శ్రీ శోభకృత్ నామ సం|| మాఘ ఐ|| చతుర్ధశి సా.5.56 ధనిష్ట ఉ.7.06 శతభిషం తె.5.28
ప. వ. 1. 48 ల 3. 17. ఉ.దు. 6.21 ల 7.55.
మేషం :- ఉద్యోగస్తులు పై అధికారులతో మితంగా సంభాషించటం మంచిది. చిట్స్, ఫైనాన్సు రంగాల వారికి ఒత్తిడి పెరుగుతుంది. ప్రయాణాలు, తీర్థయాత్రలు అనుకూలిస్తాయి. అప్రయత్నంగా ఒక వ్యవహారం మీకు అనుకూలిస్తుంది. మీ సంతానం మొండివైఖరి మీకు ఎంతో చికాకు కలిగిస్తుంది. పొదుపు ఆవశ్యకతను గుర్తిస్తారు.
వృషభం :- వస్త్ర, బంగారు, ఫ్యాన్సీ, గృహోపకరణ వ్యాపారులకు పురోభివృద్ధి కానవస్తుంది. విద్యార్థులకు వాహనం నడుపునపుడు జాగ్రత్త అవసరం. నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి. ప్రయాణాలు అనుకూలిస్తాయి. వాతావరణంలోని మార్పు వ్యవసాయ, తోటల రంగాల వారికి సంతోషం కలిగిస్తుంది.
మిథునం :- నిరుద్యోగులకు కొత్త కొత్త ఆలోచనలు స్ఫురిస్తాయి. ద్విచక్ర వాహనంపై దూర ప్రయాణం క్షేమంకాదు. నూతన వ్యాపారాలు, కొత్తగా తీసుకున్న ఏజన్సీలలో క్రమంగా నిలదొక్కుకుంటారు. విలువైన వస్తువులు అమర్చుకోవాలనే మీ కోరిక వాయిదా పడుతుంది. షేర్లు క్రయ విక్రయాలు సంతృప్తికరంగా సాగుతాయి.
కర్కాటకం :- వస్త్ర, బంగారం, ఫ్యాన్సీ వ్యాపారులకు ఆశించినంత పురోభివృద్ధి ఉండదు. నిరుద్యోగులకు ఇంటర్వ్యూ సమాచారం అందుతుంది. స్త్రీలకు నూతన పరిచయాలు, వ్యాపకాలు అధికమవుతాయి. సంతానానికి విదేశాల్లో విద్యావకాశాలు లభిస్తాయి. సహోద్యోగుల సహకారంతో పెండింగ్ పనులు పూర్తి చేస్తారు.
సింహం :- ప్రింటింగ్ రంగాల వారికి సదావకాశాలు లభిస్తాయి. బ్యాంకు వ్యవహారాలలో ఒత్తిడి, చికాకులను ఎదుర్కొంటారు. ఉత్తర ప్రత్యుత్తరాలు సంతృప్తికరంగా సాగుతాయి. వాహనం ఇతరులకు ఇచ్చి ఇబ్బందులను ఎదుర్కొంటారు. బంధుమిత్రులను కలుసుకుంటారు. పెద్దల ఆర్యోగం గురించి ఆందోళన చెందుతారు.
కన్య :- వృత్తి ఉపాధి పథకాలు అంతంత మాత్రంగా సాగుతాయి. పుణ్యక్షేత్ర సందర్శనకు యత్నాలు సాగిస్తారు. మొండి బాకీలు వసూలు చేయగలుగుతారు. మీ కార్యక్రమాలు, ప్రయాణం వాయిదా వేసుకోవలసి వస్తుంది. నచ్చకపోయినా కొన్ని విషయాల్లో సర్దుకుపోవాలి. స్పెక్యులేషన్ రంగాల వారికి సామాన్యం.
తుల :- మీ కుటుంబీకుల ఆరోగ్యం విషయంలో మెళకువ వహిచండి. నిరుద్యోగులకు అప్రయత్నంగా అవకాశం కలిసివస్తుంది. విద్యార్థులకు అత్యుత్సాహం తగదు. భాగస్వామిక వ్యాపారాల్లో కొత్తవారిని చేర్చుకునే విషయంలో పునరాలోచన అవసరం. దూర ప్రయాణాలలో అపరిచిత వ్యక్తులపట్ల మెళకువ అవసరం.
వృశ్చికం :- సోదరుల మధ్య ఒక అవగాహన ఏర్పడుతుంది. ఖర్చుల విషయంలో ప్రణాళికాబద్దంగా వ్యవహరిస్తారు. విదేశీ ప్రయాణాల పట్ల ఆసక్తి పెరుగుతుంది. పెద్దమొత్తం స్టాక్ నిల్వలో హోల్‌సేల్స్ వ్యాపారులు అప్రమత్తంగా ఉండాలి. కోర్టు వ్యవహారాలు మందకొడిగా సాగుతాయి. దైవకార్యాలు, సమావేశాల్లో పాల్గొంటారు.
ధనస్సు :- రాజకీయాల్లో వారికి అనుకోని మార్పు కానరాగలదు. చిన్ననాటి వ్యక్తుల కలయికతో గత అనుభవాలు జ్ఞప్తికి వస్తాయి. రోజువారీ ఖర్చులే అధికంగా ఉంటాయి. ఊహించని వ్యక్తుల నుండి అందిన ఒక సమాచారం మిమ్ములను ఎంతగానో ఆశ్చర్యపరుస్తుంది. స్త్రీలకు బంధువుల రాక వల్ల పనులు వాయిదాపడతాయి.
మకరం :- మీ కళత్ర మొండి వైఖరి మీకెంతో ఆందోళన కలిగిస్తుంది. శస్త్ర చికిత్సల సమయంలో వైద్యులకు ఏకాగ్రత, ఓర్పు ఎంతో అవసరం. ఖర్చులు పెరిగినా ఆర్థిక వెసులుబాటు ఉంటుంది. ప్రైవేటు సంస్థలలోని వారికి మార్పులు అనుకూలం. స్త్రీల కళాత్మతకు, నైపుణ్యతకు మంచి గుర్తింపు, ప్రోత్సాహంలభిస్తాయి.
కుంభం :- బ్యాంకింగ్ రంగాల్లో వారికి ఒత్తిడి, చికాకులు తప్పదు. ధనవ్యయం, రుణసహాయం విషయంలో పునరాలోచన అవసరం. పత్రికా, ప్రైవేటు సంస్థలలోని వారికి మార్పులు అనుకూలించవు. విద్యార్థినుల ఆలోచనలు పక్కదారి పట్టే ఆస్కారం ఉంది. పెద్దమొత్తం ధనసహాయం చేసే విషయంలో లౌక్యంగా ఉండాలి.
మీనం :- బంధువుల రాకతో గృహంలో సందడి కానవచ్చును. కొబ్బరి, పండు, పూలు, కూరగాలు, చిరు వ్యాపారులకు లాభదాయకంగా ఉంటుంది. నిరుద్యోగులకు రాత, మౌఖిక పరీక్షలలో ఏకాగ్రత ముఖ్యం. సోదరీ, సోదరులతో ఏకీభవించలేక పోతారు. ధనం బాగా అందుట వలన ఏ కొంతైనా నిల్వచేయగలుగుతారు.