గురువారం, 9 జనవరి 2025
  1. ఆధ్యాత్మికం
  2. భవిష్యవాణి
  3. పంచాంగం
Written By రామన్

06-02-2020 గురువారం రాశిఫలాలు - సాయిబాబాను ఆరాధించినా...

astrology - Saibaba
మేషం : ఆర్థిక పరిస్థితి అనుకున్నంత సంతృప్తిగా సాగదు. విదేశీయానం కోసం చేసే యత్నాలు వాయిదాపడతాయి. ఇతరుల ముందు వ్యక్తిగత విషయాలు వెల్లడించడం మంచిదికాదని గమనించండి. ప్రిటింగ్ స్టేషనరీ రంగాల వారికి ఒత్తిడి పెరుగుతుంది. స్త్రీలకు బంధువర్గాల్లో మంచి గుర్తింపు లభిస్తుంది. 
 
వృషభం: ఉద్యోగస్తులకు అధికారులు, సహోద్యోగుల్లో మంచి గుర్తింపు లభిస్తుంది. ఖర్చులు అధికమవుతాయి. రావలసిన బాకీలు వసూలు కాకపోవడంతో ఆందోళన చెందుతారు. కిరాణా, ఫ్యాన్సీ, రసాయన సుగంధ ద్రవ్య వ్యాపారులకు కలిసిరాగలదు. ప్రముఖులతో కీలకమైన వ్యవహారాలు చర్చలు జరుపుతారు. 
 
మిథునం : దంపతుల మధ్య పలు ఆలోచనలు చోటుచేసుకుంటాయి హోదాలో ఉన్న అధికారులకు ఆకస్మిక స్థానచలనం తప్పదు. ఆస్తి, స్థల వివాదాలు పరిష్కార దిశగా సాగుతాయి. వాయిదాపడిన మొక్కుబడులు అనుకోకుండా తీర్చుకుంటారు. క్రయ విక్రయాలు లాభసాటిగా సాగుతాయి. శత్రువులపై విజయం సాధిస్తారు. 
 
కర్కాటకం : పుణ్యక్షేత్రాలను సందర్శిస్తారు. స్త్రీల సృజనాత్మకతకు తగిన గుర్తింపు లభిస్తుంది. ఉద్యోగస్తులు ఎటువంటి ఉద్రేకాలకు లోనుకాకుండా ఏకాగ్రతతో వ్యవహరించడం అన్ని విధాలా క్షేమదాకయం. బంధువులతో సఖ్యతగా మెలుగుతూ మీ పనులు, వ్యవహారాలు చక్కబెట్టుకుంటారు. విద్యార్థుల్లో మనోధైర్యం నెలకొంటుంది. 
 
సింహం : లౌక్యం, సర్దుబాటు ధోరణితో వ్యవహరించడం వల్ల కొన్ని సమస్యలు పరిష్కారమవుతాయి. మీ సంతానం మొండితనం వల్ల అసహనానికి గురవుతారు. కోర్టు వ్యవహారాలు వాయిదాపడతాయి. చేపట్టిన పనులు సకాలంలో పూర్తిచేస్తారు. ప్రయాణాలు అనుకూలిస్తాయి. ఖర్చులు అదుపు చేయాలన్న మీ ఆశయం నెరవేరదు. 
 
కన్య : ఆర్థిక లావాదేవీలు, కుటుంబ వ్యవహారాలు సమర్థంగా నిర్వహిస్తారు. అకౌంట్స్, కంప్యూటర్ రంగాల వారికి ఒత్తిడి. పనిభారం అధికం. గృహ మరమ్మతులు, మార్పులు, చేర్పులకు అనుకూలం. బ్యాంకు వ్యవహారాలలో అపరిచిత వ్యక్తులతో ఆచితూచి సంభాషించండి. పెంపుడు జంతువుల పట్ల ఆందోళన చెందుతారు. 
 
తుల : వృత్తి వ్యాపారాల్లో శ్రమించిన కొలది ఫలితం ఉంటుంది. ఆత్మీయుల రాకతో మనస్సు కుదుటపడుతుంది. ఏదైనా స్థిరాస్తి అమ్మకం చేయాలనే ఆలోచన స్ఫురిస్తుంది. పత్రికా సంస్థలలోని వారికి ఎంత శ్రమించనా ఏమాత్రం గుర్తింపు ఉండదు. మీ దైనందిన కార్యక్రమాలు మందకొడిగా సాగుతాయి. 
 
వృశ్చికం : నిరుద్యోగులు వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవడం మంచిది. పట్టుదలతో శ్రమించి అనుకున్నది సాధిస్తారు. అధికారులు ధన ప్రలోభాలాకు దూరంగా ఉండటం క్షేమదాయకం. సంఘంలో పలుకుబడి కలిగిన వ్యక్తుల సహాయం అందుతుంది. స్త్రీలకు అలంకారాలు, విలాస వస్తువుల పట్ల మక్కువ పెరుగుతుంది. 
 
ధనస్సు : ఉపాధ్యాయులకు విద్యార్థుల వల్ల సమస్యలు తలెత్తే ఆస్కారం ఉంది. జాగ్రత్త వహించండి. సోదరీ, సోదరులతో వివాదాలు పరిష్కారమవుతాయి. ఖర్చులు అధికమవుతాయి. మీ శ్రీమతి సలహా పాటించడం వల్ల ఆశించిన ప్రయోజనం ఉంటుంది. సభలు, సమావేశాల్లో హుందాగా వ్యవహరించి అందరినీ ఆకట్టుకుంటారు. 
 
మకరం : మీ ఆశయాలు, అభిరుచికి తగిన వ్యక్తులతో పరిచయాలేర్పడతాయి. చేతి వృత్తి వ్యాపారులకు పనిభారం అధికమవుతుంది. బంధువుల రాకతో ఖర్చులు అధికమవుతాయి. వాహనం నపుడునపుడు జాగ్రత్త అవసరం. లాయర్లకు ఒత్తిడి, చికాకులు తప్పవు. ఇతరుల కుటుంబ విషయాలలో మధ్యవర్తిత్వం వల్ల ఇబ్బందిపడతారు. 
 
కుంభం : రావలసిన ధన చేతికందుతుంది. ప్రయాణాలలో నూతన పరిచయాలేర్పడతాయి. ఉపాధ్యాయులు అనుకున్న పనులు సకాలంలో పూర్తిచేస్తారు. స్త్రీలకు పనివారలతో ఒత్తిడి, చికాకులను ఎదుర్కొంటారు. వాహనం ఇతరులకు ఇచ్చి ఇబ్బందులను ఎదుర్కొంటారు. కార్యసాధనంలో జయం పొందుతారు. 
 
మీనం : వృత్తి వ్యాపారుల మధ్య నూతన స్నేహం ఏర్పడతుంది. హామీల విషయంలో లౌక్యంగా వ్యవహరించండి. మీ శ్రీమతి సలహా పాటించడం వల్ల ఒక సమస్య నుంచి గట్టెక్కుతారు. బిల్లులు చెల్లించగలుగుతారు. ప్రింటింగ్ రంగాల్లో వారికి అచ్చుతప్పులు దొర్లుట వల్ల పై అధికారుల చేత మాటపడాల్సి వస్తుంది.