13-02-2020 గురువారం మీ రాశిఫలాలు - దత్తాత్రేయుడిని ఆరాధించినా...

astro 11
రామన్|
మేషం : ఊహించని వ్యక్నుంచి అందిన సమాచారం మీకు బాగా ఉపకరిస్తుంది. చేసే పనిలో ఏకాగ్రత పట్టుదల ఎంతో ముఖ్యమని గమనించండి. వ్యాపార, ఆర్థికాభివృద్ధికి చేయు కృషిలో ఆశాజనకమైన మార్పులు ఉంటాయి. పెరిగే ఖర్చులు, అవసరాలు మీ రాబడికి మించడంతో ఆందోళన, నిరుత్సాహం చెందుతారు.

వృషభం : వ్యాపారాలలో ఒడిదుడుకులు సమర్థంగా ఎదుర్కొంటారు. విద్యార్థులు ప్రేమ వ్యవహారాలకు దూరండా ఉండి లక్ష్య సాధనకు మరింత కృషి చేయవలసి ఉంటుంది. ఖర్చులు అధికమవుతాయి. గృహం ఏర్పరచుకోవాలనే కోరిక నెరవేరుతుంది. బంగారు, వాహనం ఇత్యాది విలువైన వస్తువులు అమర్చుకుంటారు.

మిథునం : మీ ఉన్నతిని చాటుకోవాలనే తాపత్రియంతో ధనం విచ్చలవిడిగా వ్యయం చేస్తారు. సంతానం మొండివైఖరి వల్ల చికాకులు తప్పవు. సాంఘిక, శుభ కార్యాలలో మీరు మంచి గుర్తింపు పొందుతారు. తోటివారి సహకారంతో మీరు పరీక్షల్లో సామాన్య ఫలితాలు సాధిస్తారు. గృహంలో మార్పులు వాయిదాపడతాయి.

కర్కాటకం : స్థిరాస్తి క్రయ విక్రయాలకు సంబంధించిన వ్యవహారాలలో మెళకువ అవసరం. స్త్రీలకు అధిక శ్రమ, ఒత్తిడి వల్ల ఆరోగ్యం మందగిస్తుంది. విదేశీయానం కోసం చేసే యత్నాలు అనుకూలిస్తాయి. వృత్తి ఉద్యోగాల్లో శ్రమాధిక్యత చికాకులు తప్పవు. మీ అలవాట్లు, బలహీనతలు అదుపులో ఉంచుకోవడం మంచిది.

సింహం : ఆకస్మిక ఖర్చులు వల్ల ఒకింత ఒడిదుడుకులు తప్పవు. మిత్రుల ద్వారా అందిన ఒక సమాచారంతో మీలో కొత్త ఆలోచనలు చోటుచేసుకుంటాయి. విద్యార్థులకు ఒత్తిడి పెరుగుతుంది. గతానుభవాలు జ్ఞప్తికి రాగలవు. మీ సంతానం ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహిస్తారు. ఆకస్మిక ప్రయాణాలు ఇబ్బంది కలిగిస్తాయి.

: దైవ, పుణ్య కార్యాల పట్ల ఆసక్తి పెరుగుతుంది. కాంట్రాక్టర్లు పనివారివల్ల సమస్యలకు, ఇబ్బందికి లోనవుతారు. రావలసిన ధనం వసూలులో శ్రమాధిక్యత, ప్రయాసలెదుర్కొంటారు. ప్రేమికులతో తొందరపాటుతనం సమస్యలు దారితీస్తుంది. చేతివృత్తుల వారికి శ్రమాధిక్యత, ఒత్తిడి అధికమవుతాయి. బ్యాంకు పనులు అనుకూలం.

తుల : పోస్టల్, ఎల్.ఐ.సి ఏజెంట్లకు శ్రమ, తిప్పట అధికం. మీ అభిప్రాయాలకు వ్యక్తీకరణకు సందర్భం కలిసివస్తుంది. స్థిరాస్తి అమ్మకం విషయంలో పునరాలోచన అవసరం. స్త్రీలు వాగ్వివాదాలకు దూరంగా ఉండటం మంచిది. బంధువుల మధ్య అనురాగ వాత్సల్యాలు పెంపొందుతాయి. కోర్టు వ్యవహారాలు వాయిదాపడతాయి.

వృశ్చికం : విద్యార్థులకు ప్రేమ వ్యవహారాల్లో భంగపాటు తప్పదు. ఆకస్మిక ప్రయాణాలు అనుకూలిస్తాయి. వాయిదాపడిన పనులు ఎట్టకేలకు పూర్తిచేస్తారు. లిటిగేషన్ వ్యవహారాల్లో సముచిత నిర్ణయాలు తీసుకుంటారు. వ్యాపారులకు షాపుల మార్పిడి అనుకూలం. బంధువు రాకతో ధనం అధికంగా వ్యయం చేస్తారు.

ధనస్సు : పత్రికా సిబ్బందికి ఏకాగ్రత ప్రధానం. దంపతుల మధ్య బంధువుల ప్రస్తావన వస్తుంది. విద్యార్థుల్లో ఏకాగ్రత, మనోధైర్యం నెలకొంటాయి. ఉపాధ్యాయులకు విద్యార్థుల వల్ల సమస్యలు తలెత్తే ఆస్కారం ఉంది జాగ్రత్త వహించండి. వృత్తి ఉపాధి పథకాల్లో స్థిరపడతారు. మీపై శకునాలు, ఇతరుల వ్యాఖ్యలు ప్రభావం అధికం.

మకరం : కాంట్రాక్టర్లకు అధికారులతో సమస్యలు రావలసిన ధనం వాయిదాపడుతుంది. సతీసమేతంగా ఒక పుణ్యక్షేత్రాన్ని సందర్శిస్తారు. ఐరన్, సిమెంట్, స్టాకిస్టులకు పురోభివృద్ధి. ఉద్యోగస్తులకు ఎప్పటి నుంచో వాయిదాపడుతున్న పనులు అనుకోకుండా పూర్తిచేస్తారు. కోర్టు వ్యవహారాల్లో ప్లీడర్ల ధోరణి ఆందోళన కలిగిస్తుంది.

కుంభం : ఉద్యోగస్తులకు పై అధికారుల నుంచి ఒత్తిడి, చికాకులు ఎదుర్కొంటారు. సోదరీసోదరుల మధ్య పరస్పర అవగాన కుదరదు. కిరాణా, ఫ్యాన్సీ, నిత్యావసర వస్తు వ్యాపారులకు కలిసిరాగలదు. స్త్రీల తొందరపాటుతనానికి ఊహించని చికాకులు తలెత్తవచ్చు. స్టేషనరీ, ప్రింటింగ్ రంగాల్లో వారికి సమస్యలు తలెత్తుతాయి.

మీనం : ఉపాధ్యాయులకు గుర్తింపు, రాణింపు లభిస్తుంది. దైవ కార్యక్రమాలలో చురుకుగా పాల్గొంటారు. ఏ విషయంలోనూ మొహమ్మాటాలకు పోకుండా మీ నిర్ణయం ఖచ్చితంగా తెలియజేయటం శ్రేయస్కరం. చేపట్టిన పనులలో స్వల్ప ఒడిదుడుకులు ఎదురైనా పట్టుదలతో శ్రమించి విజయవంతంగా పూర్తిచేస్తారు.దీనిపై మరింత చదవండి :