గురువారం, 9 జనవరి 2025
  1. ఆధ్యాత్మికం
  2. భవిష్యవాణి
  3. పంచాంగం
Written By రామన్

17-01-2020 శుక్రవారం దినఫలాలు - మహాలక్ష్మిని ఎర్రని పూలతో పూజించినా...

మేషం : మనోధైర్యంతో మీ యత్నాలు కొనసాగించండి. పూర్వపు మిత్రులను కలుసుకుంటారు. అధికారులతో సంభాషించేటపుడు ఆత్మనిగ్రహంతో వ్యవహరించండి. ఇతరులకు సలహాలు ఇచ్చి మీరు సమస్యలను తెచ్చుకుంటారు. కొంతమంది సూటిపోటి మాటలు పడటం వల్ల మానసిక ఆందోళనకు గురవుతారు. 
 
వృషభం : ఉద్యోగరీత్యా దూర ప్రయాణాలు చేయవలసి వస్తుంది. కాంట్రాక్టుల కోసం ముమ్మరంగా ప్రయత్నిస్తారు. ఆలయాలను సందర్శిస్తారు. ముఖ్యులకు బహుమతులు అందజేస్తారు. బ్యాంకు డిపాజిట్లు, దీర్ఘకాలిక పెట్టుబడులకు అనుకూలం. చిట్స్, ఫైనాన్స్ వ్యాపారులకు ఖాదారుల నుంచి ఒత్తిడి, చికాకులు అధికమవుతాయి. 
 
మిథునం : శ్రీవారు, శ్రీమతి వైఖరిలో మార్పు గమనిస్తారు. పుణ్యక్షేత్రాల దర్శనం వల్ల మానసిక ప్రశాంతత చేకూరుతుంది. ప్రముఖులను కలుసుకుంటారు. ఉపాధ్యాయులకు పనిభారం అధికమవుతుంది. రాజకీయ, కళారంగాల వారికి ప్రభుత్వం నుంచి ఆహ్వానాలు రాగలవు. ప్రియతములతో విరామ కాలక్షేపాలలో పాల్గొంటారు. 
 
కర్కాటకం : స్టేషనరీ, ప్రింటింగ్ రంగాల వారికి మందకొడిగా ఉంటుంది. ఖర్చులు అధికమవుతాయి. కృషి రంగానికి అవసరమైన వస్తువులు  రవాణా చేసుకుంటారు. పాత మిత్రుల కలయికతో మీలో కొత్త ఆలోచనలు స్ఫురిస్తాయి. కోర్టు వ్యవహారాలు, పాత సమస్యలు చికాకు పరుస్తాయి. స్త్రీలతో ఒత్తిడి, హడావుడి అధికమవుతాయి. 
 
సింహం : పోస్టల్, టెలిగ్రాఫ్ రంగాల వారికి సామాన్యంగా ఉంటుంది. బ్యాంకు వ్యవహారాల్లో అపరిచిత వ్యక్తుల పట్ల జాగ్రత్త. అతిథి మర్యాదలు బాగుగా నిర్వహిస్తారు. వాహనం నడుపునపుడు ఏకాగ్రత అవసరం. రాజకీయ రంగాల వారికి గుర్తింపు, రాణింపు లభిస్తుంది. టెక్నికల్ రంగంలోని వారు బాగా అభివృద్ధి చెందుతారు. 
 
కన్య : ప్రింటింగ్, స్టేషనరీ రంగాల వారు అచ్చు తప్పులు పడుటవల్ల మాటపడవలసి వస్తుంది. స్త్రీల కారణంగా చిక్కుల్లో పడే ఆస్కారం ఉంది. దూర ప్రయాణాల్లో అసౌకర్యానికి గురవుతారు. ఆకస్మికంగా ఫీజులు, బిల్లులు చెల్లిస్తారు. నిరుద్యోగులకు ఇంటర్వ్యూలకు సంబంధించిన సమాచారం అందిస్తారు. రుణాలు కోసం అన్వేషిస్తారు. 
 
తుల : కంప్యూటర్, ఎలక్ట్రానిక్ రంగాలవారికి మిశ్రమ ఫలితం. బంగారు, వెండి, లోప, వస్త్ర, వ్యాపార రంగాలవారు అధిక ఒత్తిడిని ఎదుర్కొంటారు. విద్యా, సాంస్కృతిక కార్యక్రమాలలో చురుకుగా పాల్గొంటారు. రవాణా వ్యవహారాలలో ఆచితూచి వ్యవహరించండి. నిరుద్యోగులకు సదావకాశాలు లభిస్తాయి. సద్వినియోగం చేసుకోండి.
 
వృశ్చికం : విలాస వస్తువులు అమర్చుకోవాలనే స్త్రీల కోరికలు నెరవేరుతాయి. గత అనుభవాలు జ్ఞప్తికి వస్తాయి. వాహనం కొనుగోలుకై చేయు ప్రయత్నాలు అనుకూలిస్తాయి. మీ అభిరుచికి తగిన వ్యక్తితో పరిచయాలు ఏర్పడతాయి. మిత్రులతో కలిసి ఆనందాన్ని పంచుకుంటారు. చిన్నారుల మొండివైఖరి మీకు చికాకు కలిగిస్తుంది. 
 
ధనస్సు : శాస్త్ర సంబంధమైన విషయాలు ఆసక్తిని చూపుతాయి. కిరాణా, ఫ్యాన్సీ, మందులు, రసాయన సుగంధద్రవ్య వ్యాపారులకు సంతృప్తి, పురోభివృద్ధి. రాజకీయ నాయకులకు మంచి పేరు, ఖ్యాతి లభిస్తుంది. వృత్తుల వారి శ్రమకు తగిన ప్రతిఫలం దక్కుతుంది. వ్యాపారాభివృద్ధికి కొత్త కొత్త ప్రణాళికలు, పథకాలు అమలు చేస్తారు. 
 
మకరం : రవాణా, ప్రణాళికలు, బోధన, ప్రకటనల రంగాలవారు ఆచితూచి వ్యవహరించాలి. స్త్రీ పనివారితో సమస్యలు తలెత్తినా నెమ్మెదిగా సమసిపోతాయి. ప్రయాణాలు అనుకూలం. ఒంటెత్తు పోకడ మంచిది కాదని గమనించండి. అనవసరపు సంభాషణల వల్ల ముఖ్యులతో ఆకస్మిక భేదాభిప్రాయాలు తలెత్తే ఆస్కారం ఉంది. 
 
కుంభం : కపటం లేని మీ ఆలోచనలు, సలహాలు మీకు అభిమానుల్ని సంపాదించి పెడుతుంది. పెద్దలుగా బాధ్యతలు నిర్వహిస్తారు. వైద్యులకు ఆపరేషన్లు చేయునపుడు ఏకాగ్రత అవసరం. కోర్టు తీర్పులు మీకు అనుకూలంగా వచ్చే అవకాశం ఉంది. ధైర్యంగా మీ ప్రయత్నాలు సాగించండి. ప్రియతములు ఇచ్చే సలహా మీకు ఎంతో సంతృప్తినిస్తుంది. 
 
మీనం : మీ వృత్తికి సంబంధించిన వ్యవహారాలను శ్రద్ధగా మలచుకోవడం వల్లనే వాటికి పరిష్కారం లభిస్తుంది. ప్రేమికులకు పెద్దల నుంచి ప్రోత్సాహం, సన్నిహితుల సహకారం ఉంటాయి. కొన్ని విషయాల్లో అంచనాలు తారుమారవుతాయి. స్త్రీలకు నడుము, నరాలు, ఎముకలకు సంబంధించిన చికాకులు అధికమవుతాయి.