శుక్రవారం, 10 జనవరి 2025
  1. ఆధ్యాత్మికం
  2. భవిష్యవాణి
  3. దినఫలం
Written By రామన్

19-03-2024 మంగళవారం దినఫలాలు - నిరుద్యోగులకు కలిసిరాగలదు....

Astrology
శ్రీ శోభకృత్ నామ సం|| ఫాల్గుణ శు॥ దశమి తె.3.03 పునర్వసు రా.10.57 ఉ.వ.10.23 ల 12.04. ఉ.దు. 8.40 ల 9.27 రా.దు. 10.57 ల 11.46.
 
మేషం :- వృత్తి, వ్యాపారులకు సమస్యలెదురైనా ఆదాయానికి కొదవ ఉండదు. ఉద్యోగస్తులకు అధికారులతో సత్సంబంధాలు నెలకొంటాయి. కోర్టు వ్యవహారాలలో మెళుకువగా వ్యవహరించడం మంచిది. మీ సంతానం మొండివైఖరి మీకు చికాకు కలిగిస్తుంది. స్త్రీలకు తమ బంధువర్గాల వైపు నుండి ఒక ముఖ్య సమాచారం అందుతుంది.
 
వృషభం :- స్త్రీలలో మూలక సమస్యలు తలెత్తుతాయి. రావలసిన మొండి బాకీలు సైతం వసూలుకాగలవు. సంఘంలో ఆదర్శజీవనం జరుపుతారు. పోస్టల్, టెలిగ్రాఫ్ రంగాల్లో వారికి ప్రోత్సాహం కానవస్తుంది. బంధువులు రాకతో గృహంలో సందడి నెలకొంటుంది. పాత మిత్రుల కలయికతో గత విషయాలు జ్ఞప్తికివస్తాయి.
 
మిథునం :- ఆర్థిక లావాదేవీలు సమర్థంగా పరిష్కరిస్తారు. నూతన నిర్ణయాలు చేయు విషయంలో ఆచి, తూచి వ్యవహరించవలెను. మీ సోదరి మొండి వైఖరి మీకు ఎంతో చికాకు కలిగిస్తుంది. ఉద్యోగస్తులు పనిలో ఉండే ఒత్తిడి తగ్గి ప్రశాంతతను పొందుతారు. బ్యాంకింగ్ రంగాల వారికి ఒత్తిడి, చికాకులు అధికమవుతాయి. 
 
కర్కాటకం :- కిరాణా, వస్త్ర వ్యాపారులు అధిక ఒత్తిడిని ఎదుర్కొంటారు. స్త్రీలు అనవసర విషయాల్లో జోక్యం చేసుకోవటం వల్ల భంగపాటుకు గురవుతారు. ప్రముఖుల కోసం షాపింగ్ చేస్తారు. డాక్టర్లు శస్త్రచికిత్సలు విజయవంతంగా పూర్తిచేస్తారు. ఇతరులకు పెద్ద మొత్తంలో రణం ఇచ్చే విషయంలో పునరాలోచన అవసరం.
 
సింహం :- దంపతుల మధ్య అభిప్రాయబేధాలు తలెత్తుతాయి. పెద్దల ఆరోగ్యంలో మెళకువ అవసరం. ఉద్యోగస్తులు ఆశిస్తున్న పదోన్నతి, బదిలీ యత్నాలు త్వరలోనే ఫలిస్తాయి. హామీలు, చెక్కుల జారీల్లో ఏకాగ్రత వహించండి. నిరుద్యోగులకు కలిసిరాగలదు. దూర ప్రయాణాలలో వస్తువులపట్ల మెళకువ అవసరం. 
 
కన్య :- స్త్రీలకు తల, పొట్టకి సంబంధించిన చికాకులు అధికమవుతాయి. విద్యార్థులకు అధిక కృషి చేసిన జయం చేకూరును. నిరుద్యోగులు వచ్చిన అవకాశం చేజార్చుకోవడం మంచిది. ఉద్యోగస్తులకు కార్యాలయ పనులతో పాటు సొంత పనులు కూడా పూర్తికాగలవు. కొబ్బరి, పండ్లు, పూలు, చిరు వ్యాపారాలకు లాభదాయకం.
 
తుల :- ఖర్చులు అధికం కావడంతో రుణాలు, చేబదుళ్ళు తప్పవు. మీ మంచితనమే మీకు శ్రీరామ రక్షగా ఉంటుంది. రాజకీయాలలో వారికి కార్యకర్తల వలన చికాకులు తలెత్తుతాయి. ఉపాధ్యాయులు విద్యార్థులను నుండి ఒత్తిడి, చికాకులను ఎదుర్కుంటారు. ద్విచక్ర వాహనంపై దూర ప్రయాణం మంచిది కాదని గమనించండి.
 
వృశ్చికం :- వస్త్ర, బంగారు, వెండి రంగాల్లో వారికి శ్రమకు తగిన ప్రతిఫలం కానరాగలదు. పాత మిత్రుల కలయికతో గత విషయాలు జ్ఞప్తికి వస్తాయి. విద్యార్థులు చదువులపట్ల ఏకాగ్రత వహించడం వల్ల విజయాన్ని పొందుతారు. ఆస్తి వ్యవహరాలకు సంబంధించి కుటుంబీకులతో ఒక ఒప్పందం కుదుర్చుకుంటారు.
 
ధనస్సు :- రవాణా, ఆటోమొబైల్, మెకానికల్ రంగాల వారికి చికాకులు తప్పవు. ప్రముఖులను కలుసుకుంటారు. సన్నిహితులతో కలసి సభలు, సమావేశాల్లో ప్రముఖంగా వ్యవహరిస్తారు. మీరెదురు చూస్తున్న అవకాశం అసంకల్పితంగా మీ చెంతకే వస్తుంది. ఉద్యోగస్తులు అధికారులతో సంభాషించేటప్పుడు మెళుకువ అవసరం.
 
మకరం :- బంధువుల రాకతో అనుకోని కొన్ని ఖర్చులు మీద పడతాయి. ముఖ్యమైన వ్యవహారాలు గోప్యంగా వుంచండి. ప్రేమికులకు కొత్త కొత్త ఆలోచనలు స్ఫురిస్తాయి. కోర్టు వ్యవహారాలలో ఇబ్బందులను ఎదుర్కుంటారు. విద్యార్థుల్లో కొత్త ఉత్సాహం చోటుచేసుకుంటుంది. భార్యా, భర్తల మధ్య విబేధాలు తలెత్తవచ్చు.
 
కుంభం :- స్టేషనరీ, ప్రింటింగ్ రంగాల వారికి సంతృప్తి, పురోభివృద్ధి కానవస్తుంది. ఉద్యోగస్తులు కొత్త బాధ్యతలను సమర్ధంగా నిర్వహిస్తారు. విద్యార్థులు వాహనం నడుపునపుడు జాగ్రత్త అవసరం. బ్యాంకింగ్ వ్యవహారాలలో అపరిచిత వ్యక్తులపట్ల మెళకువ అవసరం. కోర్టు వ్యవహారాల్లో ప్లీడర్లలకు జయం చేకూరుతుంది.
 
మీనం :- ఆర్థికంగా కొంత పురోగతి సాధిస్తారు. ఉద్యోగస్తులు ప్రమోషన్ విషయంలో ఆటంకాలు ఎదుర్కోవలసి వస్తుంది. వ్యాపారంలో పెరిగిన పోటీ వాతావరణం ఆందోళన కలిగిస్తుంది. ఆపద సమయంలో బంధువుల అండగా నిలుస్తారు. చేపట్టిన పనులు మొక్కుబడిగా పూర్తి చేస్తారు. సంఘంలో గుర్తింపు గౌరవం పొందుతారు.