బుధవారం, 8 జనవరి 2025
  1. ఆధ్యాత్మికం
  2. భవిష్యవాణి
  3. దినఫలం
Written By రామన్

31-03-2024 ఆదివారం దినఫలాలు - బంధువులతో తెగిపోయిన సంబంధ బాంధవ్యాలు బలపడతాయి..

astro8
శ్రీ శోభకృత్ నామ సం|| ఫాల్గుణ ఐ|| షష్ఠి సా.5.17 జ్యేష్ఠ రా. 7.08 తె.వ.3.07 ల 4.42. సా.దు. 4.29 ల 5.16.
 
మేషం :- ఉద్యోగస్తులకు అపరిచిత వ్యక్తుల వల్ల హాని కలిగే ఆస్కారం ఉంది.. పెద్దమొత్తం నగదుతో ప్రయాణాలు క్షేమంకాదు. సందర్భం లేకుండా నవ్వడం వల్ల కలహాలు ఎదుర్కొవలసివస్తుంది. బంధువులతో తెగిపోయిన సంబంధ బాంధవ్యాలు బలపడతాయి. స్త్రీలు వీలైనంత వరకు మితంగా సంభాషించడం మేలు.
 
వృషభం :- రుణ యత్నాలు, చేబదుళ్ళు తప్పవు. క్రీడా, కళారంగాల్లో వారికి సంతృప్తికానరాదు. ఉద్యోగస్తుల సమర్థత, సమయస్ఫూర్తికి అధికారుల నుంచి ప్రశంసలు అందుతాయి. ప్లీడర్లకు తమ క్లయింట్లు తీరు ఇబ్బందులకు గురిచేస్తుంది. దంపతుల సంబంధ బాంధవ్యాలు బాగుగా ఉంటాయి. పెంపుడు జంతువుల పట్ల ఆందోళన చెందుతారు.
 
మిథునం :- శ్రీవారు, శ్రీమతి వైఖరి ఉల్లాసం కలిగిస్తుంది. పాత మొండి బాకీలు సైతం వసూలు కాగలవు. నిరుద్యోగులు బోగస్ ప్రకటనలతో మోసపోయే వీలుంది. వ్యాపారంలో ఎంతో పక్కగా తయారుచేసుకున్న ప్రణాళికలు విఫలం కావచ్చు. విద్యార్థినిలు ప్రేమ వ్యవహారాలకు దూరంగా ఉండటం మంచిది.
 
కర్కాటకం :- కుటుంబీకుల మధ్య పరస్పర అవగాహన లోపం, చికాకులు అధికమవుతాయి. చిట్‌ఫండ్, ఫైనాన్సు రంగాలలో వారికి ఖాతా దారుల నుంచి ఒత్తిడి పెరుగుతుంది. బంధువులతో తెగిపోయిన సంబంధ బాంధవ్యాలు బలపడతాయి. కిరాణా, ఫ్యాన్సీ, స్టేషనరీ, గృహోపకరణ వ్యాపారులు పురోభివృద్ధి పొందుతారు.
 
సింహం :- మత్స్య కోళ్ళ వ్యాపారస్తులకు లాభదాయకంగా ఉంటుంది. స్త్రీల పట్టుదల, మొండివైఖరి వల్ల గృహంలో ప్రశాంతత లోపిస్తుంది. సోదరీ, సోదరులను కలుసుకుంటారు. సంఘంలో మీ మాటకు గౌరవ మర్యాదలు లభిస్తాయి. విద్యార్థులు ప్రేమ వ్యవహారాలకు దూరంగా ఉండటం మంచిదని గమనించండి.
 
కన్య :- కళ, క్రీడా, సాంకేతిక రంగాలవారికి ప్రోత్సాహం లభిస్తుంది. రవాణా రంగాల వారికి మెళుకువ, ఏకాగ్రత అవసరం. స్త్రీలు విలువైన వస్తువులు అమర్చుకుంటారు. పెద్దమొత్తంలో ధనసహాయం చేసే విషయంలోనూ, మధ్యవర్తిత్వాలకు సంబంధించిన వ్యవహారాలలో మెళకువ వహించండి. ఆలయాలను సందర్శిస్తారు.
 
తుల :- ప్రముఖుల కలయిక ప్రయోజనకరంగా ఉంటుంది. బ్యాంకు వ్యవహారాలలో మెళకువ అవసరం. వాహనం ఇతరులకు ఇచ్చి ఇబ్బందులను ఎదుర్కొంటారు. ఉపాధ్యాయలు మార్పు కోసం చేసే యత్నాలు ఫలిస్తాయి. వివాదాస్పద వ్యవహరాలు సమర్థంగా పరిష్కరిస్తారు. సందర్భం లేకుండా నవ్వడం వల్ల సమస్యలు తలెత్తగలవు.
 
వృశ్చికం :- మీ రాక బంధువులకు ఎంతో ఆనందాన్ని ఇస్తుంది. కోర్టు వ్యవహారాలు మీకు అనుకూలిస్తాయి. దైవ సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు. విదార్థులకు ఏకాగ్రత చాలా అవసరం. ఉద్యోగస్తులు అధికారులతో సంభాషించేటపుడు ఆత్మనిగ్రహం వహించడం మంచిది. ద్విచక్ర వాహనం పైదూర ప్రయాణాలు అనుకూలిస్తాయి.
 
ధనస్సు :- వృత్తి, వ్యాపారులకు సమస్యలెదురైనా ఆదాయానికి కొదవ ఉండదు. ప్రముఖుల కలయికవల్ల ఆశించిన ఫలితం ఉంటుంది. సంగీత, నృత్య, సాహిత్య కళాకారులకు గుర్తింపు, ఆదరణలభిస్తాయి. స్త్రీలుతోటివారి ఉన్నతస్థాయితో పోల్చుకోవటం క్షేమం కాదు. స్టేషనరీ, ప్రింటింగ్ రంగాలలో వారికి సదావకాశాలు లభిస్తాయి.
 
మకరం :- ఆదాయానికి తగినట్లు ఖర్చు చేస్తారు. కొబ్బరి, పండ్లు, పూలు, చిరు వ్యాపారులకు లాభదాయకంగా ఉంటుంది. రవాణా రంగాలవారికి చికాకులు అధికమవుతాయి. ఉద్యోగస్తులకు పైఅధికారుల నుంచి మంచి గుర్తింపు, రాణింపు లభిస్తుంది. ఉపాధ్యాయులకు, మార్కెట్ రంగాల వారికి ఒత్తిడి, అధికమవుతుంది.
 
కుంభం :- ఆర్థిక విషయాలలో ఒక అడుగు ముందుకు వేస్తారు. మిత్రుల కారణంగా మీ కార్యక్రమాలు వాయిదా వేసుకోవలసి వస్తుంది. ముఖ్యమైన వ్యవహారాలు గోప్యంగా వుంచండి. సొంతంగా ఏదైనా వ్యాపారం చేయాలనే మీ ఆలోచన వాయిదా వేయడం మంచిది. ఒక సమస్య పరిష్కారం కావటంతో మనస్సు తేలికపడుతుంది.
 
మీనం :- బ్యాంకింగ్ రంగాలవారికి ఒత్తిడి, చికాకులు అధికమవుతాయి. గృహమునకు కావలసిన వస్తువులను కొనుగోలు చేస్తారు. మీ సంతానం మొండివైఖరి మీకు ఎంతో చికాకు కలిగిస్తుంది. స్త్రీలకు పనిభారం అధికం. బంధు మిత్రుల నుంచి విమర్శలను ఎదుర్కొంటారు. వాహనం నడుపునపుడు మెళకువ అవసరం.