మంగళవారం, 24 డిశెంబరు 2024
  1. ఆధ్యాత్మికం
  2. భవిష్యవాణి
  3. దినఫలం
Written By రామన్

16-03-2024 శనివారం దినఫలాలు - ప్రేమ వ్యవహరాల్లో మితంగా వ్యవహరించండి...

Astrology
శ్రీ శోభకృత్ నామ సం|| ఫాల్గుణ శు॥ సప్తమి రా.2.48 రోహిణి రా.9.09 ప.వ.1.15 ల 2.50
రా.వ.2.46 ల 4.23. ఉ.దు. 6.21 ల 7.55.
 
మేషం :- ఆర్థిక ఇబ్బందులు లేనప్పటికీ తెలియని అసంతృప్తి వెన్నాడుతుంది. మీ వాహనం ఇతరులకిచ్చి ఇబ్బందులకు గురవుతారు. గత కొంత కాలంగా వేధిస్తున్న సమస్యలు పరిష్కారమవుతాయి. స్త్రీలకు ఆధ్యాత్మిక చింతనతో పాటు ఇతర వ్యాపకాలు అధికమవుతాయి. ఉద్యోగస్తులకు ఇతరుల కారణంగా మాటపడక తప్పదు.
 
వృషభం :- విదేశీయాన యత్నాలు సఫలీకృతులౌతారు. మిత్రుల కలయికతో గత సంఘటనలు గుర్తుకు తెచ్చుకుంటారు. పాత రుణాలు తీరుస్తారు. స్త్రీలకు నూతన వస్తువుల పట్ల ఆసక్తి పెరుగుతుంది. దైవ కార్యాలకు విరాళాలు, సహకారం అందిస్తారు. మీ అంతరంగి సమస్యలు, కుటుంబ విషయాలు గోప్యంగా ఉంచండి.
 
మిథునం :- స్త్రీలకు నరాలు, ఎముకలు, దంతాలకు సంబంధించిన చికాకులు తప్పవు. కొత్తగా చేపట్టిన వ్యాపారాలు లాభదాయకంగా సాగుతాయి. బ్యాంకు వ్యవహారాలలో అపరిచిత వ్యక్తులపట్ల అవసరం. రిప్రజెంటేటివ్‌లు తమ టార్గెట్లను సునాయాసంగా అధికమిస్తారు. పెద్దల హితవు మీపై బాగా ప్రభావం చూపుతుంది.
 
కర్కాటకం :- ఏజెంట్లు, మార్కెటింగ్ రంగాల వారి శ్రమకు మంచి గుర్తింపు లభిస్తుంది. సోదరీ, సోదరుల మధ్య స్వల్ప చికాకులు, ఒత్తిడి, అభిప్రాయభేదాలు తలెత్తుతాయి. ప్రేమ వ్యవహరాల్లో మితంగా వ్యవహరించండి. స్త్రీలకు పనివారలతో చికాకులు వంటివి ఎదుర్కొంటారు. నిరుద్యోగులకు ఇంటర్వ్యూలలో జయం పొందుతారు.
 
సింహం :- ఒక స్థిరాస్తి అమర్చుకునే దిశగా మీ ఆలోచనలుంటాయి. నిరుద్యోగులు నిరుత్సాహం వీడి ఇంటర్వ్యూలకు హజరుకావడం మంచిది. మాట్లాడలేనిచోట మౌనం వహించడం మంచిది. మీ శ్రీమతి సూటిపోటి మాటలు అసహనం కలిగిస్తాయి. ప్రభుత్వ కార్యాలయాల్లో మీ పనులు మందకొడిగా సాగుతాయి. 
 
కన్య :- ఉద్యోగస్తులకు తొందరపాటు తనం వల్ల ఇబ్బందులు ఎదుర్కొంటారు. సన్నిహితులతో విందులు, వినోదాల్లో పాల్గొంటారు. ఇచ్చిపుచ్చుకునే వ్యవహారాలలో జాగ్రత్త వహించండి. మీ మంచితనమే మీకు శ్రీరామ రక్షగా ఉంటుంది. రియల్ ఎస్టేట్ రంగాల వారికి నూతన వెంచర్లు విషయంలో పునరాలోచన అవసరం.
 
తుల :- మీ శ్రీమతి నుంచి అందిన సమాచారం ఆందోళన కలిగిస్తుంది. ప్రింటింగు, స్టేషనరీ రంగాలలో వారికి పనిభారం అధికమవుతుంది. పెద్దమొత్తం నగదుతో ప్రయాణాలు క్షేమంకాదు. గృహంలో మార్పులు చేర్పులు వాయిదాపడుట వల్ల ఆందోళన చెందుతారు. ఆరోగ్యంలో స్వల్ప ఇబ్బందులు తలెత్తిన సమసిపోతాయి.
 
వృశ్చికం :- ఉపాధ్యాయులకు ఒత్తిడి, చికాకు తప్పదు. ఫర్నీచర్ అమరికలకు అవసరమైన నధులు సమకూర్చుకోవడంలో ఇబ్బందులు ఎదుర్కొంటారు. మీ సంతానం విజయం సంతోషం కలిగిస్తుంది. ప్రభుత్వ కార్యాలయాల్లో మీ పనులు సానుకూలమవుతాయి. హోటల్, కేటరింగ్ రంగాల్లో వారు పనివారితో ఇబ్బందులు ఎదుర్కొంటారు.
 
ధనస్సు :- ఎప్పటినుంచో వసూలుకాని మొండిబాకీలు వసూలువుతాయి. వృత్తి వ్యాపారాలు లాభాలబాటన పయనిస్తాయి. రవాణా రంగాలవారికి మెళకువ అవసరం. విద్యార్థులకు మిత్రబృందాలు, వ్యాపకాలు అధికం కాగలవు. మార్కెటింగ్ రంగాల్లో ఒత్తిడి పెరుగుతుంది. మీ ఆంతరంగిక విషయాలు గోప్యంగా ఉంచండి.
 
మకరం :- ప్రముఖుల కలయిక వల్ల సాధ్యపడదు. రాజకీయ, కళారంగాల్లో వారికి కలిసిరాగలదు. కాంట్రాక్టర్లకు పనివారలతో సమస్యలు అధికమవుతాయి. డాక్టర్లు శస్త్రచికిత్సలు విజయవంతంగా పూర్తిచేస్తారు. పాత వస్తువులను కొని ఇబ్బందులను ఎదుర్కొంటారు. సహోద్యోగులతో సమస్యలు తలెత్తినా నెమ్మదిగా సమసిపోతాయి.
 
కుంభం :- ధనం ఏమాత్రం నిల్వ చేయలేకపోవడం వల్ల ఆందోళనకు గురవుతారు. స్త్రీలలో నూతన ఉత్సాహం చోటుచేసుకుంటుంది. స్త్రీలకు అపరిచిత వ్యక్తుల విషయంలో మెళకువ అవసరం. గృహ ప్రశాంతతకు భంగం వాటిల్లే సూచనలున్నాయి. న్యాయవాదులు, ప్రముఖులతో సంప్రదింపులు జరుపుతారు.
 
మీనం :- చేపట్టిన పనులు వాయిదా పడతాయి. పాతమిత్రుల కలయిక సంతృప్తినిస్తుంది. ఉమ్మడి వ్యాపారాల పట్ల ఏకాగ్రత అవసరం. మీ శ్రీమతి సూటిపోటి మాటలు అసహనం కలిగిస్తాయి. వృత్తి ఉద్యోగాల్లో బాధ్యతాయుతంగా వ్యవహరిస్తారు. ప్రేమికులకు తొందరపాటు నిర్ణయాలు సమస్యలకు దారితీస్తాయి.