మంగళవారం, 24 డిశెంబరు 2024
  1. ఆధ్యాత్మికం
  2. భవిష్యవాణి
  3. పంచాంగం
Written By రామన్

18-02-2020 మంగళవారం దినఫలాలు- ఆంజనేయస్వామిని ఆరాధించినా...

మేషం : రావలసిన బాకీలు అతికష్టంమ్మీద వసూలవుతాయి. ఖర్చులు అధికమవుతాయి. స్త్రీలకు పరిచయాలు, వ్యాపకాలు అధికం కావడంతో ఇబ్బందులెదుర్కొంటారు. గృహ నిర్మాణాల్లో పెరిగిన వ్యయం ఆందోళన కలిగిస్తుంది. ఎవరికీ హామీలు ఉండటం మంచిదికాదు. షామియాన, సప్లయ్ రంగాలలో వారికి గణనీయమైన పురోభివృద్ధి. 
 
వృషభం : బంధువుల రాకతో గృహంలో సందడి కానవస్తుంది. ముఖ్యుల మధ్య ఆకస్మిక అభిప్రాయభేదాలు తలెత్తుతాయి. విద్యార్థుల మొండివైఖరి ఉపాధ్యాయులకు చికాకు కలిగిస్తుంది. దూర ప్రయాణాలలో నూతన పరిచయాలేర్పడతాయి. ఒక పుణ్యక్షేత్రం సందర్శిస్తారు. నిరుద్యోగులకు ఇంటర్వ్యూలలో మెళకువ అవసరం. 
 
మిథునం : ఆర్థిక ఒడిదుడుకులు ఎదుర్కొన్న నెమ్మదిగా సమసిపోతాయి. నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు లభించనప్పటికీ వాటిని సద్వినియోగం చేసుకోలేకపోతారు. పలుకుబడి కలిగిన వ్యక్తులతో పరిచయాలు ఏర్పడతాయి. మీ మౌనం వారికి గుణపాఠం అవుతుంది. మీరు చేపట్టిన పనిలో కొన్ని ఆటంకాలను ఎదుర్కొంటారు. 
 
కర్కాటకం : స్టేషనరీ, ప్రింటింగ్ రంగాల వారికి సదావకాశాలు లభిస్తాయి. కొత్త ఆదాయ మార్గాల అన్వేషణ ఫలిస్తుంది. ప్రియతముల రాక ఎంతో సంతోషాన్ని ఇవ్వగలదు. ఉద్యోస్తులకు పైఅధికారులతో ఒత్తిడి, చికాకులను ఎదుర్కొంటారు. హోటల్, కేటరింగ్ రంగాల్లో వారు పనివారితో ఇబ్బందులను ఎదుర్కొంటారు. 
 
సింహం : ఫ్లీడర్లకు ఒత్తిడి, అకౌంట్స్ రంగాల వారికి పనిభారం, చికాకులు అధికమవుతాయి. విద్యార్థులు విద్యా విషయాల పట్ల శ్రద్ధ వహించిన సత్ఫలితాలు పొందగలరు. స్త్రీలతో కలహములు, అన్ని కార్యములయందు విఘ్నములు ఎదుర్కొంటారు. నిరుద్యోగులకు ఒక ప్రకటన పట్ల ఆకర్షితులవుతారు. స్థిరాస్తిని అమర్చుకుంటారు. 
 
కన్య : నిర్మాణ పనులు, మరమ్మతులలో ఏకాగ్రత వహించండి. రావలసిన ధనం సకాలంలో అందుట వల్ల పొదుపు దశిగా ఒత్తిడి, చికాకులు మీ ఆలోచనలు ఉంటాయి. స్త్రీలు ఆదాయంపై ధన సంపాదనపై మరింత దృష్టిపెడతారు. ఉపాధ్యాయులకు ఒత్తిడి, చికాకులు అధికమవుతాయి. ప్రేమికుల మధ్య అనురాగ వాత్సల్యాలు పెంపొందుతాయి. 
 
తుల : విద్యార్థులకు ధ్యేయం పట్ల అవగాహన, పట్టుదల నెలకొంటాయి. దూరదేశాల వారి నుంచి ఆసక్తికరమైన వార్తలు వింటారు. ప్రతి విషయంలో మౌన వహించడం మంచిదని గమనించండి. మీ బాధ్యతలు ఇతరులకు అప్పగించడం మంచిది కాదు. పెద్దల జోక్యంతో ఆస్తి పంపకాల వ్యవహారం పరిష్కారమవుతుంది. 
 
వృశ్చికం : ఇసుక, క్వారీ, కాంట్రాక్టర్లకు అధికారులతో కొత్త సమస్యలెదురవుతాయి. రాబోయే ఖర్చులకు ఆదాయాన్ని సమకూర్చుకుంటారు. ఉద్యోగస్తుల దైనందిన కార్యకలాపాలు ప్రశాంతంగా సాగుతాయి. పాత బిల్లులు చెల్లిస్తారు. ఏ సమస్యైనా నిబ్బరంగా ఎదుర్కొంటారు. వాహనం ఇతరులకిచ్చి ఇబ్బందులెదుర్కొంటారు. 
 
ధనస్సు : ఉద్యోగస్తులకు స్వస్థలానికి బదిలీ, హోదా పెరిగే సూచనలున్నాయి. కష్టసమయంలో ఆత్మీయులు తోడుగా నిలుస్తారు. ఉద్యోగస్తులకు అధికారుల నుంచి ఒత్తిడి, చికాకులు అధికం. ప్రైవేట్ చిట్‌దారులు చిక్కుల్లో పడే ఆస్కారం ఉంది. మీ శ్రీమతి వైఖరి నిరుత్సాహం కలిగిస్తుంది. వ్యాపారాల్లో ఆశించిన పురోభివృద్ధి సాధిస్తారు. 
 
మకరం : వృత్తుల వారికి శ్రమకు తగిన అవకాశాలు, ఆదాయం లభిస్తుంది. ఖర్చులు మీ అంచనాలను మించడంతో రుణాలు, చేబదుళ్లు తప్పవు. గత అనుభవాలు జ్ఞప్తికి రాగలవు. వాహనం, విలువైన వస్తువులపట్ల జాగ్రత్త వహించండి. మీ అభిప్రాయాలను వ్యక్తం చేయక ఎదుటివారి ఆంతర్యం గ్రహించేందుకు యత్నించండి. 
 
కుంభం : రాజకీయ నాయకులకు పదవుల యందు అనేక మార్పులు ఏర్పడతాయి. కోర్టు వ్యవహారాల్లో ఫ్లీడర్లు, ఫ్లీడర్ల గుమస్తాలకు చికాకులు తప్పవు. స్త్రీలకు విదేశీ వస్తువుల పట్ల ఆసక్తి పెరుగుతుంది. నిరుద్యోగులు నిరుత్సాహం విడనాడి శ్రమించిన సత్ఫలితాలు లభిస్తాయి. అధికారులతో సంభాషించేటపుడు మెళకువ అవసరం. 
 
మీనం : బ్యాంకుల లావాదేవీలయందు అనుకూలతలు ఉంటాయి. పత్రికా సంస్థలయందు పనిచేయువారికి సంతృప్తికరంగా ఉంటుంది. సాంఘిక కార్యక్రమాలలో పాల్గొంటారు. మీ సంతానం కోసం ధనం అధికంగా ఖర్చు చేస్తారు. ప్రభుత్వ ఉద్యోగులకు కలిసివస్తుంది. ఖాదీ, పాడి పరిశ్రమ రంగంలోనివారికి మందకొడిగా ఉండగలదు.