శనివారం, 25 జనవరి 2025
  1. ఆధ్యాత్మికం
  2. భవిష్యవాణి
  3. పంచాంగం
Written By రామన్
Last Updated : శుక్రవారం, 7 ఫిబ్రవరి 2020 (13:11 IST)

07-02-2020 శుక్రవారం దినఫలాలు - లక్ష్మీదేవిని పూజించి అర్చించినా... (video)

మేషం : నిర్మాణ పనుల్లో కాంట్రాక్టర్లకు అధికారుల నుంచి అభ్యంతరాలు ఎదురవుతాయి. కోర్టు వ్యాజ్యాలను ఉపసంహరించుకుంటారు. రావలసిన ధనం చేతికందడంతో ఆర్థిక ఇబ్బంది అంటూ ఏమీ ఉండవు. వృత్తి వ్యాపారాలు సంతృప్తికరంగా సాగుతాయి. ఉద్యోగరీత్యా ఆకస్మికంగా ప్రయాణాలు చేస్తారు. 
 
వృషభం : దీర్ఘకాలిక పెట్టుబడుల విషయంలో ఒక నిర్ణయానికి వస్తారు. స్త్రీలు భేషజాలకు పోకుండా పరిస్థితులకు అనుగుణంగా నడుచుకోవడం శ్రేయస్కరం. దూర ప్రయాణాలలో నూతన పరిచయాలేర్పడతాయి. ఉపాధ్యాయులకు ఒత్తిడి, చికాకులు ఏర్పడతాయి. వైద్యులకు ఆపరేషన్ల  సమయంలో మెళకువ అవసరం. 
 
మిథునం : బంధు మిత్రుల అనుభవాలతో చేదు అనుభవాలు చవిచూస్తారు. తొందరపాటు నిర్ణయాల వల్ల ఇబ్బందులు పడే అవకాశం ఉంది. కుటుంబంలో మానసిక విజ్ఞతయుతంగా ఒక సమస్యను పరిష్కరిస్తారు. ప్రముఖుల కలయిక సాధ్యముకాదు. ప్రింటింగ్ రంగాల వారికి బకాయిల వసూలు కాగలవు. 
 
కర్కాటకం : స్త్రీలు ఏమరుపాటుతనంవల్ల విలువైన వస్తువులు చేజార్చుకునే అవకాశం ఉంది. ముఖ్యమైన వ్యక్తులు చిన్ననాటి మిత్రులను కలుసుకుంటారు. బ్యాంకు పనుల్లో జాప్యం వల్ల ఇబ్బందులెదుర్కొంటారు. నిరుద్యోగులకు ఇంటర్వ్యూలలో మెళకువ అవసరం. ఇతరుల సలహా పాటించడం వల్ల సమస్యలు తప్పవు. 
 
సింహం : మీ సంతానం విద్యా విషయాల పట్ల శ్రద్ధ వహిస్తారు. ప్రేమికులు అతిగా వ్యవహరించడం వల్ల చిక్కుల్లో పడే ఆస్కారం ఉంది. ప్రముఖులను కలుసుకుంటారు. ఆడిటర్లు, అకౌంట్స్ రంగాల వారికి పనిభారం. విశ్రాంతి లోపం వంటి చికాకులు తప్పవు. పత్రికా సంస్థలలోని వారు ఒక ప్రకటన పట్ల ఆకర్షితులవుతారు. 
 
కన్య : ఆర్థిక స్థితి కొంత మేరకు మెరుగుపడుతుంది. రాజకీయాలలో వారు ప్రత్యర్థులు పెరుగుతున్నారని గమనించండి. ఉద్యోగస్తులు సమర్ధంగా పనిచేసి అధికారుల ప్రశంసలు పొందుతారు. మీ సంతానం కోసం ధనం అధికంగా వెచ్చిస్తారు. క్రయ విక్రయాలు లాభసాటిగా ఉంటాయి. బ్యాంకు పనులు ఆలస్యంగా పూర్తివుతాయి. 
 
తుల : ఆర్థిక విషయాలు, పెట్టుబడుల గురించి స్పష్టమైన నిర్ణయానికి వస్తారు. హోటల్, తినుబండరాలు, క్యాటరింగ్ పనివారలకు పనిభారం అధికమవుతుంది. గత విషయాలు జ్ఞప్తికి రాగలవు. టీవీ, రేడియో, సాంకేతిక రంగాల్లో వారికి గుర్తింపు లభిస్తుంది. రాబడికి మించి ఖర్చుల వల్ల రుణయత్నాలు, చేబదుళ్ల స్వీకరిస్తారు. 
 
వృశ్చికం : స్త్రీలకు అర్జన పట్ల ఆసక్తి నెలకొంటుంది. విదేశాలు వెళ్లడానికి చేయు యత్నాలు ఫలిస్తాయి. గృహంలో వస్తువు పోవడానికి ఆస్కారం ఉంది. సంఘంలో మంచి గుర్తింపు, రాణింపు లభిస్తుంది. విద్యార్థులు వాహనం నపుడునపుడు మెళకువ అవసరం. దంపతుల మధ్య అభిప్రాయభేదాలు తలెత్తుతాయి. 
 
ధనస్సు : విద్యార్థినులు ప్రేమ వ్యవహారాలకు దూరంగా ఉండటం శ్రేయస్కరం. ఫైనాన్సు, చిట్‌ఫండ్ వ్యాపారస్తులకు సంతృప్తికానరాగలదు. ప్రయాణాల లక్ష్యం నెరవేరుతుంది. కొబ్బరి, పండ్లు, పూల, హోటల్ తినుబండరాల వ్యాపారులకు పురోభివృద్ధి. కాంట్రాక్టర్లకు నిర్మాణ పనుల్లో చురుకుదనం కానవస్తుంది. 
 
మకరం : వస్త్ర, బంగారు, వెండి, లోహ వ్యాపారస్తులకు పనివారితో సమస్యలు తలెత్తుతాయి. రుణాలు తీరుస్తారు. అకాలభోజనం, శారీరక శ్రమ, మితిమీరిన ఆలోచనల వల్ల అనారోగ్యానికి గురవుతారు. కోర్టు వ్యవహారాలు, భూ వివాదాలు కొత్త మలుపు తిరుగుతాయి. బంధువులతో తెగిపోయిన సంబంధాలు బలపడతాయి. 
 
కుంభం: ఉపాధ్యాయులు సభ, సమావేశాలలో పాల్గొంటారు. స్త్రీలు ధనవ్యయం విషయంలో జాగ్రత్త వహించవలసి ఉంటుంది. ప్రింటింగ్ రంగాల వారు అక్షర దోషాలు తలెత్తకుండా జాగ్రత్త వహించాల్సి ఉంటుంది. కొంతమంది మీతో స్నేహం నటిస్తూనే మిమ్మలను తప్పుదారి పట్టించేందుకు యత్నిస్తారు. 
 
మీనం : స్త్రీలు అనాలోచితంగా మాటజారి ఇబ్బందులెదుర్కొంటారు. నిరుద్యోగులు వచ్చిన తాత్కాలిక అవకాశాలను సద్వినియోగం చేసుకోవడం మంచిది. నూతన పరిచయాలేర్పడతాయి. సిమెంట్, కలప, ఐరన్, ఇటుక వ్యాపారులకు సామాన్యం. ఊహించని ఖర్చులెదురైనా ఆర్థిక ఇబ్బంది అంటూ ఏదీ ఉండదు.