శనివారం, 11 జనవరి 2025
  1. ఆధ్యాత్మికం
  2. భవిష్యవాణి
  3. వార్షిక ఫలం
Written By రామన్
Last Updated : మంగళవారం, 17 డిశెంబరు 2019 (15:44 IST)

2020 సంవత్సర ఫలితాలు- మిథున రాశి వారి ఆదాయం ఎంతంటే?

మిథునం : మృగశిర 3, 4 పాదాలు, ఆర్ద్ర, పునర్వసు 1, 2, 3 పాదాలు 
ఆదాయం: 2 వ్యయం : 11 రాజ్యపూజ్యం: 2 అవమానం : 4
 
కార్యసాధనకు ఓర్పు ప్రధానం. స్వయం కృషితోనే రాణిస్తారు. పట్టుదలతోనే అనుకున్నది సాధిస్తారు. శుభకార్యాలపై దృష్టి పెడతారు. ఆదాయ వ్యయాల్లో ఒడిదుడుకులు తప్పవు. రుణ ఒత్తిడి అధికం. సంతానం విషయంసో శుభపరిణామాలున్నాయి. బంధువులతో సంబంధాలు వికటిస్తాయి. పెద్దల గురించి ఆందోళన చెందుతారు. గృహంలో మార్పుచేర్పులు తప్పవు. స్థిరాస్తి విక్రయంలో పునరాలోచన అవసరం. తొందరపాటు నిర్ణయాలు తగవు.
 
మీ శ్రీమతి సలహా పాటించండి. ఉద్యోగ బాధ్యతల్లో మార్పులుంటాయి. తరచూ యూనియన్ వ్యవహారాల్లో పాల్గొంటారు. నిరుద్యోగులకు ఉద్యోగ ప్రాప్తి, వ్యాపారాలు పురోగతిన సాగుతాయి. పెట్టుబడులకు అనుకూలం. భాగస్వామిక ఒప్పందాలు కుదుర్చుకుంటారు. ఆధ్యాత్మికత పట్ల ఆసక్తి కలుగుతుంది. తరచూ ప్రయాణాలు చేస్తారు. కళాకారులకు ప్రోత్సాహకరం. కోర్టు వ్యవహారాలు ఒక పట్టాన పరిష్కారం కావు. 
 
మృగశిర నక్షత్రం వారు తెల్ల పగడం, ఆరుద్ర నక్షత్రం వారు ఎర్రగోమేధికం, పునర్వసు నక్షత్రం వారు వైక్రాంతమణి ధరించిన పురోభివృద్ధి సాధిస్తారు. నిత్యం లలితా సహస్రనామం పఠనం శుభదాయకం.