1. ఆధ్యాత్మికం
  2. భవిష్యవాణి
  3. వార్షిక ఫలం
  4. Horoscope 2020 Scorpio Yearly Predictions

2020 సంవత్సర ఫలితాలు- వృశ్చిక రాశి వారి ఫలితాలు ఎలా వున్నాయో తెలుసా?

Yearly predictions
వృశ్చికం : విశాఖ 4వ పాదం, అనూరాధ, జ్యేష్ట 
ఆదాయం: 5 వ్యయం : 5 రాజ్యపూజ్యం : 3 అవమానం : 3
 
ఈ రాశివారి గోచారం పరిశీలించగా ఆదాయం ఎంత వచ్చినా చేతిలో ధనం నిలవదు. కుటుంబ పరిస్థితులు ఆందోళన కలిగిస్తాయి. సంతానం కోసం విపరీతంగా శ్రమిస్తారు. తరచూ ఆరోగ్యం భంగం, ప్రశాంతత లోపిస్తాయి. ఆత్మీయుల సాయంతో కొన్ని సమస్యలు సద్దుమణుగుతాయి. స్థిరాస్తుల విక్రయం తగదు. ఆధ్యాత్మికత పెంపొందుతుంది. 
 
శుభకార్య యత్నాలు తీవ్రంగా సాగిస్తారు. ప్రభుత్వ కార్యాలయాల్లో పనులు సానుకూలమవుతాయి. సోదరులతో సంప్రదింపులు ఫలిస్తాయి. ఆస్తి వివాదాలకు పరిష్కారం లభిస్తుంది. వృత్తుల వారికి ఆదాయం బాగుంటుంది. ఉద్యోగస్తులకు బాధ్యతల మార్పు. 
 
అధికారులకు స్థానచలనం, ఉపాధ్యాయులకు పదోన్నతి. వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. కాంట్రాక్టులు, ఏజెన్సీలు దక్కించుకుంటారు. సంస్థల స్థాపనలకు అనుకూలం. పాస్‌పోర్టు, వీసాలు పొందుతారు. కళ, క్రీడాకారులకు ప్రోత్సాహకరం. 
 
విశాఖ నక్షత్రం వారికి కనకపుష్యరాగం, అనూరాధ వారికి పుష్యనీలం, జ్యేష్ఠవారికి గరుడపచ్చ ధరించిన శుభం కలుగుతుంది. కార్తీకేయుడిని ఆరాధించడం వల్ల ఆటంకాలు తొలగిపోగలవు. విశాఖ నక్షత్రం వారు మొగలి మొక్కను దేవాలయాల్లో కానీ, విద్యాసంస్థల్లో కానీ, ఖాళీ ప్రదేశాల్లో కానీ నాటి దాని అభివృద్ధికి పాటుపడిన శుభం కలుగుతుంది.
About Writer
రామన్