సోమవారం, 23 డిశెంబరు 2024
  1. ఆధ్యాత్మికం
  2. భవిష్యవాణి
  3. దినఫలం
Written By రామన్
Last Updated : బుధవారం, 27 మార్చి 2024 (09:12 IST)

27-03-2024 బుధవారం దినఫలాలు - ఎవరినీ అతిగా విశ్వసించటం మంచిది కాదు...

astro3
శ్రీ శోభకృత్ నామ సం|| ఫాల్గుణ ఐ|| విదియ ప.3.10 చిత్త ప.2.39 రా.వ.8.40 ల 10.24. ప. దు. 11.48 ల 12.34.
 
మేషం :- ఆస్తి పంపకాల విషయంలో కుటుంబీకులతో ఒక ఒప్పందం కుదుర్చుకుంటారు. ఒక వేడుకను ఘనంగా చేయటానికి సన్నాహాలు మొదలెడతారు. దంపతులకు ఏ విషయంలోను పొత్తు కుదరదు. ఎవరినీ అతిగా విశ్వసించటం మంచిది కాదు. కోర్టు వ్యవహారాల్లో ప్లీడర్ల ధోరణి చికాకు, ఆందోళన కలిగిస్తుంది.
 
వృషభం :- దైవ సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు. విద్యార్థులకు హడావుడి, తొందరపాటు తగదు. కోర్టు వ్యవహారాలు మీరు కోరుకున్నట్టుగానే వాయిదా పడతతాయి. మీ అభిరుచులకు తగిన విధంగా కుటుంబసభ్యులు మసలుకుంటారు. మీ బంధువులను సహాయం అర్థించే బదులు మీరే ప్రత్యామ్నాయం చూసుకోవటం ఉత్తమం.
 
మిథునం :- ఆర్థికలావాదేవీలు, మధ్యవర్తిత్వాలు సమర్థంగా నిర్వహిస్తారు. పాత మిత్రుల ద్వారా ఆసక్తికరమైన విషయాలు గ్రహిస్తారు. పెద్దల ఆరోగ్యం గురించి ఆందోళన చెందుతారు. మీ ఉన్నతిని చూచి అసూయపడేవారు అధికమవుతున్నారని గమనించండి. ఉద్యోగస్తులకు ప్రమోషన్లతో కూడిన బదిలీలుంటాయి.
 
కర్కాటకం :- కొబ్బరి, పండ్లు, పూలు, పానీయ వ్యాపారులకు లాభదాయకం. ఎదుటివారితో ముక్తసరిగా సంభాషిస్తారు. సన్నిహితుల మాటలు మీపై మంచి ప్రభావం చూపుతాయి. షామియాన, సప్లయ్ రంగాలలో వారికి గణనీయమైన పురోభివృద్ధి. ప్రముఖుల కోసంధనం బాగుగా వెచ్చిస్తారు. సోదరీ, సోదరులతో విమర్శలు తలెత్తుతాయి.
 
సింహం :- వస్త్ర వ్యాపారులు పనివారలను ఓ కంట కనిపెట్టుకుని ఉండటం శ్రేయస్కరం. వ్యాపారాభివృద్ధికి మరింతగా శ్రమించాల్సి ఉంటుంది. ఉద్యోగస్తుల సమర్థతను అధికారులు గుర్తిస్తారు. మీ అంచనాలు, ప్రణాళికలు ఫలిస్తాయి. కొత్త యత్నాలు మొదలెడతారు. మీ సంతానం విద్యా విషయాలు సంతృప్తినిస్తాయి.
 
కన్య :- పారిశ్రామిక రంగాల వారికి కార్మికులతో సమస్యలు తప్పవు. శారీరక శ్రమ, మానసిక ఒత్తిడి వల్ల స్వల్ప అస్వస్థతకు గురవుతారు. డాక్టర్లు శస్త్రచికిత్సలు విజయవంతంగా పూర్తిచేస్తారు. ఇసుక, క్వారీల వేలం పాటల్లో ఏకాగ్రత అవసరం. కొంతమంది మీ ఆలోచనలు తప్పుదారి పట్టించే ఆస్కారం ఉంది.
 
తుల :- పత్రికా సిబ్బందికి వార్తల ప్రచురణలో పునరాలోచన మంచిది. ఆకస్మికంగా ప్రయాణం చేయవలసివస్తుంది. నిరుద్యోగులు వచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకుంటారు. దంపతుల మధ్య అనురాగ వాత్సల్యాలు పెంపొందుతాయి. చిట్స్, ఫైనాన్సు సంస్థల వారికి ఊహించని చికాకు లెదురవుతాయి.
 
వృశ్చికం :- స్త్రీలకు ఏ విషయంలోను ఆసక్తి ఉండదు. ఉద్యోగస్తులు ఒత్తిడి, ప్రలోభాలకు దూరంగా ఉండటం క్షేమదాయకం. వీలైనంత వరకూ మీ పనులు మీరే చూసుకోవటం ఉత్తమం. కావలసిన వ్యక్తులకలయిక అనుకూలించకపోవటంతో ఒకింత నిరుత్సాహం చెందుతారు. నిరుద్యోగులకు ఇంటర్వ్యూ లేఖలు అందుతాయి.
 
ధనస్సు :- సొంతంగా గృహం ఏర్పరుచుకోవాలనే ఆలోచన బలపడుతుంది. రుణ సమస్యలు, అనారోగ్యం నుంచి విముక్తి లభిస్తుంది. సభలు, సమావేశాలలో హుందాగా వ్యవహరించి అందరినీ ఆకట్టుకుంటారు. అగ్రిమెంట్లు, బ్యాంకింగ్ వ్యవహరాలలో ఏకాగ్రత వహించండి. మానసిక ప్రశాంతత, దాంపత్య సుఖం పొందుతారు.
 
మకరం :- మీ విలువైన వస్తువులు, వాహనం ఇతరులకిచ్చే విషయంలో లౌక్యంగా వ్యవహరిచండి. వ్యాపారాల అభివృద్ధికి చేపట్టిన పథకాలు మంచి ఫలితాలనిస్తాయి. పెద్దల సలహాను పాటించి మీ గౌరవాన్ని నిలబెట్టుకుంటారు. చేతివృత్తుల వారికి శ్రమాధిక్యత మినహా ప్రతిఫలం ఆశించినంతగా ఉండదు.
 
కుంభం :- ఇసుక కాంట్రాక్టర్లకు ఊహించని ఆటంకాలెదురవుతాయి. కొన్ని అవకాశాలు మీ విలువైన వస్తువులు, వాహనం ఇతరులకిచ్చే విషయంలో లౌక్యంగా వ్యవహరిచండి. బ్యాంకు వ్యవహారాలలో పరిచయం లేని వ్యక్తులతో మితంగా సంభాషించండి. ఇళ్ల స్థలాలు, పొలాల క్రయ విక్రయాలకు అనుకూలం.
 
మీనం :- నిరుద్యోగులు పోటీ పరీక్షలు, ఇంటర్వ్యూల్లో విజయం సాధిస్తారు. కుటుంబ వాతావరణం ప్రోత్సాహకరంగా ఉంటుంది. పెద్దల గురించి ఆందోళన చెందుతారు. కోర్టు వ్యవహరాలు, భూ తగాదాలు ఒక కొలిక్కి వస్తాయి. కాంట్రాక్టర్లు, బిల్డర్లకు నిర్మాణ పనుల్లో ఏకాగ్రత ముఖ్యం. వృత్తుల వారికి సదావకాశాలు లభిస్తాయి.