శుక్రవారం, 24 జనవరి 2025
  1. ఆధ్యాత్మికం
  2. భవిష్యవాణి
  3. పంచాంగం
Written By రామన్
Last Updated : బుధవారం, 19 ఫిబ్రవరి 2020 (10:16 IST)

19-02-2020 బుధవారం దినఫలాలు - లక్ష్మీనృరసింహాస్వామిని ఆరాధించినా...(video)

మేషం : మీ శ్రీమతి ఆరోగ్యంలో ఇబ్బందులు ఎదుర్కోవలసి వస్తుంది. కొబ్బరి, పండ్లు, పానీయ వ్యాపారులకు శుభదాయకం. గృహంలో వస్తువు పోవడానికి అవకాశం ఉంది. జాగ్రత్త వహించండి. పత్రిక, ప్రైవేటు సంస్థలలోని వారికి యాజమాన్యం తీరు ఆందోళన కలిగిస్తుంది. ఆర్థిక విషయాలలో చురుకుదనం కానవచ్చును. 
 
వృషభం : ఆకస్మిక ప్రయాణాలలో ఇబ్బందులను ఎదుర్కొంటారు. బ్యాంకు వ్యవహారాలలో అపరిచిత వ్యక్తుల పట్ల మెళకువ అవసరం. పెద్దల ఆరోగ్యంలో మెళకువ అవసరం. కుటుంబ సభ్యుల నుంచి విమర్శలను ఎదుర్కొంటారు. విద్యార్థులకు అభివృద్ధి కానవస్తుంది. బంధు మిత్రుల రాకతో గృహంలో సందడికానవస్తుంది. 
 
మిథునం : ఉద్యోగస్తులు అధికారుల తీరును గమనించి మెలగలవలసి ఉంటుంది. పెద్దలతో ఆస్తి వ్యవహారాలలో సంప్రదింపులు జరుపుతారు. స్త్రీలకు అర్జనపట్ల ఆసక్తి పెరుగుతుంది. దంపతుల మధ్య పలు ఆలోచనలు చోటుచేసుకుంటాయి. ఏజెంట్లు, బ్రోకర్లు ఒత్తిడి, చికాకులు వంటివి ఎదుర్కొంటారు. 
 
కర్కాటకం : దంపతుల మధ్య అభిప్రాయభేదాలు, కలహాలు చోటుచేసుకుంటాయి. వాణిజ్య ఒప్పందాలు, రిజిస్ట్రేషన్ వ్యవహారాల్లో మెలకువ వహించండి. ఇతరుల సలహాను పాటించుట వల్ల సమస్యలు తప్పవు. స్టేషనరీ, ప్రింటింగ్, రంగాల వారికి ఒత్తిడి పెరుగుతుంది. వాహనం ఇతరులకు ఇచ్చి ఇబ్బందులను ఎదుర్కొంటారు. 
 
సింహం : స్త్రీలకు తల, కాళ్లు నరాలకు సంబంధించిన చికాకులు అధికంగా ఉంటాయి. కాంట్రాక్టర్లకు రావలసిన బిల్లులు మంజూరు కావడంతో నిలిచిపోయిన పనులు పునఃప్రారంభమవుతాయి. కోర్టు వ్యవహారాలు వాయిదాపడటంతో ఒకింత నిరుత్సాహం చెందుతారు. ఉపాధ్యాయులకు విద్యార్థుల నుంచి చికాకులు ఎదుర్కొంటారు. 
 
కన్య : పాత సమస్యలు పరిష్కారంలో నడుస్తాయి. విద్యార్థులకు ధ్యేయం పట్ల ఆసక్తి పెరుగుతుంది. రాజకీయ నాయకులకు సభా, సమావేశాలలో చురుకుగా పాల్గొంటారు. వృత్తిపరంగా ఎదురైనా సమస్యలు క్రమేణా తొలగిపోగలవు. స్త్రీలకు సంభాషించుపనడు మెళకువ అవసరం. రవాణా రంగాల వారికి చికాకులు తప్పవు. 
 
తుల : అకాల భోజనం, మితిమీరిన శ్రమ వల్ల అస్వస్థతకు గురవుతారు. దూర ప్రయాణాలలో నూతన పరిచయాలు ఏర్పడతాయి. ఒక విషయంలో సోదరులతో విభేదిస్తారు. ఉద్యోగస్తులు అందరితో సఖ్యతో మెలుగుతూ తమ పనులు సునాయాసంగా పూర్తి చేసుకోగల్గుతారు. నూతన పెట్టుబడులు పెట్టునపుడు పునరాలోచన అవసరం. 
 
వృశ్చికం : హోటల్, కేటరింగ్, తినుబండరాల వ్యాపారస్తులకు లాభదాయకం. చివరి క్షణంలో చేతిలో ధనం అందక ఇబ్బందులు ఎదుర్కొంటారు. దైవ, సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు. ప్రియతముల రాక సమాచారం మీకు ఎంతో ఆనందాన్నిస్తుంది. పత్రికా సంస్థలలోని వారికి ఎంత శ్రమించినా ఏమాత్రం గుర్తింపువుండదు. 
 
ధనస్సు : ఉద్యోగస్తులు అధికారులకు మధ్య సత్సంబంధాలు నెలకొంటాయి. ద్విచక్రవాహనంపై దూర ప్రయాణం మంచిది కాదని గమనించండి. రాజకీయ నాయకులు సభలు, సమావేశాలలో హుందాగా వ్యవహరించి అందరినీ ఆకట్టుకుంటారు. కాంట్రాక్టర్లు, క్యాటరింగ్ పనివారలకు పనిభారం అధికమవుతుంది. 
 
మకరం : ఉద్యోగస్తులకు పై అధికారుల నుంచి ఒత్తిడి, చికాకులు అధికమవుతాయి. వాహనం ఇతరులకు ఇచ్చి ఇబ్బందులను ఎదుర్కొంటారు. మీ నిర్లక్ష్యం వల్ల విలువైన వస్తువులు చేజారిపోతాయి. స్త్రీలకు విలువైన వస్తువుల కొనుగోళ్ళలో ఏకాగ్రత వహించండి. మీ సంతానం కోసం ధనం అధికంగా ఖర్చు చేస్తారు. 
 
కుంభం : చిన్న సమస్యే అయినా తేలికగా తీసుకోవడం మంచిదికాదు. స్థిరాస్తి అమ్మకంపై ఆలోచనలు ముఖ్యులను రాకపోకలు అధికం అవుతాయి. వ్యాపారస్తులకు, స్టాకిస్టులకు ఒత్తిడి పెరుగుతుంది. పెద్దల ఆరోగ్య, ఆహార వ్యవహారాల్లో మెళకువ వహించండి. రుణ, విముక్తులు కావడంతో పాటు కొత్త రుణాలు పొందుతారు. 
 
మీనం : విద్యార్థినులకు ధ్యేయం పట్ల ఏకాగ్రత, కొత్త విషయాల పట్ల ఆసక్తి నెలకొంటుంది. వ్యాపారాల్లో కొత్త కొత్త పథకాల్లో కొనుగోలుదార్లను ఆకట్టుకుంటారు. ఆకస్మికంగా తీసుకున్న నిర్ణయానికి ఇంటా బయటా వ్యతిరేకత ఎదురవుతుంది. ప్రైవేట్, ఫైనాన్స్ చిట్స్ వ్యాపారులకు ఖాతాదారులతో చికాకులెదుర్కోవలసి వస్తుంది.