మంగళవారం, 23 జులై 2024
  1. ఆధ్యాత్మికం
  2. భవిష్యవాణి
  3. పంచాంగం
Written By రామన్
Last Updated : బుధవారం, 12 ఫిబ్రవరి 2020 (11:06 IST)

12-02-2020 బుధవారం రాశిఫలాలు - గాయత్రీ మాతను ఆరాధించినా... (video)

మేషం : దైవ, పుణ్యకార్యాల్లో ప్రముఖంగా వ్యవహరిస్తారు. దూర ప్రయాణాలలో నూతన పరిచయాలు ఏర్పడతాయి. ధనం ఏమాత్రం పొదువు సాధ్యంకాదు. మీ బంధువులను సహాయం అర్థించే బదులు మీరే ప్రత్యామ్నాయం చూసుకోవడం ఉత్తమం. కళలు, రాజకీయ, ప్రజాసంబంధాల రంగాల వారికి ఒత్తిడి పెరుగుతుంది. 
 
వృషభం : రియల్ ఎస్టేట్ రంగాల వారికి నూతన వెంచర్ల విషయంలో పునరాలోచన అవసరం. మీ మాట నెగ్గకపోయినా మీ గౌరవానికి భంగం కలగదు. పెద్దమొత్తం నగదుతో ప్రయాణాలు మంచిదికాదు. ఫ్లీడర్లకు తమ క్లయింట్ల తీరు ఇబ్బందులకు గురిచేస్తుంది. మీ కుటుంబానికి మీరు అవసరం కనుక వ్యసనాలకు దూరంగా ఉండండి. 
 
మిథునం : వస్త్ర వ్యాపారులు పనివారలను ఓ కంట కనిపెట్టుకుని ఉండటం శ్రేయస్కరం. హోటల్, కేటరింగ్ రంగాల్లోవారు పనివారలతో ఇబ్బందులు ఎదుర్కొంటారు. ప్రింటింగ్ రంగాల వారికి బకాయిల వసూళ్లలో శ్రమాధిక్యత, ప్రయాసలు తప్పవు. ఉపాధ్యాయ రంగాలలో వారికి అభిప్రాయభేదాలు తలెత్తవచ్చు. జాగ్రత్త వహించండి. 
 
కర్కాటకం : జాయింట్ వ్యాపారాల నుంచి విడిపోవాలనే ఆలోచన స్ఫురిస్తుంది. గృహ నిర్మాణాలు, మరమ్మతులు, మార్పులు చేర్పులకు అనుకూలం. ఉపాధ్యాయులకు పనిభారం తప్పదు. కోర్టులో దావా వేసే విషయంలో పునరాలోచన మంచిది. మీ సోదరీ, సోదరులతో సంబంధ బాంధవ్యాలు బాగుగా ఉంటాయి. 
 
సింహం : హోదాలో ఉన్న అధికారులకు ఆకస్మిక స్థానచలనం తప్పదు. క్రీడ, కళ, సాంస్కృతి రంగాలపట్ల ఆశక్తి వహిస్తారు. రాబడికి మంచి ఖర్చులుంటాయి. దీర్ఘాకాలికంగా వాయిదా పడుతూ వస్తున్న పనులు పూర్తవుతాయి. విద్యుత్ రంగాల్లో వారికి పనిభారం అధికమవుతుంది. స్త్రీలు అదనపు ఆదాయ మార్గాల కోసం అన్వేషిస్తారు.
 
కన్య : ఉమ్మడి వ్యాపారాలు, జాయింట్ వెంచర్ల సంతృప్తికరంగా సాగుతాయి. స్త్రీలకు పనివారలతో ఒత్తిడి, చికాకులు ఎదుర్కొంటారు. మీ లోటుపాట్లు, తప్పిదాలను సరిదిద్దుకోవడానికి యత్నించండి. ప్రముఖులను కలుసుకుంటారు. ఉద్యోగస్తులకు పై అధికారుల నుంచి గుర్తింపు ఆర్థిక లావాదేవీలు సమర్థంగా నిర్వహిస్తారు. 
 
తుల : కొబ్బరి, పండ్లు, పూల వ్యాపారులకు లాభదాయకంగా ఉంటుంది. స్త్రీలకు అలంకారాలు, విలాస వస్తువుల పట్ల మక్కువ పెరుగుతుంది. ఏ విషయంలోనూ హామీ ఇవ్వకుండా లౌక్యంగా దాటవేయండి. ఎంతో కొంత పొదుపు చేయాలన్న మీ యత్నం నెరవేరదు. ఉత్తర ప్రత్యుత్తరాలు, సంప్రదింపులు సత్ఫలితాలిస్తాయి. 
 
వృశ్చికం : స్టేషనరీ, ప్రింటింగ్ రంగాల వారికి పనిభారం, అధికంగా ఉన్నా రాబడికి విషయంలో సంతృప్తి పురోభివృద్ధి పొందుతారు. గృహానికి కావలసిన వస్తువులను కొనుగోలుచేస్తారు. ఉపాధ్యాయలకు విద్యార్థుల వల్ల సమస్యలు తలెత్తే ఆస్కారం ఉంది. జాగ్రత్త వహించండి. బ్యాంకు వ్యవహారాలు మందకొడిగా సాగుతాయి. 
 
ధనస్సు : బ్యాంకింగ్ వ్యవహారాలలో మెలకువ వహించండి. ఉద్యోగరీత్యా ఆకస్మికంగా ప్రయాణాలు చేస్తారు. ముఖ్యమైన విషయాలు గోప్యంగా ఉంచండి. పాత మిత్రుల కలయికతో గతానుభవాలు జ్ఞప్తికి రాగలవు. స్త్రీలకు లక్ష్య సాధనకు ముఖ్యుల సహాయ సహకారాలు లభిస్తాయి. ఒంటెత్తు పోకడ మంచిదికాదని గమనించండి. 
 
మకరం : ఆర్థిక లావాదేవీలు సమర్థంగా నిర్వహిస్తారు. వస్త్ర, వెండి, బంగారు, లోహ వ్యాపారస్తులకు పనివారితో సమస్యలు తలెత్తుతాయి. కాంట్రాక్టర్లు, బిల్డర్లకు నిర్మాణ పనులలో ఒత్తిడి, చికాకులు తప్పవు. స్త్రీలు వాగ్వివాదాలకు దూరంగా ఉండటం మంచిది. ఉపాధ్యాయులకు పై అధికారులతో సంభాషించునపుడు మెళకువ అవసరం. 
 
కుంభం : ప్రైవేటు సంస్థలలోని వారు, రిప్రజెంటేటివ్‌లు మార్పులకై చేయు యత్నాలు ఫలిస్తాయి. గృహోపకరణాలు కొనుగోలు చేస్తారు. గృహంలో నెలకొన్న అశాంతి తొలగిపోయి ప్రశాంతత నెలకొంటుంది. మీ అతిథి మర్యాదలు అందరినీ ఆకట్టుకుంటాయ మీ శ్రీమతి సలహా పాటించడం చిన్నతనంగా భావించకండి. 
 
మీనం : వ్యాపారాభివృద్ధికి మరింతగా శ్రమించవలసి ఉంటుంది. నిరుద్యోగులు ఉపాధి పథకాల పట్ల ఆసక్తి కనపరుస్తారు. కోర్టు వ్యవహారాలు వాయిదాపడుట మంచిది. స్త్రీలకు స్వీయ అర్జన, సేవా కార్యక్రమాల పట్ల ఆసక్తి పెరుగుతుంది.. సోదరీ, సోదరుల మధ్య కలహాలు తొలగిపోయి ఒక అవగాహనకు వస్తారు.