సోమవారం, 23 డిశెంబరు 2024
  1. ఆధ్యాత్మికం
  2. భవిష్యవాణి
  3. దినఫలం
Written By రామన్
Last Updated : ఆదివారం, 9 ఫిబ్రవరి 2020 (12:35 IST)

09-02-2020 ఆదివారం మీ రాశి ఫలితాలు (video)

సూర్యస్తుతితో శుభం కలుగుతుంది 
 
మేషం: పారిశ్రామిక రంగాల వారికి ఆశాజనకం. స్త్రీలకు టీవీ కార్యక్రమాలకు సంబంధించిన సమాచారం అందుతుంది. మీ గౌరవ మర్యాదలకు భంగం కలుగకుండా వ్యవహరించండి. విద్యార్థులకు ఉపాధ్యాయులతో సత్సంబంధాలు నెలకొంటాయి. ఉద్యోగస్తులు సమర్థవంతంగా పనిచేసి అధికారులను మెప్పిస్తారు.
 
వృషభం: ఎదుటివారితో మితంగా సంభాషించడం మంచిది. భాగస్వామిక చర్చలు, ప్రముఖులతో మంతనాలు ప్రశాంతంగా ముగుస్తాయి. బంధువులను కలుసుకుంటారు. విద్యార్థులు, ఉపాధ్యాయులకు ఒత్తిడి, ఆందోళనలు అధికం. ఒక స్థిరాస్తి కొనుగోలు యత్నాలు సాగిస్తారు. వాహన చోదకులకు ఏకాగ్రత ముఖ్యం.
 
మిథునం: ఆర్థిక ఇబ్బందులు తొలగిపోయే ఆస్కారం వుంది. అందరితో కలిసి విందు, వినోదాల్లో పాల్గొంటారు. యాదృచ్ఛికంగా ఒక పుణ్యక్షేత్రం సందర్శిస్తారు. వృత్తుల్లో తోటివారితో అభిప్రాయబేధాలు తలెత్తకుండా ముందస్తు జాగ్రత్తలువహించండి. మీ మంచి కోరుకును వారి కంటే మీ చెడును కోరే వారే ఎక్కువగా వున్నారు. 
 
కర్కాటకం: హోటల్ తినుబండారాలకు వ్యాపారులకు లాభదాయకంగా ఉంటుంది. నిర్మాణ పనులు, గృహ మరమ్మతులు మందకొడిగా సాగుతాయి. ప్రయాణాలు, దైవ దర్శనాల్లో ఒకింత అసౌకర్యానికి లోనవుతారు. కోర్టు వ్యవహారాలు మీరు కోరుకున్నట్లే వాయిదా పడతాయి. ఉద్యోగస్తులకు ఒత్తిడి, పనిభారం అధికం. 
 
సింహం: మీ కదలికలు, స్థితిగతులపై కొంతమంది నిఘా వేశారనే విషయాన్ని గమనించండి. ఎదుటి వారి విషయాల్లో అతిగా వ్యవహరించండ వల్ల ఇబ్బందులు ఎదురవుతాయి. దంపతుల మధ్య పలు విషయాలు చర్చకు వస్తాయి. నిరుద్యోగులకు ఇంటర్వ్యూల్లో ఏకాగ్రత ముఖ్యం. స్త్రీలతో సంభాషించినపుడు మెళకువ అవసరం.
 
కన్య : ఆర్థిక లావాదేవీలు, వ్యాపారాలు సంతృప్తికరంగా సాగుతాయి. స్త్రీలకు ఆరోగ్యంలో మెళకువ అవసరం. క్రయ విక్రయాలు లాభసాటిగా ఉంటాయి. దంపతులకు ఏ విషయంలోను పొత్తు కుదరదు. విదేశాల్లోని ఆత్మీయుల క్షేమసమాచారాలు సంతృప్తినిస్తాయి. సన్నిహితుల మధ్య కీలకమైన విషయాలు చర్చకు వస్తాయి.
 
తుల: ట్రావెలింగ్, ట్రాన్స్‌పోర్టు, ఆటోమొబైల్ రంగాల వారికి ఆశాజనకం. వాహనం నడుపుతున్నప్పుడు జాగ్రత్త అవసరం. మీ ఆవేశం, అవివేకం వల్ల వ్యవహారం చెడే ఆస్కారం వుంది. జాగ్రత్త వహించండి. ప్లీడర్లు, ప్లీడరు గుమాస్తాలకు వృత్తిపరమైన చికాకులు తప్పవు. ఏదైనా విలువైన వస్తువు అమర్చుకోవాలనే మీ కోరిక నెరవేరుతుంది. 
 
వృశ్చికం: చిట్స్, ప్రైవేట్ ఫైనాన్సు వ్యాపారులకు ఖాతాదారుల నుంచి ఒత్తిడి పెరుగుతుంది. ఉద్యోగస్తులు, అధికారులు ప్రలోభాలకు దూరంగా ఉండటం మంచిది. విద్యార్థినులకు పరిచయాలు, వ్యాపకాలు పెరుగుతాయి. ప్రయాణాల లక్ష్యం నెరవేరుతుంది. సంఘంలో పలుకుబడి కలిగిన వ్యక్తులతో పరిచయాలు ఏర్పడతాయి.
 
ధనస్సు: భాగస్వామిక వ్యవహారాలు, ఆర్థిక లావాదేవీలు సమర్థవంతంగా నిర్వహిస్తారు. రావలసిన ధనం అందడంతో తనఖా పెట్టిన వస్తువులు విడిపించుకుంటారు. నిరుద్యోగులకు సదవకాశాలు లభిస్తాయి. కాంట్రాక్టర్లకు రావలసిన బిల్లులు మంజూరు కావడంతో నిలిచిపోయిన పనులు పునః ప్రారంభవుతాయి.
 
మకరం: ప్రణాళికా బద్ధంగా వ్యవహరిస్తే రాజకీయ, కళా రంగాలకు చెందిన వారు లక్ష్యాలు సాధిస్తారు. పెద్దల ఆరోగ్యంలో మెళకువ అవసరం. ఆత్మ విశ్వాసం రెట్టింపుపవుతుంది. ఎలక్ట్రికల్, ఎలక్ట్రానికల్, కంప్యూటర్ రంగాల వారికి అవకాశాలు లభిస్తాయి. కుటుంబీకుల మధ్య మనస్పర్ధలు వస్తాయి. విద్యార్థులు మంచి ఫలితాలు సాధిస్తారు. 
 
కుంభం: స్త్రీలకు తల, కాళ్లు, నరాలకు సంబంధించిన చికాకులు అధికంగా వుంటాయి. పోస్టల్, టెలిగ్రాఫ్ రంగాల్లో వారికి అనుకూలం. ప్రముఖులతో కలయిక ఉత్సాహాన్ని కలిగిస్తుంది. స్టేషనరీ, ప్రింటింగ్ రంగాల్లో వారికి అనుకూలం. ప్రముఖులతో కలయిక ఉత్సాహాన్ని కలిగిస్తుంది. స్టేషనరీ, ప్రింటింగ్ రంగాల్లో వారికి అనుకూలం.
 
మీనం: ఆర్థిక లావాదేవీలు, నూతన వ్యాపారాలు సంతృప్తికరంగా సాగుతాయి. ప్రతి విషయంలోను స్వయం కృషిపైనే ఆధారపడాల్సి వుంటుంది. ఎదుటివారితో ఎలా మాట్లాడినా తప్పుగానే భావిస్తారు. ఆకస్మిక ఖర్చులు మనశ్శాంతిని దూరం చేస్తాయి. ఉద్యోగస్తులు అధికారులతో సంభాషించేటప్పుడు మెళకువ అవసరం.