సోమవారం, 23 డిశెంబరు 2024
  1. ఆధ్యాత్మికం
  2. భవిష్యవాణి
  3. దినఫలం
Written By రామన్

23-03-2024 శనివారం దినఫలాలు - ఉద్యోగస్తులకు రావలసిన ప్రమోషన్‌లు...

Astrology
శ్రీ శోభకృత్ నామ సం|| ఫాల్గుణ శు|| త్రయోదశి ఉ.7.24 పుబ్బ పూర్తి ప.వ.1.40 ల 3.26. ఉ. దు. 6.21 ల 7.55.
 
మేషం :- ఉద్యోగస్తులకు పరిచిత వ్యక్తులపట్ల మెళకువ అవసరం. విద్యార్థుల్లో మనోధైర్యం, ఉత్సాహం నెలకొంటాయి. ముఖ్యులతో పరిచయాలు మీ పురోభివృద్ధికి తోడ్పడతాయి. ఎదుటివారితో ముక్తసరిగా సంభాషిస్తారు. స్త్రీలకు దైవ కార్యక్రమాలపట్ల ఆసక్తి పెరుగుతుంది. ప్రియతములకు విలువైన కానుకలు ఇచ్చిపుచ్చుకుంటారు.
 
వృషభం :- కుటుంబీకులతో కలసి ఉల్లాసంగా గడుపుతారు. చిన్నతరహా పరిశ్రమలలో వారికి సంతృప్తి కానరాగలదు. సందర్భం లేకుండా నవ్వడం వల్ల కలహాలు ఎదుర్కొవలసి వస్తుంది. దాన ధర్మాలు చేయడం వల్ల మంచి పేరు, ఖ్యాతి లభిస్తుంది. గృహంలో ఏదైనా వస్తువు పోవడానికి ఆస్కారం కలదు. జాగ్రత్త వహించండి.
 
మిథునం :- విద్యార్థులు ప్రశాంతంగా పరీక్షలకు హజరవుతారు. రాజకీయ నాయకులకు ఊహించని మార్పులు చోటుచేసుకుంటాయి. నిరుద్యోగులకు ఇంటర్వ్యూలు కొత్త ఆశలను కలిగిస్తాయి. వాహనచోదకులకు ఆటంకాలు తప్పవు. బంధువులతో ఉల్లాసంగా గడుపుతారు. వాహనం నడుపునపుడు మెళకువ అవసరం.
 
కర్కాటకం :- బంధువులరాక మీకు ఆనందాన్ని కలిగిస్తుంది. స్త్రీలకు కళ్ళు, తల, నరాలకు సంబంధించిన చికాకులు అధికమవుతాయి. నిరుద్యోగులకు సదావకాశాలు లభిస్తాయి. దంపతుల మధ్య కొత్త ఆలోచనలు చోటుచేసుకుంటాయి. సంఘంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి. స్థిరాస్తి కొనుగోలు యత్నాలు వాయిదా పడతాయి.
 
సింహం :- ఉపాధ్యాయులకు ఒత్తిడి, జాప్యం పెరుగుతుంది. విదేశీయాన యత్నాలలో సఫలీకృతులౌతారు. గృహమునకు కావలసిన వస్తువులను కొనుగోలు చేస్తారు. దైవ సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు. దంపతుల మధ్య కొత్త ఆలోచనలు చోటుచేసుకుంటాయి. మీపై సెంటిమెంట్లు, స్వప్నాల ప్రభావం అధికంగా ఉంటుంది.
 
కన్య :- బ్యాంకు వ్యవహారాలలో అపరిచిత వ్యక్తులపట్ల అవసరం. వ్యాపారాలు ప్రణాళిక బద్దంగా సాగుతాయి. స్వయంకృషితో రాణిస్తారన్న విషయం గ్రహించండి. బంధువులు మీ నుంచి ధన సహాయం అర్థిస్తారు. ఉద్యోగస్తులకు తోటివారి నుంచి ఆహ్వానాలు అందుతాయి. సన్నిహితులతో ముఖ్యమైన విషయాలపై చర్చిస్తారు.
 
తుల :- మీ ఆగ్రహావేశాలు అదుపులో ఉంచుకోవటం శ్రేయస్కరం. స్త్రీలకు పనివారలతో చికాకులు అధికమవుతాయి. ధనం ఏ కొంతైనా పొదుపు చేయాలన్న మీ యత్నం ఫలించదు. ప్రైవేటు సంస్థల వారికి, రిప్రజెంటివ్‌లకు గుర్తింపు, రాణింపు లభిస్తుంది. ఇతరులకు వాహనం ఇవ్వటం వల్ల సమస్యలు తలత్తుతాయి.
 
వృశ్చికం :- ఇసుక కాంట్రాక్టర్లకు ఆటంకాలు తప్పవు. దైవ, సేవా కార్యాల పట్ల ఆకర్షితులవుతారు. కోర్టు వ్యవహరాలు ఏమాత్రం ముందుకు సాగవు. వృత్తులవారు ఆదాయం కంటే వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవటం ఉత్తమం. బ్యాంకింగ్, చిట్స్ రంగాల వారికి ఒత్తిడి, పనిభారం అధికమవుతుంది.
 
ధనస్సు :- ఆర్థికస్థితి ప్రోత్సాహకరంగా ఉంటుంది. విద్యార్థులకు ధ్యేయం పట్ల మరింత శ్రద్ధ ఏర్పడుతుంది. భాగస్వామిక వ్యాపారాలు, ఉమ్మడి వెంచర్లు సామాన్యంగా సాగుతాయి. ఒక శుభకార్యానికి యత్నాలు చేస్తారు. పాత మిత్రులు, ఆత్మీయుల కలయిక సంతోషం కలిగిస్తుంది. పెద్దల గురించి ఆందోళన చెందుతారు.
 
మకరం :- వ్యాపారాభివృద్ధికి మరింతగా శ్రమించాల్సి ఉంటుంది. విద్యార్థుల్లో భయం తొలగి మానసిక ధైర్యం నెలకొంటుంది. ఉద్యోగస్తులు ప్రమోషన్ కోసం చేసే యత్నాలు ఫలిస్తాయి. నిరుద్యోగులు ఉపాధి పథకాలకు కావలసిన వనరులు సమకూర్చుకుంటారు. ప్రేమికుల విపరీత ధోరణి వల్ల సమస్యలెదురవుతాయి.
 
కుంభం :- కిరాణా, ఫ్యాన్సీ, వస్త్ర, బంగారం వ్యాపారులకు పురోభివృద్ధి కానవస్తుంది. ఆత్మీయులనుంచి అందిన ఒక సమాచారం మిమ్ములను సందిగ్ధంలో పడవేస్తుంది. గృహంలో ఒక శుభకార్యం కోసం యత్నాలు మొదలెడతారు. రిప్రజెంటేటివ్‌లు, ఎల్.ఐ.సి, పోస్టల్ ఏజెంట్లకు ఒత్తిడి, ఆందోళనలు వంటివి అధికమవుతాయి.
 
మీనం :- స్థిరచరాస్తుల కొనుగోళ్ళ పట్ల ఆసక్తి పెరుగుతుది. ఉద్యోగస్తులకు రావలసిన ప్రమోషన్‌లు త్వరలోనే వస్తుంది. పత్రిక సంస్థలలోని వారికి మార్పులు అనుకూలిస్తాయి. స్త్రీలకు ఆరోగ్యం పట్ల నిర్లక్ష్యం కూడదు. అయిన వారి నుంచి ఒత్తిడి, మొహమ్మాటాలు ఎదురవుతాయి. వ్యాపారాభివృద్ధికి చేయు కృషిలో రాణిస్తారు.