బుధవారం, 8 జనవరి 2025
  1. ఆధ్యాత్మికం
  2. భవిష్యవాణి
  3. దినఫలం
Written By రామన్
Last Updated : శుక్రవారం, 29 మార్చి 2024 (09:39 IST)

29-03-2024 శుక్రవారం దినఫలాలు - దంపతులకు కొత్త ఆలోచనలు ...

astro5
శ్రీ శోభకృత్ నామ సం|| ఫాల్గుణ బ|| చవితి సా.5.14 విశాఖ సా. 5.52. రా.వ.10.00 ల 11.40. ఉ.దు. 8.42 ల 9.29 ప. దు. 12.35 ల1.22.
 
మేషం :- బ్యాంకు వ్యవహారాలలో ఒత్తిడి, చికాకులు అధికమవుతాయి. రుణాలు తీరుస్తారు. ఉద్యోగస్తుల దైనందిన కార్యక్రమాలు ప్రశాంతంగా సాగుతాయి. దంపతులకు కొత్త ఆలోచనలు స్ఫురిస్తాయి. బంధువుల రాక వల్ల పనులు అర్థాంతంగా ముగించవలసి వస్తుంది. స్త్రీలకు ఆరోగ్య విషయంలో తగు జాగ్రత్తలు అవసరం.
 
వృషభం :- ఆదాయనికి మించి ఖర్చులు అధికమవుతాయి. పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. విద్యార్థులకు క్రీడా రంగాలపట్ల ఆసక్తి పెరుగుతుంది. గృహ నిర్మాణాలు, మార్పులు, చేర్పులు అనుకూలిస్తాయి. ఉద్యోగ రీత్యా దూర ప్రయాణాలు అనుకూలిస్తాయి. వాహనం ఇతరులకు ఇచ్చి విషయంలో లౌక్యంగా వ్యవహారించండి. 
 
మిథునం :- సభలు, సమావేశాలలో హుందాగా వ్యవహరించి అందరినీ ఆకట్టుకుంటారు. గత విషయాలు జ్ఞప్తికి రాగలవు. బాకీలు, ఇంటి అద్దెలు లౌక్యంగా వసూలు చేసుకోవాలి. వస్త్ర వ్యాపారులు పనివారలను ఓ కంట కనిపెట్టుకుని ఉండటం శ్రేయస్కరం. విద్యార్థుల మొండివైఖరి ఉపాధ్యాయులకు ఎంతో చికాకు కలిగిస్తుంది.
 
కర్కాటకం :- దంపతులకు ఏ విషయంలోను పొత్తు కుదరదు. షామియాన, సప్లయ్ రంగాలలో వారికి గణనీయమైన పురోభివృద్ధి కానవస్తుంది. స్త్రీలకు సంపాదన పట్ల ఆసక్తి, అవకాశాలు కలిసివస్తాయి. మీ అభిరుచులకు తగిన వ్యక్తులతో పరిచయాలు ఏర్పడతాయి. కోర్టు వ్యవహారాల్లో ప్లీడర్ల ధోరణి ఆందోళన కలిగిస్తుంది.
 
సింహం :- ఆర్థిక విషయాల్లో కొంత పురోగతి సాధిస్తారు. వృత్తి, వ్యాపారులకు సమస్యలెదురైనా ఆదాయానికి కొదవ ఉండదు. రాజకీయనాయకులకు ప్రయాణాలలో అపరిచిత వ్యక్తులపట్ల మెళకువ చాలా అవసరం. డాక్టర్లు శస్త్రచికిత్సలు విజయవంతంగా పూర్తిచేస్తారు. హామీలు, చెక్కుల జారీల్లో ఏకాగ్రత వహించండి.
 
కన్య :- ఆర్థికంగా స్థిరపడతారు. వాతావరణంలో మార్పు మీ పనులకు ఆటంకమవుతుంది. దూర ప్రయాణాలలో ఇబ్బందులను ఎదుర్కొంటారు. సంఘంలో మంచి గుర్తింపు, రాణింపు లభిస్తుంది. స్త్రీలకు విదేశీ వస్తువులపట్ల ఆసక్తి అధికమవుతుంది. కోర్టు వాదోపవాదాల్లో ప్లీడర్లకు మంచి గుర్తింపు లభిస్తుంది.
 
తుల :- మీ ఉన్నతిని చూచి అసూయపడేవారు అధికమవు తున్నారని గమనించండి. స్త్రీలకు పరిచయాలు, వ్యాపకాలు అధికమవుతాయి. ప్లీడర్లకు తమ క్లయింట్లు తీరు ఇబ్బందులకు గురిచేస్తుంది. ప్రింటింగ్ రంగాల వారికి బకాయిల వసూళ్ళలో శ్రమాధిక్యత, ప్రయాసలు తప్పవు. ప్రముఖులను కలుసుకుంటారు.
 
వృశ్చికం :- వ్యాపారాల్లో ఆటంకాలు తొలగి లాభాలు ఆర్జిస్తారు. ప్లీడర్లకు, ప్లీడరు గుమాస్తాలకు సామాన్యం. మీ సంతానం ప్రేమ వ్యవహారం చర్చ నీయాంశమవుతుంది. బ్యాంకు పనులు మందకొడిగా ఆగుతాయి. విద్యార్థులకు అధ్యాపకులతో సత్సంబంధాలు నెలకొంటాయి. స్టేషనరీ, ప్రింటింగు రంగాల వారికి సదవకాశాలు లభిస్తాయి.
 
ధనస్సు :- మీ కళత్ర మొండివైఖరి మీకు ఎంతో చికాకు కలిగిస్తుంది. కుటుంబీకులతో తెగిపోయిన సంబంధాలు బలపడతాయి. లౌక్యంగా వ్యవహరించి ఒక అవకాశాన్ని మీకు అనుకూలంగా మలుచుకుంటారు. మీ సంతానం విజయం సంతోషం కలిగిస్తుంది. కోర్టు వ్యవహారాలు విచారణకు వచ్చే సూచనలున్నాయి.
 
మకరం :- ఆర్ధిక లావాదేవీలు, కుటుంబ సమస్యలు చక్కగా పరిష్కరిస్తారు. ప్రయాణం చేయవలసివస్తుంది. స్త్రీలు విలువైన వస్తువులు అమర్చుకుంటారు. ఆలయాలను సందర్శిస్తారు. విద్యార్థులో ఆందోళన తొలగిపోయి నిశ్చింత చోటుచేసుకుంటుంది. వ్యాపారాలకు సంభంధించి ఓ సమాచారం నిరుత్సాహం కలిగిస్తుంది.
 
కుంభం :- స్థిరాస్తి కొనుగోళ్ళకు సంబంధించిన వ్యవహారాలు వాయిదా పడతాయి. రాజకీయాల్లో వారికి అనుకోని మార్పు కానరాగలదు. పారిశ్రామిక రంగాల వారికి ప్రోత్సాహకరం. ఆకస్మికంగా మీలో వేధాంత ధోరణి కనపడుతుంది. ఎలక్ట్రానికల్, ఇన్వెర్టర్ వ్యాపారస్తులకు పురోభివృద్ధి. వాహనం నడుపునపుడు జాగ్రత్త అవసరం.
 
మీనం :- బ్యాంకింగ్, చిట్స్ రంగాల వారికి ఒత్తిడి, పనిభారం అధికమవుతుంది. ఉద్యోగ రీత్యా ఆకస్మికంగా ప్రయాణం చేయవలసి వస్తుంది. ఎవరికైనా ధన సహాయం చేసినా తిరిగిరాజాలదు. స్త్రీలకు టీ.వీ ఛానెళ్ల నుంచి ఆహ్వానం, కానుకలు అందుతాయి. మితిమీరిన శారీరక శ్రమ వల్ల ఆరోగ్యంలో ఇబ్బందులుతప్పవు.