గురువారం, 9 జనవరి 2025
  1. ఆధ్యాత్మికం
  2. భవిష్యవాణి
  3. దినఫలం
Written By రామన్

14-03-2024 గురువారం దినఫలాలు - నిరుద్యోగులు శుభవార్తలను అందుతాయి...

Rishabham
శ్రీ శోభకృత్ నామ సం|| ఫాల్గుణ శు॥ చవితి ఉ.6.38 పంచమి తె.5.02 భరణి రా.10. 15 ఉ.వ.8.29 ల 10.00. ఉ. దు. 10. 13 ల 11.00 ప.దు. 2.55 ల 3.42.
 
మేషం :- పత్రిక, ప్రైవేటు సంస్థలలోని వారిలో నూతన ఆలోచనలు స్ఫురిస్తాయి. కోర్టు వ్యవహారాలు ఆశించినంత చురుకుగా సాగవు. శ్రీవారు, శ్రీమతి వైఖరి ఉల్లాసం కలిగిస్తుంది. ఓర్పు, పట్టుదలతో శ్రమించినగాని ఫలితం దక్కుతుంది. నిరుద్యోగులు శుభవార్తలను అందుతాయి. దూరప్రయాణాలలో కొత్త పరిచయాలు ఏర్పడతాయి. 
 
వృషభం :- బాకీలు, ఇంటి అద్దెల వసూలులో సంయమనం పాటించండి. అంతగా పరిచయం లేని వ్యక్తులతో మితంగా సంభాషించండి. గత కొంత కాలంగా వేధిస్తున్న సమస్యలు, ఇబ్బందులు పరిష్కారంకాగలవు. మీ ప్రసంగాలు శ్రోతలను ఆకట్టుకుంటాయి. ఫిక్సెడ్ డిపాజిట్లు, ఇతరత్రా రావలసిన ధనం అందుకుంటారు. 
 
మిథునం :- మీ విరోధులు వేసే పథకాలు మీకు ఎంతో ఆందోళన కలిగిస్తాయి. ఉద్యోగస్తులకు ఓర్పు, నేర్పు చాలా అవసరం. ప్రింటింగ్ంగాల వారికి బకాయిల వసూళ్ళలో శ్రమాధిక్యత, ప్రయాసలు తప్పవు. కుటుంబ సౌఖ్యం కొంత తక్కువని చెప్పవచ్చు. నిరుద్యోగులు శుభవార్తలను అందుతాయి.
 
కర్కాటకం :- ఆర్థిక సమస్యలు తొలగి రుణ విముక్తులు కాగలరు. ప్రింటింగ్ రంగాల వారికి, నిరుద్యోగులకు సదావకాశాలు లభిస్తాయి. స్త్రీలకు అయిన వారి నుంచి ఆశ్చర్యకరమైన సమాచారం అందుతుంది. ఉద్యోగస్తులకు పై అధికారుల నుంచి ఒత్తిడి, చికాకులను ఎదుర్కొంటారు. దైవ, సేవ, పుణ్య కార్యాల్లో పాల్గొంటారు.
 
సింహం :- పచారీ, వస్త్ర, ఫ్యాన్సీ, చిరు వ్యాపారులకు లాభదాయకంగా ఉంటుంది. సర్టిఫికెట్లు, హాల్ టిక్కెట్ల విషయంలో విద్యార్థులు జాగ్రత్తగా ఉండాలి. సభలు, సమావేశాల్లో ప్రముఖంగా వ్యవహరిస్తారు. చిన్ననాటి వ్యక్తుల కలయికతో గత అనుభవాలు జ్ఞప్తికి వస్తాయి. ఉపాధ్యాయులతో విద్యార్థులు ఏకీభవించలేకపోతారు.
 
కన్య :- వ్యాపారాల్లో కొత్త కొత్త స్కీములతో కొనుగోలుదార్లను ఆకట్టుకుంటారు. రుణం ఏ కొంతైనా తీర్చాలన్న మీ యత్నం నెరవేరగలదు. బంధుమిత్రులతో కలిసి విందు, వినోదాలలో పాల్గొంటారు. సినిమా, విద్య, సౌంస్కృతిక కార్యక్రమాల పట్ల ఏకాగ్రత వహిస్తారు. ప్రత్యర్థుల ఎత్తుగడలను సమర్ధంగా ఎదుర్కుంటారు.
 
తుల :- భాగస్వామిక వ్యాపారాలు, జాయింట్ వెంచర్లకు లాభదాయకం. ఉపాధ్యాయులకు ఆర్థిక ప్రగతితో కూడిన అవకాశాలు లభిస్తాయి. శ్రీవారు, శ్రీమతి గౌరవ ప్రతిష్ఠలకు భంగం కలిగించే పరిణామాలు ఎదుర్కొంటారు. సమయానుకూలంగా మీ కార్యక్రమాలు, పనులు వాయిదా వేసుకోవలసి వస్తుంది.
 
వృశ్చికం :- విద్యుత్, ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్ రంగాల్లో వారికి చికాకులు తప్పవు. విద్యార్థులు అత్యుత్సాహాన్ని అదుపులో ఉంచుకోవటం క్షేమదాయం. మీ పొదుపరితనం కుటుంబీకులకు ఒత్తిడి, చికాకు కలిగిస్తుంది. వస్త్ర, బంగారు, వెండి, లోహ వ్యాపారస్తులకు శ్రమాధిక్యత కానవచ్చిన సత్ఫలితాలు పొందగులుగుతారు.
 
ధనస్సు :- తలపెట్టిన పనులు వాయిదా పడే సూచనలు కలవు. నూతన రుణాల కోసం అన్వేషిస్తారు. నిరుద్యోగులకు తాత్కాలిక అవకాశాలు లభిస్తాయి. స్త్రీలకు బంధువర్గాల నుంచి ఆహ్వానాలు అందుతాయి. బ్యాంకింగ్, చిట్స్ రంగాల వారికి ఒత్తిడి, పనిభారం అధికమవుతుంది. ఉద్యోగస్తులకు పై అధికారులతో ఒత్తిడి, చికాకులు తప్పవు.
 
మకరం :- రాజకీయ నాయకులకు ప్రయాణాలలో మెళకువ అవసరం. పొదుపు పథకాలు, స్థిరాస్తి కొనుగోలు దిశగా మీ ఆలోచనలుంటాయి. దంపతుల మధ్య అభిప్రాయభేదాలు తలెత్తుతాయి. ఉద్యోగస్తుల హోదా పెరిగే సూచనలున్నాయి. ఆకస్మికంగా బిల్లులు చెల్లిస్తారు. తలవని తలంపుగా వాహనం సౌఖ్యం పొందుతారు.
 
కుంభం :- చేపట్టిన పనులు పూర్తి కాక విసుగు కలిగిస్తాయి. స్త్రీలకు తమ మాటే నెగ్గాలన్న పట్టుదల అధికమవుతుంది. పరిశ్రమలు, సంస్థలకు కావలసిన లైసెన్సులు, పర్మిట్లు మంజూరు కాగలవు. కోర్టు వ్యవహారాల్లో ప్లీడర్లకు మంచి గుర్తింపు రాణింపు లభిస్తుంది. విద్యార్థుల్లో ఏకాగ్రత, మనోధైర్యం నెలకొంటాయి.
 
మీనం :- నూతన వ్యాపారాలు అనుకూలిస్తాయి. కపటంలేని మీ ఆలోచనలు, సలహాలు మీకు అభిమానుల్ని సంపాదించిపెడుతుంది. కోర్టు వాదోపవాదాల్లో ప్లీడర్లకు గుర్తింపు, ఆదాయం లభిస్తాయి. పుణ్యక్షేత్రాల దర్శనం వల్ల మానసిక ప్రశాంతత చేకూరుతుంది. పెద్ద హోదాలో ఉన్న వారికి అధికారిక పర్యటనలు అధికమవుతాయి.