1. ఆధ్యాత్మికం
  2. భవిష్యవాణి
  3. దినఫలం
  4. Your Horoscope This Week: August 23 To 29

23-08-2016 నుంచి 29-08-2026 వరకు ఫలితాలు

weekly horoscope
మేషం : అశ్వని, భరణి 1, 2, 3, 4 పాదములు, కృత్తిక 1వ పాదం
లక్ష్యసాధనకు అవిశ్రాంతంగా శ్రమిస్తారు. మీ కష్టం ఫలిస్తుంది. వ్యూహాత్మకంగా అడుగులేస్తారు. ఆదాయం బాగుంటుంది. రుణవిముక్తులవుతారు. ఖర్చులు అధికం. పొదుపునకు అవకాశం లేదు. పనులు, కార్యక్రమాలు చురుకుగా సాగుతాయి. గురువారం నాడు అప్రమత్తంగా ఉండాల్సిన సమయం. అందరితోనూ మితంగా సంభాషించండి. ఆంతరంగిక విషయాలు గోప్యంగా ఉంచండి. ఆత్మీయుల రాక ఉల్లాసం కలిగిస్తుంది. వివాహయత్నం తీవ్రంగా సాగిస్తారు. కన్సల్టెన్సీలను ఆశ్రయించవద్దు. సంతానం మూలకంగా ఇబ్బందులెదురవుతాయి. పెద్దల జోక్యంతో సమస్య సద్దుమణుగుతుంది. వ్యాపారాల్లో లాభనష్టాలు సమీక్షించుకుంటారు. మీ పథకాలు ఆశించిన ఫలితాలిస్తాయి. ఉద్యోగ బాధ్యతల్లో నిర్లక్ష్యం తగదు. అధికారులకు వివరణ ఇచ్చుకోవలసి వస్తుంది. విందుకు హాజరవుతారు. 
 
వృషభం : కృత్తిక 2, 3, 4 పాదాలు, రోహిణి, మృగశిర 1, 2, పాదాలు
గ్రహాల సంచారం అనుకూలంగా ఉంది. అవిశ్రాంతంగా శ్రమిస్తారు. లక్ష్యం నెరవేరుతుంది. వస్తులాభం, వస్త్రప్రాప్తి ఉన్నాయి. ఆదాయం బాగుంటుంది. ఆప్తులకు సాయం అందిస్తారు. పనులు వేగవంతమవుతాయి. పలుకుబడి కలిగిన వారితో పరిచయాలేర్పడతాయి. మంగళవారం నాడు అనవసర విషయాల్లో జోక్యం తగదు. మీ గౌరవానికి భంగం కలుగకుండా మెలగండి. ఆరోగ్యం బాగుంటుంది. ఆహ్వానం అందుకుంటారు. తెగిపోయిన బంధుత్వాలు బలపడతాయి. మీ సిఫార్సుతో ఒకరికి సదవకాశం లభిస్తుంది. పత్రాల్లో సవరణలు అనివార్యం. ఉద్యోగ ఉపాధ్యాయులకు పనిభారం. వృత్తుల వారికి ఆదాయాభివృద్ధి, వ్యాపారాలు ప్రోత్సాహకరంగా సాగుతాయి. నష్టాలను భర్తీ చేసుకుంటారు. నూతన వ్యాపారాలు కలిసివస్తాయి. ఏకాగ్రతతో వాహనం నడపండి.
 
మిధునం : మృగశిర 3, 4 పాదాలు, ఆర్ద్ర, పునర్వసు 1, 2, 3 పాదాలు
ఆర్థికంగా నిలదొక్కుకుంటారు. దీర్ఘకాలిక సమస్యలు పరిష్కారమవుతాయి. ఖర్చులు విపరీతం. ప్రముఖులను ఆకట్టుకుంటారు. సభ్యత్వ స్వీకరణకు అనుకూలం. బాధ్యతగా మెలగండి. ఎవరినీ తక్కువ అంచనా వేయొద్దు. నిలిపివేసిన పనులు పూర్తి చేస్తారు. గురువారం నాడు ఫోన్ సందేశాలు పట్టించుకోవద్దు. బ్యాంకు వివరాలు గోప్యంగా ఉంచండి. దంపతులు మధ్య అవగాహన నెలకొంటుంది. ఇంటి విషయాలపై శ్రద్ధవహిస్తారు. పెద్దల ఆరోగ్యం కుదుటపడుతుంది. అయిన వారితో సంప్రదింపులు జరుపుతారు. మీ ఇష్టాయిష్టాలను కచ్చితంగా తెలియజేయండి. నిరుద్యోగుల కృషి ఫలిస్తుంది. ప్రైవేట్ ఉద్యోగస్తులకు మార్పులు అనుకూలిస్తాయి. ఉద్యోగ బాధ్యతల్లో తప్పిదాలను సరిదిద్దుకుంటారు. వ్యాపారాలు ప్రోత్సాహకరంగా సాగుతాయి. నూతన వ్యాపారాలకు అనుకూలం. 
 
కర్కాటకం : పునర్వసు 4వ పాదం, పుష్యమి, ఆశ్లేష
లావాదేవీలతో తీరిక ఉండదు. అకాలభోజనం, విశ్రాంతి లోపం. రావలసిన ధనం అందుతుంది. ఖర్చులు విపరీతం. రాబడిపై దృష్టిపెడతారు. పనులు చురుకుగా సాగుతాయి. పత్రాలు, అందుకుంటారు. ఒక సమాచారం ఊరటనిస్తుంది. అయిన వారితో ఉల్లాసంగా గడుపుతారు. వివాహయత్నం ఫలిస్తుంది. ఇచ్చిపుచ్చుకునే వ్యవహారంలో జాగ్రత్త. తాహతుకు మించి హామీలివవ్వద్దు. శనివారం నాడు మితంగా సంభాషించండి. ఒకరి వద్ద మరొకరి ప్రస్తావన తగదు. మీ మాటలు జారవేసే వారున్నారని గమనించండి. సంతానానికి శుభయోగం. గృహమరమ్మతులు చేపడతారు. వృత్తి వ్యాపారాలు ప్రోత్సాహకరంగా సాగుతాయి. నూతన పెట్టుబడులకు అనుకూలం. ఉద్యోగస్తుల సమర్ధతకు గుర్తింపు లభిస్తుంది. ఉపాధాయులకు కొత్త బాధ్యతలు. జూదాలు, బెట్టింగుల జోలికిపోవద్దు. 
 
సింహం : మఖ, పుబ్బ, ఉత్తర 1వ పాదం
ఈ వారం కొంతమేరకు అనుకూలం. పరిస్థితుల్లో మార్పువస్తుంది. రుణ ఒత్తిడి తొలగుతుంది. ఆదాయానికి తగ్గట్టుగా ఖర్చులుంటాయి. ఆహ్వానం అందుకుంటారు. తెగిపోయిన సంబంధాలు బలపడతాయి. వ్యూహాత్మకంగా అడుగులేస్తారు. మీ ఊహలు ఫలించకపోవచ్చు. వివాదాస్పద విషయాల జోలికి పోవద్దు. కొన్ని విషయాలు చూసీచూడనట్టు వదిలేయండి. ఆరోగ్యం నిలకడగా ఉంటుంది. దంపతుల మధ్య స్వల్ప కలహం. ఆత్మీయుల వాఖ్యలు కార్యోన్ముఖులను చేస్తాయి. కొత్త యత్నాలు చేపడతారు. మీ కృషి నిదానంగా ఫలిస్తుంది. నిరుత్సాహం వీడి ఇంటర్వ్యూలకు హాజరుకండి. నోటీసులు అందుకుంటారు. ఉద్యోగస్తులకు ధనప్రలోభం తగదు. కొత్తవ్యక్తులతో జాగ్రత్త. వ్యాపారాలు సామాన్యంగా సాగుతాయి. పెట్టుబడులు కలిసిరావు. న్యాయవాదులకు ఆదాయాభివృద్ధి. ప్రయాణం చేయవలసి వస్తుంది. 
 
కన్య : ఉత్తర 2, 3, 4 పాదాలు, హస్త, చిత్త 1, 2 పాదాలు
ప్రతికూలతలు అధికం. మంచి చేయబోతే చెడు ఎదురవుతుంది. అందరితోను మితంగా సంభాషించండి. ఖర్చులు అదుపులో ఉండవు. రాబడిపై దృష్టిసారిస్తారు. పనులు అస్తవ్యస్తంగా సాగుతాయి. ఆత్మీయులతో కాలక్షేపం చేస్తారు. ఒక సమాచారం ఉపశమనం కలిగిస్తుంది. కొత్త యత్నాలు చేపడతారు. ఇతరుల విషయాలు తెలుసుకోవాలన్న ఆసక్తి తగదు. సంతానం విద్యాయత్నం ఫలిస్తుంది. ముఖ్యుల కలయిక వీలుపడదు. దంపతులకు కొత్త ఆలోచనలొస్తాయి. మొండిధైర్యంతో ముందుకు సాగుతారు. ఆరోగ్యం జాగ్రత్త. ఆహ్వానం అందుకుంటారు. దూరపు బంధుత్వాలు బలపడతాయి. వాస్తుదోష నివారణ చర్యలు చేపడతారు. వ్యాపారాల్లో స్వల్ప చికాకులు మినహా ఇబ్బందులుండవు. ఉద్యోగస్తులకు సమయపాలన ప్రధానం. ప్రైవేట్ ఉద్యోగస్తులకు కష్టసమయం. అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడవద్దు.
 
తుల : చిత్త 3, 4 పాదాలు, స్వాతి, విశాఖ 1, 2, 3 పాదాలు
మీదైన రంగంలో రాణిస్తారు. అవకాశాలు కలిసివస్తాయి. శుభకార్యాన్ని ఘనంగా చేస్తారు. దూరపు బంధువుల రాక సంతోషం కలిగిస్తుంది. ఆదాయం బాగుంటుంది. విలాసాలకు విపరీతంగా వ్యయం చేస్తారు. సంస్థల స్థాపనకు అనుకూలం. పరిచయాలు ఉన్నతికి తోడ్పడతాయి. సకాలంలో పనులు పూర్తిచేస్తారు. శుక్రవారం నాడు ఆచితూచి అడుగేయండి. ఒత్తిళ్లు, ప్రలోభాలకు లొంగవద్దు. దంపతుల మధ్య ఏకాభిప్రాయం నెలకొంటుంది. ఆత్మీయుల వ్యాఖ్యలు కార్యోన్ముఖులను చేస్తాయి. కొత్త యత్నాలకు శ్రీకారం చుడతారు. మీ చొరవతో ఒక సమస్య సద్దుమణుగుతుంది. పెద్దల గురించి ఆందోళన చెందుతారు. కార్యక్రమాలు వాయిదా పడతాయి. వ్యాపారాల్లో పురోభివృద్ధి సాధిస్తారు. ఉపాధ్యాయులకు పదవీయోగం, బాధ్యతల మార్పు. నిరుద్యోగుల కృషి ఫలిస్తుంది. సన్మాన, సంస్కరణ కార్యక్రమాల్లో పాల్గొంటారు. 
 
వృశ్చికం : విశాఖ 4వ పాదం. అనూరాధ, జ్యేష్ట 1,2,3,4 పాదములు
వ్యవహారజయం, వస్త్రప్రాప్తి ఉన్నాయి. మాటతీరుతో ఎంతటివారినైనా ఆకట్టుకుంటారు. స్నేహసంబంధాలు బలపడతాయి. ఆదాయం సంతృప్తికరం. ఖర్చులు తగ్గించుకుంటారు. ఒక ఆహ్వానం ఆలోచింపచేస్తుంది. అయిన వారితో సంప్రదింపులు జరుపుతారు. మీ మాటే నెగ్గాలన్న పట్టుదలకు పోవద్దు. ఎదుటివారి అభిప్రాయాలకు విలువ ఇవ్వండి. అర్థాంతంగా ముగించిన పనులు పూర్తిచేస్తారు. శనివారం నాడు చెల్లింపులు, నగదు స్వీకరణలో జాగ్రత్త. ఎదురుచూస్తున్న పత్రాలు అందుతాయి. గృహనిర్మాణం పూర్తి కావస్తుంది. శుభకార్యానికి సన్నాహాలు సాగిస్తారు. మీ సిఫార్సుతో ఒకరికి సదవకాశం లభిస్తుంది. ప్రైవేట్ ఉద్యోగస్తులకు అంకితభావం ముఖ్యం. వ్యాపారాల్లో ఒడిదుడుకులను అధిగమిస్తారు. మీ పథకాలు సత్ఫలితాలిస్తాయి. ఆరోగ్యం బాగుంటుంది. కొత్త ప్రదేశం సందర్శిస్తారు. 
 
ధనస్సు : మూల, పూర్వాషాడ 1 2 3 4 పాదములు, ఉత్తరాషాడ 1వ పాదం
సర్వత్రా అనుకూలతలు నెలకొంటాయి. చక్కని ప్రణాళికలతో ముందుకు సాగుతారు. అప్రయత్నంగా అవకాశాలు కలిసివస్తాయి. ధనలాభం, వస్త్రప్రాప్తి ఉన్నాయి. రుణవిముక్తులై తాకట్టు విడిపించుకుంటారు. పనులు సానుకూలమవుతాయి. మంగళవారం నాడు ఇతరులను మీ విషయాలకు దూరంగా ఉంచండి. ప్రలోభాలకు లొంగవద్దు. మీ శ్రీమతికి అన్ని విషయాలు తెలియజేయండి. స్వల్ప అస్వస్థతకు గురవుతారు. వైద్యసేవలు అవసరమవుతాయి. ఆత్మీయులతో తరచు కాలక్షేపం చేస్తారు. అవివాహితులకు శుభవార్తా శ్రవణం. పత్రాల్లో మార్పులు సాధ్యపడతాయి. ఉపాధి పథకంలో నిలదొక్కుకుంటారు. సాంకేతిక రంగాల వారికి ఆదాయాభివృద్ధి. వ్యాపారాలు ఊపందుకుంటాయి. సంస్థల స్థాపనకు అనుకూలం. శుభకార్యంలో పాల్గొంటారు. బంధుమిత్రుల ఆదరణ ఆకట్టుకుంటుంది. 
 
మకరం : ఉత్తరాషాడ 2, 3, 4 పాదాలు. శ్రవణం, ధనిష్ట 1, 2 పాదాలు
ఆదాయం నిరాశాజనకం. ఖర్చులు అంచనాలను మించుతాయి. రుణాలు, చేబదుళ్లు స్వీకరిస్తారు. ఆలోచనలు నిలకడగా ఉండవు. పనులు మొక్కుబడిగా పూర్తిచేస్తారు. ఆదివారం నాడు ప్రముఖుల ఇంటర్వ్యూ వీలుపడదు. కార్యక్రమాలు వాయిదా వేసుకుంటారు. పత్రాల్లో సవరణలు అనివార్యం. తరచు సన్నిహితులతో కాలక్షేపం చేస్తారు. దంపతుల మధ్య అవగాహన నెలకొంటుంది. వివాహయత్నం తీవ్రంగా సాగిస్తారు. ఒక సంబంధం ఆసక్తి కలిగిస్తుంది. అవతలి వారి తాహతును క్షుణ్ణంగా తెలుసుకోండి. మధ్యవర్తుల మాటలు విశ్వసించవద్దు. నిరుద్యోగులకు ఉపాధి అవకాశం కలిసివస్తుంది. ఉద్యోగ విధుల పట్ల అలక్ష్యం తగదు. వ్యాపారాలు మందకొడిగా సాగుతాయి. ఆకర్షణీయమైన పథకాలు రూపొందిస్తారు. నిర్మాణాలు ఊపందుకుంటాయి. బిల్డర్లు, కార్మికులకు పనులు లభిస్తాయి. 
 
కుంభం : ధనిష్ట 3, 4 పాదాలు, శతభిషం, పూర్వాబాద్ర 1, 2, 3 పాదాలు
వ్యవహార ఒప్పందాల్లో ఏకాగ్రత వహించండి. తప్పటడుగు వేసే ఆస్కారం ఉంది. నిపుణులను సంప్రదించండి. మీ నిర్ణయం వాయిదా వేయటం ఉత్తమం. పనుల ప్రారంభంలో ఆటంకాలెదురవుతాయి. ప్రతి చిన్న విషయానికీ అసహనం చెందుతారు. ప్రశాంతంగా ఉండటానికి యత్నించండి. ఏ విషయాన్నీ తీవ్రంగా భావించవద్దు. వ్యాపకాలు సృష్టించుకోవటం శ్రేయస్కరం. ఖర్చులు అంచనాలను మించుతాయి. అవసరాలు వాయిదా వేసుకుంటారు. చెల్లింపుల్లో జాప్యం తగదు. సోమవారం నాడు అనుకోని సంఘటన ఎదురవుతుంది. సన్నిహితులతో సంభాషిస్తారు. ప్రముఖుల జోక్యంతో సమస్య సద్దుమణుగుతుంది. వ్యాపారాలు సామాన్యంగా సాగుతాయి. చిన్న వ్యాపారులకు నిరాశాజనకం. ఉద్యోగ బాధ్యతల పట ఏకాగ్రత వహించండి. ప్రయాణం విరమించుకుంటారు. 
 
మీనం : పూర్వాబాద్ర 4వ పాదం, ఉత్తరాబాద్ర, రేవతి
అవిశ్రాంతంగా శ్రమిస్తారు. అవకాశం చేజారినా ఒకందుకు మంచికే. మీ కష్టం నిదానంగా ఫలిస్తుంది. ఓర్పుతో మెలగండి. సాయం ఆశించవద్దు. మీ సమర్థతపై నమ్మకం పెంచుకోండి. పనుల్లో ఆటంకాలెదురైనా అనుకున్న విధంగా పూర్తి చేస్తారు. ఖర్చులు విపరీతం. పొదుపు ధనం ముందుగా గ్రహిస్తారు. బుధవారం నాడు నగదు డ్రా చేసేటపుడు జాగ్రత్త. చుట్టుపక్కల వారిని గమనించండి. ఆత్మీయుల ఆహ్వానం సంతోషం కలిగిస్తుంది. దంపతులు ఏకాభిప్రాయానికి రాగల్గుతారు. తెగిపోయిన బంధుత్వాలు బలపడతాయి. సంతానం మొండితనం అసహనం కలిగిస్తుంది. అనునయంగా మెలగండి. ఉద్యోగస్తులు తప్పిదాలను సరిదిద్దుకుంటారు. ఉపాధి పథకంలో నిలదొక్కుకుంటారు. వ్యాపారాల్లో స్వల్ప చికాకులు మినహా ఇబ్బందులుండవు. ఏకాగ్రతతో వాహనం నడపండి. 
About Writer
పి.ప్రసూనా రామన్
తర్వాతి కథనం
23-08-2026 ఆదివారం నాటి మీ రాశి ఫలితాలు-అనుకూలతలు అంతంత మాత్రమే