1. ఆధ్యాత్మికం
  2. భవిష్యవాణి
  3. దినఫలం
Written By ఠాగూర్

04-04-202 గురువారం దినఫలాలు - బంధాలను నిలుపుకోవటానికి కష్టపడాల్సి వస్తుంది...

astro11
శ్రీ శోభకృత్ నామ సం|| ఫాల్గుణ ఐ|| దశమి ప.12.02 శ్రవణం సా.4.30 రా.వ.8.16 ల 9.46. ఉ.దు. 10.01 ల 10.50 ప. దు. 2. 54 ల 3.43.
 
మేషం :- మీ చిన్నారులకు ధనం అధికంగా వెచ్చిస్తారు. ఉపాధ్యాయులకు మంచి గుర్తింపు, రాణింపు లభిస్తుంది. దంపతుల మధ్య మనస్పర్థలు తలెత్తుతాయి. డాక్టర్లు శస్త్రచికిత్సలు విజయవంతంగా పూర్తిచేస్తారు. స్త్రీలతో సంభాషించేటపుడు సంయమనం పాటించండి. పుణ్యక్షేత్రాల దర్శనం వల్ల మానసిక ప్రశాంతత చేకూరుతుంది.
 
వృషభం :- కష్టపడి పనిచేస్తే డబ్బు దానంతటదే వస్తుంది. ప్రింటింగ్ రంగాల వారికి పని భారం బాగా పెరుగుతుంది. మీ స్నేహితుల వల్ల విలువైన వస్తువులు చేజారిపోతాయి. ఆటోమొబైల్, రవాణా, మెకానికల్ రంగాల్లో వారికి చికాకు తప్పదు. ఉద్యోగస్తులకు కొత్త బాధ్యతలతో పాటు పనిభారం అధికమవుతుంది.
 
మిథునం :- నిరుద్యోగులకు సదావకాశాలు లభించినా వాటిని సద్వినియోగం చేసుకోలేరు. కొన్ని బంధాలను నిలుపుకోవటానికి కష్టపడాల్సి వస్తుంది. మీరు చేయని కొన్ని పనులకు మీ మీద నిందలు మోపే అవకాశంఉంది. బంధు మిత్రుల కలయిక మీకు ఆహ్లాదాన్ని కలిగిస్తుంది. పాత వస్తువులకు కొని ఇబ్బందులను ఎదుర్కొంటారు.
 
కర్కాటకం :- స్త్రీలకు పనివారలతో సమస్యలు తలెత్తగలవు. పెద్దల ఆరోగ్య విషయంలో మెళుకువ అవసరం. విద్యార్థునులు ప్రేమ వ్యవహారాలకు దూరంగా ఉండటం మంచిది. షాపింగులో దుబారా ఎక్కువగా ఉండే అవకాశం ఉంది. ఇతరులు ముందు వ్యక్తిగత విషయాలు వెల్లడించటం మంచిది కాదని గమనించండి.
 
సింహం :- ఏ.సి. కూలర్ మెకానిక్ రంగాలలో వారిక సంతృప్తి కానవస్తుంది. ప్రభుత్వ ఉద్యోగులకు కోరుకున్న చోటికి బదిలీలు, ప్రమోషన్లను పొందుతారు. అవసరమైన వస్తువులు సమయానికి కనిపించకపోవడం వల్ల ఆందోళన చెందుతారు. భీమా, పెన్షన్, వ్యవహారాలు క్రయ విక్రయాల్లో చిక్కులు ఎదురవుతాయి.
 
కన్య :- పాత జ్ఞాపకాల గురించి మీ మిత్రులతో చర్చించడంలో ఉల్లాసాన్ని పాలు పొందుతారు. ధనియాలు, ఆవాలు, పసుపు, నూనె వ్యాపారస్తులకు, స్టాకిస్టులకు అనుకూలంగా వుండగలదు. టెక్నికల్, ఎలక్ట్రానికల్ రంగంలో వారికి కలసి వచ్చేకాలం. చేపట్టిన పనులు కొంత ఆలస్యంగానైనా సంతృప్తికరంగా పూర్తి చేస్తారు.
 
తుల :- విద్యార్థులు అత్యుత్సాహాన్ని అదుపులో ఉంచుకోవటం క్షేమదాయం. నిరుద్యోగులకు ఇంటర్వ్యూలు అనుకూలిస్తాయి. ధనం విపరీతంగా వ్యయం అయినా ప్రయోజనకరంగా ఉంటుంది. వ్యాపారాభివృద్ధికి చేయుకృషిలో రాణిస్తారు. ఉద్యోగస్తులు ఒత్తిళ్ళు, ప్రలోభాలకు పోకుండా ఏకాగ్రతతో పని చేయవలసి ఉంటుంది.
 
వృశ్చికం :- దంపతుల మధ్య సఖ్యత నెలకొంటుంది. ఉపాధ్యాయులకు ఒత్తిడి, అక్కౌంట్స్ రంగాల వారికి పనిభారం తప్పవు. ప్రేమికులకు పెద్దల నుండి వ్యతిరేకత, ఇతరత్రా చికాకులు అధికమవుతాయి. రాజకీయ నాయకులు అనుకున్న పనులు సకాలంలో పూర్తి చేస్తారు. కాంట్రాక్టర్లకు నిర్మాణ పనుల్లో స్వీయ పర్యవేక్షణముఖ్యం.
 
ధనస్సు :- పత్రిక రంగాల్లో వారు, రచయితలు ఆశించే మార్పులకోసం కొంత కాలం వేచియుండకతప్పదు. బ్యాంకు వ్యవహారాలు, ప్రయాణాల్లో మెలకువ వహించండి. గృహంలో మార్పులు, చేర్పులకై చేయుయత్నాలు ఫలిస్తాయి. ఇతరులకు వాహనం ఇచ్చేటపుడు లౌక్యం పాటించండి. బంధువుల రాకపోకలు అధికమవుతాయి.
 
మకరం :- బంధువుల మధ్య సయోధ్య నెలకొంటుంది. పచారీ, ఫ్యాన్సీ, హోటల్, తినుబండారాలు, క్యాటరింగ్ పనివారలకు పురోభివృద్ధి. సోదరీ సోదరులతో ఏకీభవించలేకపోతారు. స్త్రీలతో సంభాషించునపుడు సంయమనం పాటించండి. ఉద్యోగస్తుల తొందరపాటు చర్యలు, నిర్లక్ష్యం వల్ల కొత్త సమస్యలెదుర్కోవలసివస్తుంది.
 
కుంభం :- నిరుద్యోగులకు ఉపాధిపథకాల పట్ల ఆసక్తి పెరుగుతుంది. మిత్రులపై ఉంచిన నమ్మకం వమ్యు అయ్యే ఆస్కారం ఉంది. పెంపుడు జంతువుల గురించి ఆందోళన చెందుతారు. ముఖ్యుల రాకపోకలు, ఊహించని ఖర్చులు ఎదుర్కోక తప్పదు. భాగస్వామిక వ్యాపారాల నుంచి విడిపోవాలనే ఆలోచన స్ఫురిస్తుంది.
 
మీనం :- అనవసరపు వాగ్ధానాలుచేసి సమస్యలు తెచ్చుకోకండి. విదేశీ వస్తువుల పట్ల ఆసక్తి పెరుగుతుంది. గృహంలో మార్పులుచేర్పులు అనుకూలిస్తాయి. స్త్రీలకు పరిచయాలు, వ్యాపకాలు అధికమవుతాయి. సభలు, సమావేశాలలో హుందాగా వ్యవహరించి అందరినీ ఆకట్టుకుంటారు. డాక్టర్లు శస్త్రచికిత్సలు విజయవంతంగా పూర్తిచేస్తారు.