సోమవారం, 23 డిశెంబరు 2024
  1. ఆధ్యాత్మికం
  2. భవిష్యవాణి
  3. దినఫలం
Written By రామన్

25-03-2024 సోమవారం దినఫలాలు - కాంట్రాక్టర్లకు నూతన టెండర్లు అనుకూలిస్తాయి...

astro1
శ్రీ శోభకృత్ నామ సం|| ఫాల్గుణ శు॥ పూర్ణిమ ఉ.11.34 ఉత్తర ఉ.9.59 రా.వ.7.15 ల 9.01. ప.దు.12.35 ల 1.22 పు.దు. 2.55 ల 3.42.
 
మేషం :- పత్రికా సంస్థలలోని వారికి చికాకులు, ఆందోళన అధికమవుతాయి. ట్రావెలింగ్ రంగాల వారికి సామాన్యంగా ఉంటుంది. కోర్టు వ్యవహారాలు, భూ వివాదాలు పరిష్కార దిశగా సాగుతాయి. మీ అభిరుచికి తగిన వ్యక్తులతో పరిచయాలేర్పడతాయి. రావలసిన ఆదాయంలో కొంత మొత్తమైనా అందుతుంది.
 
వృషభం :- ఉత్తర ప్రత్యుత్తరాలు సంతృప్తిని ఇస్తాయి. స్త్రీలకు ఆరోగ్యభంగం, ఇంటి పనుల్లో చికాకులు తప్పవు. వాహనం నడుపుతున్నపుడు ఏకాత్ర వహించండి. ధనం ఎంత వస్తున్నా ఏ మాత్రం నిల్వచేయలేకపోవడటం వల్ల ఆందోళనకు గురవుతారు. ఉద్యోగస్తులకు పదోన్నతితో పాటు బదిలీ అయ్యే సూచనలున్నాయి.
 
మిథునం :- వస్త్ర వ్యాపారులు పనివారలను ఓ కంట కనిపెట్టుకుని ఉండటం శ్రేయస్కరం. రియల్ఎస్టేట్ రంగాల వారికి నూతన వెంచర్లు, అనుకూలిస్తాయి. ఉపాధ్యాయులకు మార్పులు అనుకూలిస్తాయి. ఆడిటర్లు, అక్కౌంట్స్ రంగాల వారికి చికాకులు అధికమవుతాయి. ఖర్చులు తగ్గించుకునే మీ యత్నం అనుకూలించదు. 
 
కర్కాటకం:- దైవ కార్యాల పట్ల ఆసక్తి కనబరుస్తారు. వైద్య రంగాల వారికి మంచి గుర్తింపు లభిస్తుంది. విదేశీయానం, రుణ యత్నాల్లో స్వల్ప ఆటంకాలు ఎదుర్కుంటారు. ఇసుక కాంట్రాక్టర్లకు అధికారుల నుంచి వేధింపులు, ఇతరత్రా చికాకులు అధికంగా ఉంటాయి. అనుకున్న పనులు సకాలంలో పూర్తి కాగలవు.
 
సింహం :- విద్యార్థినుల్లో భయాందోళనలు తొలగి మనోధైర్యం నెలకొంటుంది. కలప, సిమెంటు, ఐరన్, ఇటుక వ్యాపారులకు పురోభివృద్ధి కానవస్తుంది. గృహ నిర్మాణాలు, మరమ్మతులకు అనుకూలం. ప్రముఖులతో పరిచయాలు మీ ఉన్నతికి దోహదపడతాయి. దైవ, పుణ్యకార్యాల్లో చురుకుగా పొల్గొంటారు.
 
కన్య :- ఆదాయ వ్యయాల్లో ప్రణాళికాబద్ధంగా వ్యవహరిస్తారు. ఇతరుల విషయాలకు, వాదోప వాదాలకు దూరంగా ఉండటం మంచిది. ఆలయాలను సందర్శిస్తారు. రావలసిన ధనం అందటంతో కుదుటపడ్డారు. ఎంతో కొంత పొదుపు చేయాలన్న మీ సంకల్పం నెరవేరుతుంది. స్త్రీల అనాలోచిత నిర్ణయాలు ఇబ్బందులకు దారితీస్తాయి.
 
తుల :- ఎలక్ట్రికల్, ఎలక్ట్రానికల్, కంప్యూటర్ రంగాల వారికి పురోభివృద్ధి. భాగస్వామిక చర్చల్లో కొత్త విషయాలు చోటు చేసుకుంటాయి. స్పెక్యులేషన్ నిరుత్సాహపరుస్తుంది. ఉద్యోగస్తులు కొత్త బాధ్యతలను సమర్థంగా నిర్వహిస్తారు. నిరుద్యోగులు ఇంటర్వ్యూల్లో విజయం సాధిస్తారు. ఆస్తి వ్యవహారాల్లో పెద్దల నిర్ణయంతో ఏకీభవిస్తారు.
 
వృశ్చికం :- ఉద్యోగస్తుల హోదా పెరిగే సూచనలున్నాయి. ఇచ్చిపుచ్చుకునే వ్యవరాలు, ఒప్పందాల్లో మీదే పైచేయిగా ఉంటుంది. మీ సంతానం విద్యా విషయాలు సంతృప్తినిస్తాయి. దైవ, సేవా సంస్థలకు సహాయ సహకారాలందిస్తారు. ఖర్చులు పెరిగే ఆస్కారం ఉంది. మీ శ్రీమతి ప్రోత్సాహంతో కొత్త యత్నాలు మొదలెడతారు.
 
ధనస్సు :- వస్త్ర, బంగారం, ఫ్యాన్సీ మందుల వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. వృత్తులవారికి శ్రమాధిక్యత మినహా ఆదాయం అంతగా ఉండదు. దంపతుల మధ్య కొత్త కొత్త విషయాలు చర్చకు వస్తాయి. ఉద్యోగస్తులు సేవాభావంతో పనిచేసి అధికారును మెప్పిస్తారు. ప్రముఖులతో మితంగా సంభాషించటం మంచిది.
 
మకరం :- కీలకమైన వ్యవహరాలు మీరే నిర్వహించుకోవటం క్షేమదాయకం. ఉన్నతస్థాయి అధికారులు కొత్త వ్యక్తులను దూరంగా ఉంచటం మంచిది. గృహంలో మార్పులు, చేర్పులు, మరమ్మతులకు అనుకూలం. కొబ్బరి, పండ్ల, పూల, పానీయ, చిరు వ్యాపారులకు పురోభివృద్ధి. కోర్టు తీర్పులు, ఒప్పందాలు మీకు అనుకూలంగా ఉంటాయి.
 
కుంభం :- కాంట్రాక్టర్లకు నూతన టెండర్లు అనుకూలిస్తాయి. కొత్తగా చేపట్టిన వ్యాపారాల అభివృద్ధికి మరింతగా శ్రమించాల్సి ఉంటుంది. మీ సంతానం విద్యా, ఆరోగ్య విషయాల పట్ల ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటారు. వాహనం నడుపుతున్నపుడు ఏకాగ్రత అవసరం. నిరుద్యోగులు చేపట్టిన ఉపాథి పథకాలకు ప్రోత్సాహంలభిస్తుంది.
 
మీనం :- పత్రికా సంస్థలలోని వారికి అనుక్షణం ఏకాగ్రతతో మెలగవలసి ఉంటుంది. స్త్రీలకు ఆరోగ్యం పట్ల శ్రద్ధ అవసరం. శాస్త్ర రంగాల వారికి పరిశోధనలు, ప్రయాగాలకు మంచి గుర్తింపులభిస్తుంది. సంఘంలో పలుకుబడి కలిగిన వ్యక్తులతో పరిచయాలేర్పతాయి. విదేశీయానం, రుణ యత్నాల్లో స్వల్ప ఆటంకాలు ఎదుర్కుంటారు.