మంగళవారం, 24 డిశెంబరు 2024
  1. ఆధ్యాత్మికం
  2. భవిష్యవాణి
  3. దినఫలం
Written By రామన్

బుధవారం (27-11-2019) మీ రాశిఫలాలు.. మీ శ్రీమతికి మీరంటే?

మేషం : స్త్రీలలో సంపాదన పట్ల ఆసక్తి మరింత బలపడుతుంది. మీ పాత సమస్యలు పరిష్కారమవుతాయి. బ్యాంకుల్లో మీ పనుల్లో స్వల్ప ఆటంకాలు ఎదుర్కోవలసి వస్తుంది. టెక్నికల్, ఎలక్ట్రానిక్, కంప్యూటర్ రంగాల్లో వారికి ఒత్తిడి తప్పదు. గణిత, సైన్సు, కామర్స్ రంగాల వారికి గుర్తింపు, సదావకాశాలు లభిస్తాయి. 
 
వృషభం : ఆర్థిక లాభాలు పెరుగుతాయి. కొత్త మార్పులకు అనుకూలిస్తాయి. మీ ఆత్మస్థైర్యం పనితీరు బాగా పెరుగుతాయి. అత్యవసర పనులను త్వరగా పూర్తి చేసుకోండి. ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాల పట్ల ధ్యాస వహిస్తారు. నిరుద్యోగులకు సదావకాశాలు లభిస్తాయి. బంధు మిత్రులకు శుభాకాంక్షలు అందజేస్తారు. 
 
మిథునం : విద్యార్థులలో మానసిక ప్రశాంతత చోటుచేసుకుంటుంది. ఆలయాలను సందర్శిస్తారు. మీ ఉత్సాహాన్ని అదుపులో ఉంచుకోవడం శ్రేయస్కరం. రావలసిన ధనం సకాలంలో అందుకుంటారు. వైద్యులు ఆపరేషన్లను విజయవంతంగా పూర్తిచేస్తారు. సన్నిహితుల సలహాలు, హితోక్తులు మీపై మంచి ప్రభావం చూపుతాయి. 
 
కర్కాటకం : ఆర్థికంగా ప్రగతి సాధిస్తారు. కుటుంబంలో ఉల్లాసం, సంతోషం కానవస్తుంది. మిత్రులతో కలిసి విందు వినోదాలలో పాల్గొంటారు. ఉద్యోగ, వ్యాపారులకు అధికారుల నుండి ఒత్తిడి, చికాకులు వంటివి ఎదుర్కొంటారు. విద్యార్థినుల నిర్లక్ష్యం, ఏకాగ్రత లోపం వల్ల ఒత్తిడి, మందలింపులు అధికమవుతాయి. 
 
సింహం : ఉద్యోగస్తులు సభలు, సమావేశాల్లో పాల్గొంటారు. కొత్త సమస్యలు తలెత్తే ఆస్కారం ఉంది. మెలకువ వహించండి. మనసులో భయాందోళనలూ, అనుమానాలున్నా డాంబికం ప్రదర్శించి పనులు సాఫీగా పూర్తిచేస్తారు. స్త్రీలకు పనిభారం అధికం. అవగాహన లేని వ్యాపారాలు, వ్యవహారాలకు దూరంగా ఉండటం మంచిది. 
 
కన్య : వృత్తి వ్యాపారాల్లో పోటీతత్వం మిమ్మలను ఆందోళనకు గురిచేస్తుంది. ప్రయాణాల లక్ష్యం నెరవేరుతుంది. డబ్బు చేతికందకపోవడంతో కొన్ని పనులు ఆలస్యంగా పూర్తిచేస్తారు. ఉద్యోగస్తులు కొత్త బాధ్యతలు చేపడతారు. పాత మిత్రులను కలుసుకుంటారు. కడుపునొప్పిలాంటి సమస్యలకు వెంటనే వైద్యం చేయించుకోండి. 
 
తుల : స్టేషనరీ, ప్రింటింగ్ రంగాల వారికి సంతృప్తి, పురోభివృద్ది కానవస్తుంది. ఆడిట్, అకౌంట్స్ రంగాల వారికి ఒత్తిడి, పనిభారం అధికంగా ఉంటాయి. మీ సంతానం విద్యా, వివాహ విషయాల పట్ల శ్రద్ధ కనపరుస్తారు. ఖర్చులు రాబడికి తగినట్టుగానే ఉంటాయి. రాజకీయ నాయకులు విందు వినోదాల్లో పాల్గొంటారు. 
 
వృశ్చికం : తలపెట్టిన పనులు నిర్విఘ్నంగా పూర్తిచేస్తారు. రుణ విముక్తులు కావడంతో పాటు కొత్త రుణాలు అనుకూలిస్తాయి. ప్రత్యర్థులు సైతం మీ ఔన్నత్యాన్ని గుర్తిస్తారు. విదేశీ వ్యవహారాలు అనుకూలిస్తాయ. సోదరీ, సోదరులతో ఏకీభవించలేకపోతారు. అనుకున్న పనులు ఆశించినంత చురుకుగా సాగవు. 
 
ధనస్సు : ఆర్థికస్థితి కొంత మెరుగుపడుతుంది. ప్రముఖుల కలయిక వల్ల మీ సమస్యలు పరిష్కార మార్గంలో నడుస్తాయి. మీ వ్యక్తిగత భావాలకు మంచి స్ఫురణ లభిస్తుంది. దూర ప్రయాణాలలో జాగ్రత్త అవసరం. బంధువులు రాకపోకలు అధికమవుతాయి. విద్యార్థులకు పురోభివృద్ధి. ఉపాధ్యాయులకు ఒత్తిడి, చికాకులు తప్పవు. 
 
మకరం : మీ జీవిత భాగస్వామి వైఖరి చికాకు కలిగిస్తుంది. ప్రతి విషయంలోనూ ఆచితూచి వ్యవహరించాల్సి ఉంటుంది. ఉద్యోగస్తులకు తోటివారి సహాయం లభించదు. స్త్రీలకు ఆరోగ్యపరమైన సమస్యలు తలెత్తుతాయి. ప్రణాళికాబద్ధంగా వ్యవహరించి కొన్ని లక్ష్యాలు సాధిస్తారు. ప్రియతముల రాక సంతోషం కలిగిస్తుంది. 
 
కుంభం : కాంట్రాక్టర్లకు ప్రముఖుల సహకారంతో పెద్ద పెద్ద కాంట్రాక్టులు చేజిక్కించుకుంటారు. బంధువులు కలుసుకుంటారు. కోర్టు వ్యవహారాలు మీరు కోరుకున్నట్టుగానే వాయిదా పడతాయి. నిరుద్యోగ యత్నాలు కలిసిరాగలవు. ఆధ్యాత్మిక విషయాల పట్ల ఆసక్తి కలుగుతుంది. మీ శ్రీమతి సలహా పాటించడం చిన్నతనంగా భావించకండి. 
 
మీనం : వస్త్ర, బంగారం, వెండి, గృహోపకరణాల వ్యాపారులకు పనివారలతో చికాకులు తప్పవు. ఆలయాలను సందర్శిస్తారు. ఖర్చులు పెరగడంతో అదనపు రాబడికై యత్నిస్తారు. ప్రభుత్వ కార్యాలయాల్లో మీ పనుల సానుకూలతకు పలుమార్లు తిరగవలసి ఉంటుంది. మీ శ్రీమతికి మీరంటే ప్రత్యేకాభిమానం కలుగుతుంది.