మంగళవారం, 24 డిశెంబరు 2024
  1. ఆధ్యాత్మికం
  2. భవిష్యవాణి
  3. దినఫలం
Written By రామన్

12-03-2024 మంగళవారం దినఫలాలు - గట్టిగా ప్రయత్నిస్తే మొండిబాకీలు వసూలవుతాయి...

astro12
శ్రీ శోభకృత్ నామ సం|| ఫాల్గుణ శు|| విదియ ఉ.10.49 రేవతి రా.12.38 ప.వ.1.22 ల 2.52.
ఉ.దు. 8.40 ల 9.27 రా.దు. 10.57 ల 11.46.
 
మేషం :- మీ సంతానం చేయుపనులు మీకెంతో చికాకులు కలిగిస్తాయి. విద్యార్థులకు ఒత్తిడి, చికాకులు అధికమైనా సంతృప్తి కానవస్తుంది. దస్త్రం విషయమై ప్రముఖులతో సంప్రదింపులు జరుపుతారు. శ్రీవారు, శ్రీమతి వైఖరిలో మార్పు గమనిస్తారు. మీ వ్యక్తిగత విషయాలు బయటకు తెలియకుండా గోప్యంగా వుంచండి.
 
వృషభం :- ఉద్యోగస్తులు అపరిచిత వ్యక్తులతో మెళకువ అవసరం. మీ శ్రమకు తగిన గుర్తింపు, ప్రతిఫలం పొందుతారు. ఎవరికైనా ధన సహాయం చేసినా తిరిగిరాజాలదు. వ్యాపారుల ఆలోచనలు దస్త్రం దిశగా సాగుతాయి. గట్టిగా ప్రయత్నిస్తే మొండిబాకీలు వసూలు కాగలవు. విద్యార్థులకు హడావుడి, తొందరపాటు తగదు. 
 
మిథునం :- సభలు, సమావేశాలలో హుందాగా వ్యవహరించి అందరినీ ఆకట్టుకుంటారు. కోర్టు వ్యవహారాలు వాయిదాలకు వస్తాయి. సొంతంగా ఏదైనా వ్యాపారం చేయాలనే మీ ఆలోచన అమలులో పెడతారు. విద్యార్థులకు హడావుడి, తొందరపాటు తగదు. పెట్టిపోతలు, ఇచ్చిపుచ్చుకునే వ్యవహారాలు సానుకూలమవుతాయి. 
 
కర్కాటకం :- ఉన్నతాధికారులకు ప్రభుత్వం నుంచి ఒత్తిడి, తరచూ పర్యటనలు తప్పవు. టెక్నికల్, ఎలక్ట్రానిక్, కంప్యూటర్ రంగాల్లో వారికి ఒత్తిడి తప్పదు. పండ్లు, పూలు, చిరు వ్యాపారులకు లాభదాయకంగా ఉంటుంది. ఊహించని ఖర్చులు మీ అంచనాలు దాటిన మిత్రుల సహాయ సహకారాల వలన సమసిపోగలవు.
 
సింహం :- ఇతరుల మాటలు విని మీ సహజమైన మీ ఆలోచనాధోరణిని మార్చుకుంటారు. ఉద్యోగస్తులు పై అధికారులతో సంభాషించునపుడు మెళకువ అవసరం. ద్విచక్రవాహనం పై దూరప్రయాణాలు మంచిది కాదు అని గమనించండి. ఉపాధ్యాయులకు విద్యార్థుల వల్ల సమస్యలు తలెత్తే ఆస్కారం ఉంది జాగ్రత్త వహించండి.
 
కన్య :- ఆర్థిక ఒడిదుడుకులు తలెత్తిన నెమ్మదిగా సమసిపోగలవు. వ్యాపారంలో ఎంతో పక్కగా వేసుకున్న ప్రణాళికలు విఫలమవుతాయి. మీ కళత్ర మొండివైఖరి మీకు ఎంతో ఆందోళన కలిగిస్తుంది. కొన్ని విషయాలు మరచిపోదామనుకున్నా సాధ్యం కాదు. పత్రికా సిబ్బందికి వార్తల ప్రచురణలో పునరాలోచన మంచిది.
 
తుల :- గృహంలో మార్పులు, చేర్పులు అనుకూలిస్తాయి. ఉద్యోగస్తులకు ఏకాగ్రత లోపం వల్ల పై అధికారులతో మాటపడవలసి వస్తుంది. ఎలక్ట్రికల్, ఎలక్ట్రానికల్, కంప్యూటర్, ఇన్వర్టర్, ఏ.సి మెకానికల్ రంగాల వారికి సదావకాశాలు లభిస్తాయి. స్త్రీలకు తల, కాళ్ళు, నరాలుకి సంబంధించిన చికాకులు అధికమవుతాయి.
 
వృశ్చికం :- పత్రిక, ప్రైవేటు సంస్థలలోని వారికి మార్పులు అనుకూలిస్తాయి. స్త్రీలకు ఆరోగ్యపరమైన సమస్యలు తలెత్తుతాయి. చిన్న చిన్న రోడ్డు ప్రమాదాలు జరుగవచ్చు జాగ్రత్త వహించండి. తలపెట్టిన పనులు మందకొడిగా సాగుతాయి. రియల్ ఎస్టేట్ రంగాల వారికి మిశ్రమ ఫలితం. అతిథి మర్యాదలు బాగుగా నిర్వహిస్తారు.
 
ధనస్సు :- డాక్టర్లు శస్త్రచికిత్సలు విజయవంతంగా పూర్తిచేస్తారు. ఖర్చులు అధికం కావడంతో రుణాలు, చేబదుళ్ళు తప్పవు. స్టేషనరీ, ప్రింటింగ్ రంగాలలో వారికి సంతృప్తి, అభివృద్ధి కానవస్తుంది. వీలైనంత వరకూ మీ పనులు మీరే చూసుకోవటం ఉత్తమం. విద్యార్థునులు ప్రేమ వ్యవహారాలకు దూరంగా ఉండటం మంచిది.
 
మకరం :- ఏదైనా అమ్మకానికి చేయుప్రయత్నాలు వాయిదా పడుటమంచిది. ప్రముఖుల కలయిక ప్రయోజనకరంగా ఉంటుంది. బ్యాంకు వ్యవహారాలు అనుకూలిస్తాయి. విదేశీయానం కోసం చేసే యత్నాలకు అడ్డంకులు తొలగిపోగలవు. నిరుద్యోగులకు మధ్యవర్తుల పట్ల అప్రమత్తత అవసరం. ప్రయాణాల లక్ష్యం నెరవేరుతుంది.
 
కుంభం :- ఆర్థిక విషయాలలో ఒక అడుగు ముందుకు వేస్తారు. ఉద్యోగస్తులు తొందరపడి సంభాషించడం వల్ల ఇబ్బందులు ఎదుర్కొనక తప్పదు. కుటుంబీకుల మధ్య పరస్పర అవగాహన లోపం, చికాకులు అధికమవుతాయి. రాజకీయనాయకులు సభలు, సమావేశాలలో హుందాగా వ్యవహరించి అందరినీ ఆకట్టుకుంటారు.
 
మీనం :- ఆడిటర్లకు ఆకౌంట్స్ రంగాల వారికి పనిభారం అధికమవుతుంది. ప్రియమైన వ్యక్తుల కలయికతో మానసికంగా కుదుటపడతారు. ప్రైవేట్, రిప్రజెంటేటివ్ సంస్థలలోని వారు మార్పులకై చేయుయత్నాలు వాయిదా పడతాయి. నిరుద్యోగులు ఇంటర్వ్యూల్లో ఏకాగ్రత వహించిన సత్ఫలితాలు లభిస్తాయి.