సోమవారం, 23 డిశెంబరు 2024
  1. ఆధ్యాత్మికం
  2. భవిష్యవాణి
  3. దినఫలం
Written By రామన్
Last Updated : బుధవారం, 29 నవంబరు 2023 (10:14 IST)

29-11-2023 బుధవారం రాశిఫలాలు - కంప్యూటర్ రంగాల్లో వారికి ఒత్తిడి తప్పదు...

horoscope
మేషం :- టెక్నికల్, ఎలక్ట్రానిక్, కంప్యూటర్ రంగాల్లో వారికి ఒత్తిడి తప్పదు. గణిత, సైన్సు, కామర్స్ రంగాల వారికి గుర్తింపు, సదావకాశాలు లభిస్తాయి. స్త్రీలలో సంపాదన పట్ల ఆసక్తి మరింత బలపడుతుంది. మీ పాత సమస్యలు పరిష్కారమవుతాయి. బ్యాంకుల్లో మీ పనుల్లో స్వల్ప ఆటంకాలు ఎదుర్కోవలసి వస్తుంది.
 
వృషభం :- ఆర్థిక లాభాలు పెరుగుతాయి. ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాల పట్ల ధ్యాస వహిస్తారు. నిరుద్యోగులకు సదావకాశాలు లభిస్తాయి. బంధు మిత్రులకు శుభాకాంక్షలు అందజేస్తారు. కొత్త మార్పులకు అనుకూలిస్తాయి. మీ ఆత్మస్థైర్యం, పనితీరు బాగా పెరుగుతాయి. అత్యవసర పనులను త్వరగా పూర్తి చేసుకోండి.
 
మిథునం :- రావలసిన ధనం సకాలంలో అందుకుంటారు. డాక్టర్లు శస్త్రచికిత్సలు విజయవంతంగా పూర్తిచేస్తారు. సన్నిహితుల సలహాలు, హితోక్తులు మీ పై మంచి ప్రభావం చూపుతాయి. విద్యార్థులలో మానసిక ప్రశాంతత చోటుచేసుకుంటుంది. ఆలయాలను సందర్శిస్తారు. మీ ఉత్సాహాన్ని అదుపులో ఉంచుకోవటం శ్రేయస్కరం.
 
కర్కాటకం :- ఆర్థికంగా ప్రగతి సాధిస్తారు. ఉద్యోగ, వ్యాపారులకు అధికారుల నుండి ఒత్తిడి, చికాకులు వంటివి ఎదుర్కొంటారు. విద్యార్ధినుల నిర్లక్ష్యం, ఏకాగ్రత లోపం వల్ల ఒత్తిడి, మందలింపులు అధికమవుతాయి. కుటుంబంలో ఉల్లాసం, సంతోషం కానవస్తుంది. మిత్రులతో కలిసి విందు వినోదాలలో పాల్గొంటారు.
 
సింహం :- మనసులో భయాదోళనలూ అనుమానాలూ ఉన్నా, డాంబికం ప్రదర్శించి పనులు సాఫీగా పూర్తి చేస్తారు. స్త్రీలకు పనిభారం అధికం. అవగాహన లేని వ్యాపారాలు, వ్యవహారాలకు దూరంగా ఉండటం మంచిది. ఉద్యోగస్తులు సభలు, సమావేశాల్లో పాల్గొంటారు. కొత్త సమస్యలు తలేత్తే ఆస్కారం ఉంది, మెళకువ వహించండి.
 
కన్య :- డబ్బు చేతికందకపోవడంతో కొన్ని పనులు అలస్యంగా పూర్తి చేస్తారు. ఉద్యోగస్తులు కొత్తబాధ్యతలు చేపడతారు. పాత మిత్రులను కలుసుకుంటారు. కడుపు నొప్పిలాంటి సమస్యలకు వెంటనే వైద్యం చేయించుకోండి. వృత్తి వ్యాపారాల్లో పోటీతత్వం మిమ్ములను ఆందోళనకు గురిచేస్తుంది. ప్రయాణాల లక్ష్యం నెరవేరుతుంది.
 
తుల :- మీ సంతానం విద్యా, వివాహ విషయాల పట్ల శ్రద్ధ కనబరుస్తారు. ఖర్చులు రాబడికి తగినట్లుగానే ఉంటాయి. రాజకీయనాయకులు విందు, వినోదాలలో పాల్గొంటారు. స్టేషనరీ, ప్రింటింగ్ రంగాల వారికి సంతృప్తి, పురోభివృద్ధి కావస్తుంది. ఆడిట్, అకౌంట్స్‌ రంగాల వారికి ఒత్తిడి, పనిభారం అధికంగా ఉంటాయి.
 
వృశ్చికం :- ప్రత్యర్థులు సైతం మీ ఔన్నత్యాన్ని గుర్తిస్తారు. విదేశీ వ్యవహారాలు అనుకూలిస్తాయి. సోదరీ, సోదరులతో ఏకీభవించలేకపోతారు. అనుకున్న పనులు ఆశించినంత చురుకుగా సాగవు. తలపెట్టిన పనులు నిర్విఘ్నంగా పూర్తి చేస్తారు. రుణ విముక్తులు కావడంతో పాటు కొత్త రుణాలు అనుకూలిస్తాయి.
 
ధనస్సు :- ఆర్థికస్థితి కొంత మెరుగుపడుతుంది. బంధవులు రాకపోకలు అధికమవుతాయి. విద్యార్థులకు పురోభివృద్ధి, ఉపాధ్యాయులకు ఒత్తిడి, చికాకులు తప్పవు. ప్రముఖుల కలయిక వల్ల మీ సమస్యలు పరిష్కార మార్గంలో నడుస్తాయి. మీ వ్యక్తిగత భావాలకు మంచి స్ఫురణ లభిస్తుంది. దూర ప్రయాణాలలో జాగ్రత్త అవసరం.
 
మకరం :- ఉద్యోగస్తులకు తోటివారి సహాయం లభించదు. స్త్రీలకు ఆరోగ్యపరమైన సమస్యలు తలెత్తుతాయి. ప్రణాళికాబద్ధంగా వ్యవహరించి కొన్ని లక్ష్యాలు సాధిస్తారు. ప్రియతముల రాక సంతోషం కలిగిస్తుంది. మీ జీవితభాగస్వామి వైఖరి చికాకు కలిగిస్తుంది. ప్రతి విషయంలోను ఆచితూచి వ్యవహరించాల్సి ఉంటుంది.
 
కుంభం :- నిరుద్యోగ యత్నాలు కలిసిరాగలవు. ఆధ్యాత్మిక విషయాల పట్ల ఆసక్తి కలుగుతుంది. మీ శ్రీమతి సలహా పాటించటం చిన్నతనంగా భావించకండి. కాంట్రాక్టర్లు ప్రముఖుల సహకారంతో పెద్ద పెద్ద కాంట్రాక్టులు చేజిక్కించుకుంటారు. బంధువుల కలుసుకుంటారు. కోర్టు వ్యవహారాలు మీరు కోరుకున్నట్టుగానే వాయిదా పడతాయి.
 
మీనం :- వస్త్ర, బంగారం, వెండి, గృహోపకరణాల వ్యాపారులకు పనివారలతో చికాకులు తప్పవు. ఆలయాలను సందర్శిస్తారు. మీ శ్రీమతికి మీరంటే ప్రత్యేకాభిమానం కలుగుతుంది. ఖర్చులు పెరగటంతో అదనపు రాబడికై యత్నిస్తారు. ప్రభుత్వ కార్యాలయాల్లో మీ పనుల సానుకూలతకు పలుమార్లు తిరగవలసి ఉంటుంది.