గురువారం, 9 జనవరి 2025
  1. ఆధ్యాత్మికం
  2. భవిష్యవాణి
  3. పంచాంగం
Written By రామన్
Last Updated : సోమవారం, 20 జనవరి 2020 (10:43 IST)

20-01-2020 సోమవారం మీ రాశిఫలాలు (Video)

మేషం : దైవ, సేవ కార్యక్రమాల కోసం ధనం బాగుగా ఖర్చు చేస్తారు. బంధువుల రాక మీకు ఎంతో ఆశ్చర్య కలిగిస్తుంది. ప్రేమికులకు ఎడబాటు తప్పదు. కుటుంబీకుల మధ్య ఆసక్తికరమైన విషయాలు చర్చకు వస్తాయి. దూర ప్రయాణాలలో వస్తువుల పట్ల మెళకువ అవసరం. ప్రతి విషయంలోనూ ఓర్పు, లౌక్యం అవసరం. 
 
వృషభం : ఉద్యోగస్తులు తోటివారి నుంచి ఆసక్తికరమైన విషయాలు గ్రహిస్తారు. మీ శక్తి సామర్ధ్యాలను ఎదుటివారు గుర్తిస్తారు. బ్యాంకు వ్యవహారాలలో అపరిచిత వ్యక్తులపట్ల మెళకువ అవసరం. విద్యార్థులకు ధ్యేయంపట్ల ఏకాగ్రత ముఖ్యం. కొత్త విషయాల పట్ల ఆసక్తి ఏర్పడతాయి. ఆర్థిక విషయాల్లో ఇబ్బంది లేకపోయినా సంతృప్తికానరాదు. 
 
మిథునం : స్త్రీలు అపరిచిత వ్యక్తుల పట్ల అప్రమత్తంగా మెలగవలసి ఉంటుంది. ఉద్యోగస్తులకు అపరిచిత వ్యక్తుల విషయంలో అప్రమత్తత అవసరం. విద్యార్థులకు శ్రమాధిక్యత, విశ్రాంతి లోపం వంటివి అధికమవుతాయి. ఖర్చుల విషయంలో ప్రణాళికాబద్ధంగా వ్యవహరిస్తారు. కష్ట సమయంలో మిత్రులు అండగా నిలుస్తారు. 
 
కర్కాటకం : సొంతంగా వ్యాపారం చేయాలనే మీ సంకల్పం త్వరలో కార్యరూపం దాల్చుతుంది. బంధువులను కలుసుకుంటారు. స్త్రీలకు స్వీయార్జనపట్ల ఆసక్తి, తగు ప్రోత్సాహం లభిస్తాయి. వాహనం విలువైన వస్తువులు అమర్చుకుంటారు. పారిశ్రామిక రంగంలోని వారికి కార్మికులతో సమస్యలు తలెత్తుతాయి. 
 
సింహం : ఉద్యోగస్తులకు ప్రమోషన్లు, ప్రత్యేక ఇంక్రిమెంట్లు వంటి శుభఫలితాలుంటాయి. పెద్దల ఆహార వ్యవహారాల్లో మెళకువ అవసరం. సతీసమేతంగా ఒక పుణ్యక్షేత్రాన్ని సందర్శిస్తారు. కాంట్రాక్టర్లకు నూతన టెండర్ల విషయంలో పునరాలోచన అవసరం. ప్రేమికులకు పెద్దల నుంచి వ్యతిరేకత, ఇతరత్రా చికాకులు తప్పవు. 
 
కన్య : సాంఘిక, సేవా కార్యక్రమాల్లో స్త్రీలకు ప్రత్యేక గుర్తింపు లభిస్తుంది. దూర ప్రయాణాలు బ్యాంకింగ్ వ్యవహారాల్లో మెళకువ వహించండి. విదేశీయానం కోసం చేసే యత్నాల్లో సఫలీకృతులవుతారు. కార్యసాధనంలో జయం, వ్యవహారాల్లో అనుకూలతలుంటాయి. ప్రముఖులతో సంప్రదింపులు జరుపుతారు. 
 
తుల : ఉపాధ్యాయులతో విద్యార్థులు ఏకీభవించలేకపోతారు. ప్రముఖులతో సంప్రదింపులు జరుపుతారు. పుణ్యక్షేత్రాలను సందర్శిస్తారు. వ్యాపారాభివృద్ధికి నూతన పథకాలు రూపొందిస్తారు. ఉద్యోగస్తులు సమర్థంగా పని చేసి అధికారులను మెప్పిస్తారు. మీ యత్నాల్లో స్వల్ప చికాకులు ఎదురైనా క్రమేణా పరిస్థితులు చక్కబడతాయి. 
 
వృశ్చికం : ప్రభుత్వ కార్యాలయాల్లో మీ పనులు సానుకూలతకు పలుమార్లు తిరగవలసి ఉంటుంది. కుటుంబీకుల కోసం ధనం విరివిగా వ్యయం చేస్తారు. హోటల్, కేటరింగ్ రంగాల్లో వారు పనివారితో ఇబ్బందులు ఎదుర్కొంటారు. ప్రస్తుతం నెలకొన్న పరిస్థితులు తాత్కాలికమేనని గమనించి శ్రమించడి. అనుకున్నది సాధిస్తారు. 
 
ధనస్సు : మీ సంతానం విద్యా విషయాల పట్ల శ్రద్ధాసక్తులు కనబరుస్తారు. స్త్రీల మాటకు కుటుంబంలోనూ, సంఘంలోనూ ఆమోదం లభిస్తుంది. గృహంలో ఏదైనా శుభకార్యం చేయాలనే ఆలోచన స్ఫురిస్తుంది. సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు. ఆహార, వ్యవహారాలలో మెళకువ వహించండి. ఆసక్తికరమైన విషయాలు మీ దృష్టికి వస్తాయి. 
 
మకరం : కానివేళలో ఇతరుల రాక ఇబ్బంది కలిగిస్తుంది. ప్రైవేటు సంస్థలలోని వారికి బ్యాంకు లావాదేవీల్లో అప్రమత్తత అవసరం. మీ ఉత్సాహాన్ని అదుపులో ఉంచుకోవడం శ్రేయస్కరం. మీ పలుకుబడి, మంచితనం దుర్వినియోగం అయ్యే ఆస్కారం ఉంది. మెలకువ వహించండి. పెద్దల ఆరోగ్యం కుదుటపడుతుంది. 
 
కుంభం : కాంట్రాక్టర్లు ఏకకాలంలో అనేక పనులు చేపట్టడం వల్ల ఒత్తిడి, ఆందోళనలకు గురవుతారు. మిత్రులను కలుసుకుంటారు. కోర్టులో వాయిదాపడిన పనులు పునఃప్రారంభిస్తారు. హామీలు, మధ్యవర్తిత్వాలకు దూరంగా ఉండటం మంచిది. స్త్రీలు భేషజాలకు పోకుండా పరిస్థితులకు అనుగుణంగా మెలగవలసి ఉంటుంది. 
 
మీనం : ఇతరులను మీ కుటుంబ వ్యవహారాలకు దూరంగా ఉండటం మంచిది. మాట్లాడలేనిచోట మౌనం వహించడం మంచిది. మీ పనులు మందకొడిగా సాగుతాయి. సత్కాలం ఆసన్నమవుతోంది. మీ ఆలోచనలు, పథకాలు క్రియారూపం దాల్చుతాయి. రుణయత్నాల్లో అనుకూలత, పెద్దల సహకారం లభిస్తుంది.