గురువారం, 9 జనవరి 2025
  1. ఆధ్యాత్మికం
  2. భవిష్యవాణి
  3. దినఫలం
Written By రామన్

19-01-2020 ఆదివారం మీ రాశి ఫలితాలు

సూర్య స్తుతి ఆరాధించిన శుభం కలుగుతుంది. 
 
మేషం: స్త్రీల గృహోపకరణాలు కొనుగోలు చేస్తారు. విద్యార్థులు బజారు తినుబండారాలు భుజించడం వల్ల అస్వస్థతకు లోనవుతారు. కొబ్బరి, పండ్ల, పూల, కూరగాయల వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. రాజకీయాల్లోని వారికి కార్యకర్తల వల్ల ఇబ్బందులు ఎదురవుతాయి. దూర ప్రయాణాల్లో చికాకులు తప్పవు. 
 
వృషభం: పత్రికా సంస్థల్లోని వారికి మార్పుల విషయంలో పునరాలోచన మంచిది. మీ ఉన్నతిని చూసి అసూయపడేవారు అధికమవుతున్నారని గమనించండి. రావలసిన మొండి బాకీలు  సైతం వసూలు కాగలవు. స్త్రీలకు పనివారితో ఇబ్బందులు తప్పవు. ప్రతి చిన్న విషయానికి ఇతరులపై ఆధారపడటం మంచిది కాదు. 
 
మిథునం: మీ శ్రీమతి, సంతానం కోరికలు నెరవేర్చగలుగుతారు. కొంత ఆలస్యంగానైనా తలపెట్టిన పనులు పూర్తి కాగలవు. బంధువుల రాకపోకలు అధికమవుతాయి. చెల్లింపులు, రుణ వాయిదాలు సక్రమంగా నెరవేరుస్తారు. మీ సంతానం మొండి వైఖరి ఆగ్రహం కలిగిస్తుంది. ఉపాధ్యాయులు విశ్రాంతి పొందుతారు. 
 
కర్కాటకం: జూదాలు, పందేలకు దూరంగా వుండాలి. భార్యాభర్తల మధ్య విబేధాలు తలెత్తవచ్చు. వాహనం ఇతరులకు ఇచ్చి ఇబ్బందులను ఎదుర్కొంటారు. మత్స్య కోళ్ల వ్యాపారస్తులకు లాభదాయకంగా ఉంటుంది. రాజకీయ నాయకులు సభలు, సమావేశాల్లో హుందాగా వ్యవహరించి అందరినీ ఆకట్టుకుంటారు.
 
సింహం: స్త్రీలలో భక్తిపరమైన ఆలోచనలు అధికమవుతాయి. ఆపద సమయంలో మిత్రులు అండగా నిలుస్తారు. ఉద్యోగస్తులు విశ్రాంతికై చేయు ప్రయత్నాలు అనుకూలిస్తాయి. గృహానికి కావలసిన వస్తువులను కొనుగోలు చేస్తారు. పెద్దల ఆరోగ్యం గురించి ఆందోళన చెందుతారు. దైవ సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు. 
 
కన్య: మీ సంకల్పసిద్ధికి నిరంతర శ్రమ, పట్టుదల చాలా ముఖ్యమని గమనించండి. కానివేళలో ఇతరుల రాక ఇబ్బంది కలిగిస్తుంది. స్త్రీలు తమ సరదాలు, అవసరాలు వాయిదా వేసుకోవాల్సి వస్తుంది. దైవ, సేవ, పుణ్య కార్యాల్లో చురుకుగా వ్యవహరిస్తారు. మీ సహాయ సహకారాలకు మంచి పేరు, ఖ్యాతి లభిస్తుంది. 
 
తుల: మీ శ్రీమతి వితండ వాదం, సంతానం మొండితనం చికాకు కలిగిస్తాయి. ఏ విషయంలోను ఒంటెత్తు పోకడ మంచిది కాదని గమనించండి. ఉద్యోగస్తులు సభ, సమావేశాల్లో పాల్గొంటారు. కుటుంబంలో చిన్న చిన్న సమస్యలు తలెత్తవచ్చు. జాగ్రత్త వహించండి. విద్యార్థులు కళాత్మక, క్రీడా పోటీల్లో విజయం సాధిస్తారు.
 
వృశ్చికం: స్త్రీలకు టీవీ ఛానెళ్ళ  కార్యక్రమాల సమాచారం అందుతుంది. కొబ్బరి, పండ్లు, పూలు, చిరు వ్యాపారులకు లాభదాయకం. వాహనం కొనుగోలుకై చేయు ప్రయత్నాలు ఫలిస్తాయి. మీ బలహీనతలు, అలవాట్లు అదుపులో ఉంచుకోవడం మంచిది. పుణ్యక్షేత్రాల దర్శనం వల్ల మానసిక ప్రశాంతత చేకూరుతుంది. 
 
ధనస్సు: ఆర్థిక సమస్యలు ఒక కొలిక్కి వచ్చే సూచనలున్నాయి. ఆరోగ్యం పట్ల ప్రత్యేక శ్రద్ధ కనబరుస్తారు. రుణ విముక్తులు కావడంతో పాటు కొత్త రుణాలు లభిస్తాయి. వ్యాపారాభివృద్ధికి మరింతగా శ్రమించవలసివుంటుంది. చేపట్టిన పనులు అర్థాంతరంగా ముగిస్తారు. మీ కళత్ర వైఖరి మీకు ఎంతో చికాకు కలిగిస్తుంది. 
 
మకరం: కుటుంబీకుల మధ్య కొత్త కొత్త విషయాలు చర్చకు వస్తాయి. ప్రేమికులకు చికాకులు, ఎడబాటు తప్పవు. వస్త్ర, బంగారం, ఫ్యాన్సీ, పచారి, మందుల వ్యాపారులకు పురోభివృద్ధి. అందరితో కలిసి విందు వినోదాల్లో పాల్గొంటారు. కొత్త వ్యక్తులతో పరిచయాలేర్పడతాయి. రవాణా రంగాల వారికి చికాకులు అధికం. 
 
కుంభం: మీ మాటకు ఇంటా బయటా ఆదరణ లభిస్తుంది. మిత్రుల కలయికతో మానసికంగా కుదుటపడతారు. బెట్టింగ్‌లు,  జూదాలు, వ్యసనాలకు దూరంగా వుండటం క్షేమదాయకం. బంధువుల రాకతో గృహంలో సందడి కానవస్తుంది. ఫ్యాన్సీ, బేకరీ, పండ్లు, కొబ్బరి, వ్యాపారులకు పురోభివృద్ధి. ఆలయాలను సందర్శిస్తారు.
 
మీనం: ఒక విషయంలో మీ ఊహలు, అనుమానాలు నిజమవుతాయి. నిరుద్యోగులకు ఇంటర్వ్యూల్లో ఏకాగ్రత ముఖ్యం. జూదాలు, పందేల్లో నష్టాలు, ఇబ్బందులు తప్పవు. ఒక అవసరానికి ఉంచిన ధనం మరో ఖర్చుకు వినియోగించాల్సి వస్తుంది. మీ కుటుంబ సభ్యులతో కలిసి విందు, వినోదాల్లో పాల్గొంటారు.