2020 సంవత్సర ఫలితాలు- వృషభ రాశి వారి ఫలితాలు ఎలా వున్నాయో తెలుసా?

Taurus
రామన్| Last Updated: మంగళవారం, 10 డిశెంబరు 2019 (21:32 IST)
వృషభరాశి : కృత్తిక 2, 3, 4 పాదాలు, రోహిణి, మృగశిర 1, 2 పాదాలు.


ఆదాయం : 14 వ్యయం : 11 రాజ్యపూజ్యం : 6 అవమానం: 1

పదవులు, సభ్యత్వాలు స్వీకరిస్తారు. గౌరవ మర్యాదలు పెంపొందుతాయి. హామీలు నిలబెట్టుకుంటారు. వివాహ యత్నం ఫలిస్తుంది. ఆదాయ వ్యయాలు సంతృప్తికరం. స్థిరాస్తి, వాహనం అమర్చుకుంటారు. సోదరులతో అవగాహన నెలకొంటుంది.

ఆస్తి వివాదాలు కొలిక్కి వస్తాయి. ప్రియతముల గురించి ఆందోళన చెందుతారు. సంతానానికి విదేశీ విద్యావకాశం లభిస్తుంది. వ్యాపారాలు, పరిశ్రమల స్థాపనలకు అనుకూలం. సొంత వ్యాపారాలే శ్రేయస్కరం. ఏజెన్సీలు, టెండర్ల దక్కించుకుంటారు.

ఆరోగ్యం పట్ల
శ్రద్ధ వహించాలి. తరుచు వైద్య పరీక్షలు చేయించుకోవడం ఉత్తమం. ఉపాధ్యాయులకు, ఉద్యోగస్తులకు పదోన్నతి. అధికారులకు స్థానచలనం. వృత్తిల వారికి సామాన్యం. కళ, క్రీడాకారులకు ప్రోత్సాహకరం. తరచూ ప్రయాణాలు చేస్తారు. దైవ చింతన అధికమవుతుంది.

కృత్తికా నక్షత్రం వారు స్టార్ రూబి, రోహిణి నక్షత్రం ముత్యం, మృగశిర నక్షత్రం వారు పగడం ధరించినట్లైతే శుభం కలుగుతుంది. ఈ రాశివారు లక్ష్మీగణపతిని తెల్లనిపూలతో పూజించి ఇష్టకామేశ్వరి దేవిని ఎర్రని పూలతో పూజించడం వల్ల
సమస్యలు తొలగి మానసికంగా కుదుటపడతారు.దీనిపై మరింత చదవండి :