శుక్రవారం, 24 జనవరి 2025
  1. ఆధ్యాత్మికం
  2. భవిష్యవాణి
  3. దినఫలం
Written By సెల్వి
Last Updated : సోమవారం, 25 నవంబరు 2019 (12:28 IST)

సోమవారం (25-11-2019) మీ రాశిఫలాలు

మేషం: ఆర్థిక పరిస్థితి సామాన్యంగా ఉంటుంది. కొంతమంది మీ ఆలోచనలను నీరు గార్చే ప్రయత్నం చేస్తారు. అవివాహితులకు శుభవార్త శ్రవణం. నూతన వ్యాపారాలు, పెట్టుబడుల దిశగా మీ ఆలోచనలు ఉంటాయి. ఆకస్మిక ప్రయాణాలు తప్పవు. కొన్ని అనుకోని సంఘటనలు మనస్తాపం కలిగిస్తాయి.
 
వృషభం: ఆదాయ వ్యయాల్లో మీ అంచనాలు తలకిందులవుతాయి. హామీలు, మధ్యవర్తిత్వాల విషయంలో పునరాలోచన మంచిది. మీ శ్రీమతి ప్రోత్సాహంతో ఒక శుభకార్యానికి యత్నాలు మొదలుపెడతారు. విద్యార్థులకు ఇంజనీరింగ్, మెడికల్ కోర్సులలో ప్రవేశం లభిస్తుంది. నిరుద్యోగులకు సదవకాశాలు లభిస్తాయి.
 
మిథునం: వస్త్ర, బంగారం, పచారీ, ఫ్యాన్సీ వ్యాపారులకు సంతృప్తి, పురోభివృద్ధి. ప్రైవేటు సంస్థలలోని వారికి ఓర్పు, అంకితభావం ముఖ్యం. ప్రయత్నపూర్వకంగా మొండి బాకీలు వసూలు కాగలవు. స్టాక్ మార్కెట్ రంగాల వారికి మిశ్రమ ఫలితం. ఉమ్మడి వ్యవహారాల్లో పట్టు సాధిస్తారు. బంధువులను కలుసుకుంటారు.
 
కర్కాటకం: మీ స్థమర్ధతపై ఎదుటి వారికి నమ్మకం కలుగుతుంది. ఇచ్చిపుచ్చుకునే వ్యవహారాలు, వాణిజ్య ఒప్పందాల్లో మెళకువ వహించండి. గృహంలో ఒక శుభకార్యానికి యత్నాలు సాగిస్తారు. వాహనం నడుపునపుడు ఏకాగ్రత అవసరం. సోదరీ, సోదరుల మధ్య అవగాహన కుదరదు. ఆలయాలను సందర్శిస్తారు.
 
సింహం: రవాణా, ఆటోమొబైల్, మెకానికల్, రంగాలలో వారికి సంతృప్తి కానరాగలదు. ప్రేమికులు అతిగా వ్యవహరించండం వల్ల చిక్కుల్లో పడే ఆస్కారం ఉంది. మిత్రుల తీరు నిరుత్సాహం కలిగిస్తుంది. క్రయ విక్రయాలు లాభసాటిగా సాగుతాయి. ప్రయాణాల లక్ష్యం నెరవేరుతుంది. అధికారులతో సంప్రదింపులు జరుపుతారు.
 
కన్య : రావలసిన బకాయిలు సకాలంలో అందుట వలన ఆర్థిక ఇబ్బంది అంటూ ఉండదు. ఆకస్మికంగా మీలో వేదాంత ధోరణి కనపడుతుంది. క్రయ విక్రయాలు లాభసాటిగా ఉంటాయి. స్త్రీలు టి.వి. ఛానెల్స్ కార్యక్రమాలలో రాణిస్తారు. ప్రైవేటు సంస్థలలోని వారికి ఓర్పు, నేర్పు అవసరం. వైద్యులకు పురోభివృద్ధి.
 
తుల : వృత్తుల వారు ఎంత శ్రమించినా ఆదాయం అంతంత మాత్రంగానే ఉంటుంది.  స్త్రీలకు స్వీయ ఆర్జన పట్ల ఆసక్తి, ప్రోత్సాహం లభిస్తాయి. నిరుద్యోగులు వచ్చిన తాత్కాలిక అవకాశాన్ని చేజిక్కుంచు కోవటం శ్రేయస్కరం. ఓర్పు, శ్రమాధిక్యతతో అనుకున్న కార్యాలు నెరవేరగలవు. ఆత్మీయుల రాకతో మానసికంగా కుదుటపడతారు.
 
వృశ్చికం: తొందరపాటు నిర్ణయాల వల్ల ఇబ్బందులను ఎదుర్కుంటారు. ఆర్థిక వ్యవహారాలు, నూతన పెట్టుబడులకు సంబంధించి స్పష్టమైన నిర్ణయానికి వస్తారు. పాత మిత్రుల కలయికతో గత విషయాలు జ్ఞప్తికి వస్తాయి. నూతన పెట్టుబడుల విషయంలో మెళకువ అవసరం. ఉద్యోగస్తులు ఒత్తిడి, ప్రలోభాలకు దూరంగా ఉండటం మంచిది.
 
ధనస్సు: ఆర్థిక లావాదేవీలు, కుటుంబ సమస్యలు చక్కగా పరిష్కరిస్తారు. శ్రీవారు, శ్రీమతి గౌరవ ప్రతిష్ఠలకు భంగం కలిగించే పరిణామాలు ఎదుర్కొంటారు. స్వయంకృషితో రాణిస్తారన్న విషయం గ్రహించండి. పాత వస్తువుల కొని ఇబ్బందులు తెచ్చుకోకండి. కొత్త పరిచయాల వల్ల కార్యక్రమాలు విస్తృతమవుతాయి.
 
మకరం: సొంతంగా వ్యాపారం, సంస్థలు నెలకొల్పాలనే మీ ఆలోచన బలపడుతుంది. ప్లీడర్లకు మంచి గుర్తింపు లభిస్తుంది. తలపెట్టిన పనులు ఏ మాత్రం ముందుకు సాగవు. స్త్రీలకు అలంకారాలు, గృహోపకరణాల పట్ల మక్కువ పెరుగుతుంది. బ్యాంకు వ్యవహారాల్లో ఒత్తిడి, చికాకులను ఎదుర్కుంటారు.
 
కుంభం: ఆర్థిక సమస్యలు, కుటుంబ వ్యవహారాలు, వ్యక్తిగత వ్యవహారాల విషయంలో స్పష్టమైన నిర్ణయానికి వస్తారు. ఐరన్ రంగం వారికి ఆటంకాలు. గృహ నిర్మాణల్లో స్వల్ప అడ్డంకులు, చికాకులు ఎదుర్కుంటారు. టెండర్లు చేజిక్కించుకుంటారు. నిరుద్యోగులకు పోటీ పరీక్షలలో అనుకూల ఫలితాలు సాధిస్తారు.
 
మీనం: స్థిరాస్తుల విషయంలో ఏకీభావం కుదరదు. ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్, మెకానికల్ రంగాల వారికి ఆశాజనకం. రాబడికి మించిన ఖర్చులు, పెరిగిన ధరలు నిరుత్సాహ పరుస్తాయి. ముఖ్యుల కోసం మీ పనులు వాయిదా వేసుకోవలసి వస్తుంది. గృహ నిర్మాణాలు, మరమ్మతులకు అనుకూలం.