సోమవారం, 25 నవంబరు 2024
  1. ఆధ్యాత్మికం
  2. భవిష్యవాణి
  3. దినఫలం
Written By రామన్

01-01-2023 శుక్రవారం దినఫలాలు - విష్ణుమూర్తిని ఆరాధించి అన్నదానం...

Astrology
చవితి ప.3.07 పునర్వసు సా.5.07 రా.వ.1.43 ల 3.30. ఉ. దు. 8. 29 ల 9.13 పు. దు. 12.10 ల 12.54.
 
విష్ణుమూర్తిని ఆరాధించి అన్నదానం చేసినా సర్వదా శుభం కలుగుతుంది.
 
మేషంv:- కుటుంబ విషయాలకు, ఆర్థికలావాదేవీలకు అధిక ప్రాధాన్యం ఇస్తారు. కీలకమైన వ్యవహరాల్లో తీసుకున్న నిర్ణయాలవల్ల కష్టనష్టాలు ఎదుర్కుంటారు. దంపతుల మధ్య అవగాహనాలోపం వంటి చికాకులను ఎదుర్కొంటారు. మిత్రుల సహకారంతో ఓ సమస్యను సునాయాసంగా పరిష్కరిస్తారు. పాత రుణాలు తీరుస్తారు. 
 
వృషభం :- స్టేషనరీ, ప్రింటింగ్ రంగాల వారికి పురోభివృద్ధి కానవస్తుంది. మొండి ధైర్యంతో శ్రమించి అనుకున్నది సాధిస్తారు. రుణయత్నాలలో ఆటంకాలు తొలగిపోయి రావలసిన ధనం చేతికందుతుంది. స్త్రీలకు దైవ, పుణ్యకార్యాల పట్ల ఆసక్తి మరింత పెరుగుతుంది. తొందరపడి మాట ఇచ్చి ఇబ్బందులకు గురవుతారు.
 
మిథునం :- విద్యార్ధినులు ప్రేమ వ్యవహరాలకు దూరంగా ఉండటం మంచిది. స్త్రీలకు పనివారాలతో చికాకులను ఎదుర్కుంటారు. గృహ నిర్మాణాలు, మరమ్మత్తులు వాయిదాపడతాయి. ఒకే కాలంలో అనేక పనులు చేపట్టుట వలన దేనిలోను ఏకాగ్రత వహించలేరు. కోర్టు వ్యవహారాలు మీకు అనుకూలంగా నడుస్తాయి.
 
కర్కాటకం :- స్త్రీలకు విదేశీ వస్తువులపట్ల ఆకర్షితులవుతారు. కలప, ఐరన్, ఇటుక, ఇసుక, సిమెంటు వ్యాపారులకు కలిసివస్తుంది. బంధువుల రాక వల్ల మీరు కొంత అసౌకర్యానికి లోనవుతారు. సొంతంగా వ్యపారం చేయాలనే మీ ఆలోచన కార్యరూపం దాల్చుతుంది. ఉద్యోగస్తుల శక్తి సామార్థ్యాలను అధికారులు గుర్తిస్తారు.
 
సింహం :- ఆప్తుల బదిలీ ఆందోళన కలిగిస్తుంది. పోస్టల్, టెలిగ్రాఫ్, కొరియర్ రంగాల్లో వారికి ఒత్తిడి, చికాకులు అధికమవుతాయి. దైవ సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు. కొబ్బరి, పండ్ల, పూల, చిరు వ్యాపారులకు లాభదాయకం. ప్రయాణాలు అనుకూలిస్తాయి. తలపెట్టిన పనులు అనుకున్న విధంగా పూర్తి చేస్తారు.
 
కన్య :- ఆర్థిక విషయాల్లో సంతృప్తి కానరాదు. అదనపు సంపాదన కోసం మార్గాలు అన్వేషిస్తారు. నిర్లక్ష్యంగా వాహనం నడపటం వల్ల చిక్కుల్లో పడే ఆస్కారం ఉంది. వ్యాపారాభివృద్ధికి చేయుకృషి ఫలిస్తుంది. మిత్రుల కలయితో మీలో కొత్త ఉత్సాహం చోటుచేసుకుంటుంది. ప్రముఖుల కలయిక అనుకూలించదు.
 
తుల :- విద్యార్థినులకు ఏకాగ్రత లోపం వల్ల చికాకులను ఎదుర్కొంటారు. ఉపాధ్యాయులకు, మార్కెటింగ్ రంగాల వారికి ఒత్తిడి, పనిభారం తప్పవు. సోదరీ, సోదరులతో సత్సంబంధాలు నెలకొంటాయి. ఓర్పు, శ్రమాధిక్యతతో మీరు అనుకున్నది సాధిస్తారు. నిరుద్యోగులు అధికారులతో సంభాషించునపుడు మెళుకువ అవసరం.
 
వృశ్చికం :- పారిశ్రామిక రంగంలోని వారికి కార్మికులతో సమన్వయం లోపిస్తుంది. ప్రింటింగ్ రంగాల వారికి అచ్చుతప్పులు దొర్లటం వల్ల కష్టనష్టాలు ఎదుర్కోవలసి వస్తుంది. ఆలయాలను సందర్శిస్తారు. హోటల్, తినుబండారాలు, పండ్ల వ్యాపారులకు పురోభివృద్ధి కానవస్తుంది. ఖర్చులు రాబడికి తగినట్లుగా ఉంటాయి.
 
ధనస్సు :- ఆత్మీయుల నుంచి ఒక ముఖ్య సమాచారం అందుతుంది. చేపట్టిన పనులు అసంపూర్ణంగా ముగించవలసి వస్తుంది. ప్రేమికులకు సన్నిహితుల తోడ్పాటు, ఆదరణ లభిస్తాయి. స్త్రీలకు దైవ, పుణ్యకార్యాల పట్ల ఆసక్తి మరింత పెరుగుతుంది. ఉపాధ్యాయులకు, మార్కెటింగ్ రంగాల వారికి ఒత్తిడి, పనిభారం తప్పవు. 
 
మకరం :- కాంట్రాక్టర్లకు, బిల్డర్లకు నిర్మాణ పనులలో ఒత్తిడి, చికాకులు అధికమవుతాయి. మీ అలవాట్లు, బలహీనతలు అదుపులో ఉంచుకోవటం శ్రేయస్కరం. ప్రయాణాలు అనుకూలిస్తాయి. వృత్తి, వ్యాపారాలలో బాగా రాణిస్తారు. ఆర్థిక, ఆరోగ్య విషయాలలో సంతృప్తి కానవస్తుంది. ఏ విషయంలోను ఏకపక్ష నిర్ణయం మంచిదికాదు.
 
కుంభం :- కళాకారులకు, రచయితలకు, పత్రికా రంగాలో వారికి శ్రమ అధికమవుతుంది. ఆలయాలను సందర్శిస్తారు. వ్యాపార సంస్థల అభివృద్ధికి కొత్త కొత్త పథకాలు రూపొందిస్తారు. బంధువుల నుంచి ఆహ్వానాలు అందుకుంటారు. కుటుంబీకుల కోసం ధనం వ్యయం చేస్తారు. ఏమరపాటుతనంతో ఉద్యోగస్తులకు ఇబ్బందులు తప్పవు.
 
మీనం :- గృహోపకరణాలు కొనుగోలు చేస్తారు. స్త్రీలకు ఆర్జన పట్ల ఆసక్తి పెరుగుతుంది. మీ జీవితభాగస్వామి సలహా పాటించి లబ్ధి పొందుతారు. తలపెట్టిన పనులు వాయిదా వేయవలసి వస్తుంది. స్త్రీల ప్రతిభకు మంచి గుర్తింపు, రాణింపు లభిస్తుంది. వ్యవహారాల్లో అనుకూలత, కార్యసాధనలో జయం పొందుతారు.