గురువారం, 9 జనవరి 2025
  1. ఆధ్యాత్మికం
  2. భవిష్యవాణి
  3. దినఫలం
Written By రామన్

11-03-2024 సోమవారం దినఫలాలు - విదేశీ వస్తువుల పట్ల ఆకర్షితులౌతారు...

astro11
శ్రీ శోభకృత్ నామ సం|| ఫాల్గుణ శు॥ పాఢ్యమి ప.1.06 ఉత్తరాభాద్ర రా.2.08 ప.వ.12.42 ల 2.11. ప.దు. 12.35 ల 1.22 పు.దు.2.55 ల 3.42.
 
మేషం :- సాహిత్య సదస్సులలోను, బృంద కార్యక్రమాల్లోనూ పాల్గొంటారు. ఉద్యోగస్తులకు పనిభారం అధికమవుతుంది. సోదరీ, సోదరులతో సత్సంబంధాలు నెలకొంటాయి. స్త్రీలకు అకాల భోజనం, శారీరక శ్రమ వల్ల ఆరోగ్యం మందగిస్తుంది. విదేశీ వస్తువుల పట్ల ఆకర్షితులౌతారు. రుణయత్నాలు, చేబదుళ్ళుతప్పవు. 
 
వృషభం :- దైవ సేవా కార్యక్రమాలకు ధనం అధికంగా వెచ్చిస్తారు. రాజకీయాలలో వారికి మంచి గుర్తింపు, రాణింపు లభిస్తుంది. వ్యాపారాల్లో నష్టాలను భర్తీ చేసుకోవటంతో పాటు మెరుగైన ఫలితాలు సాధిస్తారు. విద్యార్థులు ఉన్నత చదువుల గురించి ఒక నిర్ణయానికి వస్తారు. ప్రయాణాలు, బ్యాంకు వ్యవహారాలలో మెళకువ అవసరం.
 
మిథునం :- కంప్యూటర్ రంగాల వారికి చికాకులు తప్పవు. వృత్తిరీత్యా ప్రముఖులను కలుసుకుంటారు. దైవ కార్యక్రమాల పట్ల ఒత్తిడి, చికాకులను ఎదుర్కుంటారు. గత విషయాలు జ్ఞప్తికి రాగలవు. వాహనం ఇతరులకిచ్చే విషయంలో లౌక్యంగా వ్యవహరించండి. కోర్టు వ్యవహారాలు ఒక కొలిక్కి వచ్చే సూచనలున్నాయి.
 
కర్కాటకం :- గృహానికి సంబంధించిన వస్తువులు కొనుగోలు చేస్తారు. చేతి వృత్తు, వ్యాపార రంగాలవారికి అన్ని విధాలా కలిసిరాగలదు. స్వయం కృషితో అభివృద్ధి చెందుతారు. సోదరులతో ఉత్తరప్రత్యుత్తరాలు సంతృప్తిగా సాగుతాయి. విద్యుత్, ఎలక్ట్రానికల్, ఇన్వెర్టెర్ వ్యాపారస్తులకు పురోభివృద్ధి. చిత్రమైన సంఘటనలు ఎదురవుతాయి.
 
సింహం :- మిమ్మల్ని పొగడేవారే కానీ సహకరించే వారుండరన్న వాస్తవం గ్రహించండి. వాహనం నడుపునపుడు మెళుకువ అవసరం. కొత్త వ్యక్తులతో పరిచయాలు మీ ఉన్నతికి నాందీ పలుకుతాయి. విద్యార్థుల్లో భయాందోళనలు తొలగి మానసికంగా కుదుటపడతారు. గృహ మరమ్మత్తులు మందకొడిగా సాగుతాయి.
 
కన్య :- ప్రింటింగ్, స్టేషనరీ రంగంలోని వారికి పని భారం పెరుగుతుంది. విద్యుత్, ఎలక్ట్రానికల్, ఇన్వెర్టర్ వ్యాపారస్తులకు పురోభివృద్ధి. స్త్రీలు వస్త్రాలు, గృహోపకరణాలు సమకూర్చుకుంటారు. ఉద్యోగస్తులకు పనిలో అంచనాలు తారుమారు కావచ్చు. పెద్దమొత్తం ధనం, విలువైన వస్తువులతో ప్రయాణం క్షేమం కాదు.
 
తుల :- పుణ్యక్షేత్రాల దర్శనం వల్ల మానసిక ప్రశాంతత చేకూరుతుంది. పెద్దల ఆరోగ్యం గురించి ఆందోళన చెందుతారు. శాంతి యుతంగా వ్యవహరిస్తే మీ సమస్యలు సానుకూలమవుతాయి. వస్త్ర, బంగారు వ్యాపారులు పనివారలను ఓ కంట కనిపెట్టటం మంచిది. మీ వాహనం ఇతరులకిచ్చి ఇబ్బందులకు గురవుతారు.
 
వృశ్చికం :- కాంట్రాక్టర్లు నిర్మాణ పనులలో జాప్యం, పనివారలతో సమస్యలను ఎదుర్కొంటారు. వ్యాపారాలు, ఉపాధి పథకాలు సంతృప్తినిస్తాయి. స్త్రీలకు షాపింగ్ వ్యవహారాలలో మెళకువ అవసరం. మీ కళత్ర మొండివైఖరి మీకు ఎంతో చికాకు కలిగిస్తుంది. ఒక స్థిరాస్తి విక్రయించాలనే ఆలోచన స్ఫురిస్తుంది.
 
ధనస్సు :- వృత్తులు, క్యాటరింగ్ పనివారలకు సంతృప్తి, పురోభివృద్ధి. స్త్రీలకు షాపింగ్ వ్యవహారాలలో ఏకాగ్రత, మెళకువ అవసరం. బంధువుల రాకతో ఖర్చులు అధికమవుతాయి. పోస్టల్, కొరియర్ రంగాలవారికి ఒత్తిడి, తిప్పట అధికమవుతాయి. నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి. సద్వినియోగం చేసుకొండి.
 
మకరం :- వృత్తుల వారికి ప్రముఖులతో సంబంధాలు ఏర్పడతాయి. మీయత్నాలకు మీ శ్రీమతి నుంచి అన్ని విధాలా ప్రోత్సాహం లభిస్తుంది. వాహనం నడుపుతున్నపుడు ఏకాగ్రత చాలా అవసరం. భాగస్వామిక చర్చలు, వాణిజ్య ఒప్పందాల్లో ఏకాగ్రత అవసరం. నిరుద్యోగులు పోటీ పరీక్షలలో ఏకాగ్రత వహించిన సత్ఫలితాలు పొందుతారు.
 
కుంభం :- పత్రికా సిబ్బందికి వార్తల ప్రచురణలో పునరాలోచన మంచిది. ఉద్యోగస్తులకు పై అధికారులు నుంచి ఒత్తిడి, చికాకులను ఎదుర్కొంటారు. ఉపాధ్యాయులకు, మార్కెట్ రంగాల వారికి ఒత్తిడి, తిప్పట అధికం. మీ శ్రీమతికి మినహా ఇతరులకు తెలియనీయకండి. మీ సంతానం కోసం ధనం అధికంగా ఖర్చు చేస్తారు.
 
మీనం :- వీలైనంత వరకూ మీ పనులు మీరే చూసుకోవటం ఉత్తమం. ఇతరులతో అతిగా మాట్లాడటం మీ శ్రీమతికి నచ్చకపోవచ్చు. వ్యాపారాల్లో పోటీతత్వం ఆందోళన కలిగిస్తుంది. నిరుద్యోగులు బోగస్ ప్రకటనల వల్ల మోసపోయే ఆస్కారం ఉంది. మీరు అభిమానించే వ్యక్తుల ఆరోగ్యం ఆందోళన కలిగిస్తుంది.