాషించేటపుడు ఆత్మనిగ్రహంతో వ్యవహరించిండి. వ్యవసాయ రంగంలోని వారికి నూతన ఆలోచనలు స్ఫురించగలవు. 
 
ధనస్సు : స్త్రీలు సృజనాత్మకతకు, ప్రతిభకు తగిన గుర్తింపు రాణింపు లభిస్తుంది. మీ అంతంరంగిక విషయాలను బయటకు తెలియజేయండి. పనిలో మీ నిపుణుతకు మంచి గుర్తింపు లభిస్తుంది. వాణిజ్య రంగాలవారికి చురుకుదనం కానరాగలదు. మిమ్మల్ని ఉద్రేకపరిచి లబ్దిపొందడానికి ప్రయత్నిస్తారు. జాగ్రత్త వహించండి. 
 
మకరం : ఉన్నత విద్య, విదేశీ వ్యవహారాలకు అనుకూలం. కుటుంబ విషయంలో ఇతరుల జోక్యం మీకు చికాకు కలిగిస్తుంది. రవాణా రంగంలోని వారు ఇబ్బందులను ఎదుర్కొంటారు. హామీలు ఉండటం వల్ల మాటపడక తప్పదు. జాగ్రత్త వహించండి. దూరంలో ఉన్న వ్యక్తుల గురించి కీలకమైన సమాచారం అందుకుంటారు. 
 
కుంభం : పుణ్య కార్యక్రమాలలో పాల్గొంటారు. కాంట్రాక్టర్లకు ఇప్పటివరకు వాయిదాపడుతున్న పనులు పునఃప్రారంభంకాగలవు. మీ సంతానం కోసం నూతన వస్తు, వాహనాలను కొనుగోలుచేస్తారు. అందరికీ సహాయం చేసి నిందారోపణ ఎదుర్కోవలసి వస్తుంది. ప్రయాణాలలో అలసట ఇబ్బందులను ఎదుర్కొంటారు. 
 
మీనం : పోస్టల్, టెలిగ్రాఫ్ రంగాల వారికి ఒత్తిడి ఎదుర్కొంటారు. మీ శ్రీమతి సలహా పాటించడం చిన్నతనంగా భావించకండి. బంధువుల రాక కొంత అసౌకర్యం కలిగిస్తుంది. పాలు, మాంస విక్రయాలు లాభసాటిగా ఉంటాయి. ఆలయాలను సందర్శిస్తారు. మీ యత్నాలకు కుటుంబీకులు సహాయ సహకారాలందిస్తారు.